బ్రహ్మ కపాలం
బ్రహ్మజననం ప్రళశ్లో: చతుర్ముఖాంభోజ వరహంసవధూ: మమ మానసే రమతాం నిత్యం సర్వ శుక్లా సరస్వతీ బంగారము వంటి ప్రశస్తమైన ఙ్ఞానము కలవాడు బ్రహ్మ, వేదనిధి, సృష్టికర్త.సరస్వతీదేవి విద్యాప్రదాయిని,వాగ్దేవత. యకాలంలో విశ్వమంతా జలమయమైపోయంది. ఎక్కడచూసినా నీరు కనిపించేది. అలాంటి సమయంలో శ్రీమన్నారాయణుడు అంగ భూతమైన శేషతల్పాన పరమానంద స్వరూపముతో యోగ నిద్రలో పడుకొన్నాడు. అలా వేయి మహాయుగములు గడిచిపోయాయ. కాల శక్తి బ్రహ్మరాత్రి (కృతాది నాలుగు యుగాలను ఒ మహాయుగంగా)గా గడచిన తర్వాత స్వామిని మేల్కొలిపింది. శేషతల్పంపై పడుకొని యున్న స్వామి యొక్క నాభి రంధ్రం నుండి అర్థవికసితమైన ఒక దివ్య పద్మం ఉదయించింది. దానిలో స్వామిలో విలీనమైన సమస్త పదార్థాలు అతి సూక్ష్మ రూపాన నిక్షిప్తమైయ్యాయ. జగత్తు జలమై కనిపించింది. స్వామి నాభియందు అంకురించిన తామరమొగ్గ వికసించింది. దానికాంతి నాలుగు దిక్కులకు వ్యాపించింది.దాని వల్ల జగత్తు ప్రకాశం అయంది. ఈ కమలంలో బ్రహ్మదేవుని ఆవిర్భావం జరిగింది. దీనితో బ్రహ్మ కల్పం ప్రారంభమైంది. చరాచర సృష్టి చేయుటకు వీలైంది. ఈ విధంగా అంతర్ మహిమలతో శ్రీ అనంత పద్మనాభుడు శేష తల్పముపై పవళించాడు. శ్రీహరి నాభి నుండి జన్మించిన బ్రహ్మ తన జన్మ రహస్యం తెలియక జన్మించిన పద్మం ఏ విధంగా జన్మించినది, దాని నుండి నా జన్మ ఏమి అని విచారిస్తూ అగాథం విశాలమైన ఈ సముద్రంలో ఏ విధంగా జన్మించినదో తెలుసుకోవడానికి నాలుగు దిక్కుల చూసాడు. దీనితో బ్రహ్మకు నాలుగుతలలు గలవాడుగా, చతుర్ముఖుడుగా ప్రసిద్ధుడయాడు. కాని బ్రహ్మకు పద్మం యొక్క జన్మ స్థానాన్ని తెలుసుకోవడానికి పద్మపు కాడ అంతర్భాగంలో వెతికాడు. విసుగు చెంది నూరు దివ్య సంవత్సరములు తపమాచరించాడు. అపుడు బ్రహ్మకు సంపూర్ణ జ్ఞానము సిద్ధించింది. తాను చూసేది అత్యంత అద్భుతమైనదిగా అర్థం చేసుకొన్నాడు. ఆదిశేషుని పడగలను ఆధారం చేసుకొని పవళించిన శ్రీహరిని గమనించాడు. తన్మయుడయ్యాడు. స్వామి శిరమున కిరీట మకుటాలు, మణిబంధమునందు కంకణములు, వక్షస్థలమున ముత్యాల హారములు, బాహులయందు భుజకీర్తులు, నడుమున మణులు కూర్చి కఠికాభరణములు, పట్టు పీతాంబరమును కంఠమున కంఠహారమును కౌస్యుభమణి, తనువు నల్లని కలువల కాంతులతో దేదీప్యమానంగా శోభిల్లుతుండడం చూసి పారవశ్యం చెందాడు. అంత విశ్వసుందరుడైన పరమాత్మ దర్శనంతో తన జన్మ సార్థకమమైనదని పరమేశ్వరునకు నమస్కరించాడు. నన్ను అనుగ్రహించి, నా బుద్ధి ఈ విశ్వసృష్టి కార్యానికి ఉపయోగపడునట్లుగా చేయుమని ప్రార్థించాడు. అకుంటితమైన నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసాడు. తపస్సునకు శ్రీహరి కరుణించాడు. బ్రహ్మకోరికను తెలుసుకొన్నాడు. జగత్ సృష్టికి ఆజ్ఞాపించాడు. అప్పుడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. స్థిరముగా నుండు వృక్షములు అడ్డముగా నడిచే పశువులు, ఆకాశాన పయనించు పక్షులు, మానవులు, సిద్ధులు, చారుణులను, దేవతలను ఇలా రకరకాలైన సృష్టి జరిగింది. అదియేకాక అపార విజ్ఞాన భాండాగారమైన నాలుగు వేదాలు పొందాడు. స్వామి అనుగ్రహముతో పూర్వపు జన్మరహస్య రీతిగనే మరల సృష్టి ప్రారంభించాడు.
బ్రహ్మ ముహూర్తం
ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహుర్తం అంటారు. ఒక పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడానికి నిర్ణయించుకున్న మూహుర్తాన్ని మంచి ముహుర్తం అంటారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కాలాన్ని అనగా తెల్లవారుజామును మంచి ముహుర్తం అంటారు. అందువలనే తెల్లవారుజామున ప్రారంభించిన పని ఏటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయంటారు. తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు రెండు ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించవలెనని అంటారు. బ్రహ్మ మూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేకమంది నూతన గృహప్రవేశంనకు ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంనందే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది. కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం .. కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం .. వ్యాసం , ఇతిహాసం ఆ వ్యాసుడు ప్రవచిన్చంగా కాంతం గణపతిడై కురు చరితము విరచిన్చంగా యజ్జుసామురుక్ అదర్వ శాకలుగా ఆ ఆ .యా …యా …
బ్రహ్మ కపాలం'[అవతార రహస్యాలు]
పూర్వం తన ఆద్యంతాలు తెలుసుకోవలసిందిగా బ్రహ్మ - విష్ణులతో శివుడు చెప్పాడు. తల భాగం కనుక్కునే దిశగా వెళ్లిన బ్రహ్మకి, అది అసాధ్యమని తెలిసి వెనుదిరిగి వచ్చి తాను కనుక్కున్నట్టు శివుడితో చెబుతాడు. ఆయన అబద్ధం చెప్పడంతో కోపించిన శివుడు, అసత్య దోషానికి ఫలితం అనుభవించమంటూ భైరవుడిని సృష్టిస్తాడు. బ్రహ్మ తన పంచ ముఖాలలో ఏ ముఖంతో అయితే అసత్యమాడాడో, ఆ ముఖాన్ని తీసివేయవలసిందిగా ఆదేశిస్తాడు. రుద్రుడి ఆదేశాన్ని అక్షరాలా అమలుపరిచిన భైరవుడు, బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడే మార్గాన్ని సూచించమని శివుడిని కోరతాడు. బ్రహ్మ తల ఎక్కడైతే పడిందో ... ఆ ప్రదేశాన్ని దర్శించడం వలన ఆ పాపం తొలగిపోతుందని చెబుతాడు శివుడు. అలా బ్రహ్మ తల పడిన ప్రదేశమే 'బ్రహ్మకపాలం'గా ప్రసిద్ధిచెందింది. ఆ తరువాత బ్రహ్మ దేవుడు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయగా, ఆయన తల పడిన ప్రదేశం పితృకార్యాలకు ప్రసిద్ధి చెందుతుందని వరాన్ని అనుగ్రహిస్తాడు శివుడు ఆనాటి నుంచి బ్రహ్మ కపాలంలో పితృకార్యాలు విరివిగా నిర్వహించబడుతూ వస్తున్నాయి. బ్రహ్మకపాలం పితృదేవతలను పుణ్య లోకాలకు తరలించడమే కాకుండా, ఇక్కడ ఎవరైతే పితృకార్యాలను నిర్వహిస్తారో వారి దోషాలను కూడా నశింపజేస్తుందని స్థలపురాణం చెబుతోంది. బదరీ వెళ్లిన వారు 'బ్రహ్మ కపాలం' అనే ప్రదేశంలో పితృకార్యాలు నిర్వహిస్తూ వుంటారు. ఇక్కడ పితృ కార్యాలు జరపడం వలన, వారికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతుంటారు. ఈ కారణంగానే ఈ క్షేత్రంలో పితృకార్యాలు నిర్వహిస్తూ, వారికి పుణ్య లోకాలు కలిగేలా చేస్తుంటారు. అయితే ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించడానికి ... దీనికి ఈ పేరు రావడానికి సంబంధమైన వెనుక పురాణ కథ ఇది. బ్రహ్మ దేవాలయం, పుష్కర్ పుష్కర్ సరస్సు ఒడ్డున బ్రహ్మ దేవుని ఆలయం ఉంది. భారతదేశంలో బ్రహ్మ దేవుని కోసం నిర్మించిన అతి కొద్ది ఆలయాలలో ఇది ఒకటి. ఒక హిందూ జానపథ కథ ననుసరించి బ్రహ్మా దేవుడు పుష్కర్ వద్ద ఒక యజ్ఞం (అగ్నిని పూజించడం) నిర్వహిద్దామనుకొన్నాడు అయితే నియమిత సమయానికి యజ్ఞ్నాన్ని నిర్వహించడానికి అతని భార్య సావిత్రి అందుబాటులో లేకపోవడంతో . బ్రహ్మ దేవుడు యజ్ఞాన్ని నిర్వహించడానికి గాయత్రీ అనే స్థానిక గొల్ల పిల్లను వివాహం చేసుకోవలసి వచ్చింది. ఈ చర్య అతని భార్య సావిత్రికి కోపం తెప్పించింది. ఆమె బ్రహ్మ దేవుని పుష్కర్ లో తప్ప వేరొక ప్రాంతంలో పూజించరని శపించిందివాస్తవానికి ఈ దేవాలయం 14 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయంలో ఒక కమలంలో ఎడమవైపు తన చిన్న భార్య గాయత్రీ, కుడివైపు సావిత్రి తో బాటు కూర్చొని ఉన్న నాలుగు శిరస్సుల బ్రహ్మ దేవుని గొప్ప చిత్రం ఉంది. భగవాన్ వేదవ్యాసునిచే రచించబడిన ప్రస్థానత్రయంలో ఒకటైన ఈ బ్రహ్మసూత్రాలు తత్త్వ విచారణకు పరమావధి. ఈ మహర్షి మహోన్నత జ్ఞానశిఖరాన్ని అధిష్టించి, ఈ తత్త్వాన్ని మానవాళికి అందచేసారు. సామాన్యులకు ఈ శిఖరారోహణం కష్టసాధ్యం. అందుకే జగద్గురు శంకరాచార్యులు తమ భాష్యంచే ఈ జ్ఞాన శిఖరారోహణానికి సులువైన మార్గాన్ని ఏర్పరిచారు. పరబ్రహ్మాన్ని గురించి చెప్తాయి కాబట్టి బ్రహ్మసూత్రాలు, సర్వసంగపరిత్యాగి అయిన సన్యాసిచే అద్యయనం చెయ్యవసినవి కాబట్టి భిక్షుసూత్రాలని, శరీరంలో ఉన్న జీవుడ్ని గురించి తెలిపేవి కాబట్టి శారీరిక శాస్త్రమని, బదరీ వృక్ష ఛాయలో నివసించే వ్యాసునిచే రచించబడ్డాయి కాబట్టి బాదరాయణ సూత్రాలనీ వీటిని వ్యవహరిస్తారు. ఈ సూత్రాలు తన బుద్ధికి తోచినట్టు రాసినవి కావు. శ్రుతి, స్మృతి సమ్మతంగా వెలయించబడ్డాయి. ఇందులో రెండు సిద్ధాంతాలు ప్రత్యేకతని సంతరించుకున్నాయి. ఒకటి - మానవుడు ఆపేక్షించవలసినది స్వర్గం కాదు; మోక్షం; అంటే జనన మరణాల నుండి విడివడడం. రెండు – జీవునికి, పరబ్రహ్మానికి బేధం లేదు. ఇద్దరూ ఒక్కటే. అందుకని స్థూలంగా ఇందులో పరబ్రహ్మ నిర్వచనం, జీవుని పరలోక యాత్ర, మోక్ష పలితం తెలియచేయబడ్డాయి. ఈ వివరణ చూసి ఈ తరం వారు ఇది వేదాంతవిషయమనీ, మతపరమనీ, తమకి అవసరం లేదనీ విముఖత చూపుతున్నారు. ఈ పొరపాటుని పెద్దలందరూ సరిదిద్దాలి. ఒక విధంగా చూస్తే భారాతీయతత్త్వశాస్త్రానికి, అది ఆస్తికదర్శనరూపంలో ఉన్నా, నాస్తికదర్శనరూపంలో ఉన్నా, ఉపనిషత్తులు మూలకందం అన్నట్టు కనబడుతుంది. ఆస్తికదర్శనాలన్నీ ఉపనిషత్తుల ప్రామాణ్యాన్ని ప్రత్యక్షంగానే అంగీకరిస్తాయి. వేదాలకి ప్రామాణ్యం అంగీకరించని నాస్తికదర్శనాలు కూడా ఎన్నో ఔపనిషదసిద్ధాంతాలని తమలో ఇముడ్చుకున్నాయి. దర్శనాలు ఆస్తికదర్శనాలనీ, నాస్తికదర్శనాలనీ విభజించబడ్డాయి. వేదప్రామాణ్యాన్ని అంగీకరించే న్యాయ – వైశేషిక – సాంఖ్య – యోగ - పూర్వోత్తరమీమాంసాదర్శనాలు ఆస్తికదర్శనాలనీ, లోకాయతిక – జైన – యోగాచార – సౌత్రాంతిక – వైభాషిక – మాధ్యమిక దర్శనాలు నాస్తికదర్శనాలనీ వ్యవహారం. ఈనాడు దర్శనాలన్నింటిలోకి ఉత్తమదర్శనంగా పరిగణింపబడుతున్న ఉత్తరమీమాంసాదర్శనం ఈ దర్శనాలలో పేర్కొనకపోవడం ఆశ్చర్యజనకం. ఆ విధంగా దర్శనాల లిస్టులోకే ఎక్కని ఈ దర్శనానికి అత్యుత్తమమైన స్థానం సంపాదించిన ఘనత శ్రీశంకరభగవద్పాదులకి మాత్రమే దక్కింది. బ్రహ్మసూత్రాలకి ముందు ఏవేవో ఒకటి రెండు వృత్తులు, చిన్న చిన్న వ్యాఖ్యానాలు ఉండేవేమో కానీ వాటి ద్వారా ఈ దర్శనానికి ఒక స్వతంత్రప్రతిపత్తి లభించలేదు. ఈనాడు ఆరు ఆస్తికదర్శనాలు, ఆరు నాస్తికదర్శనాలు అనేవి ప్రచారంలో ఉన్నాయని గమనించాం. శ్రీ శంకరభగవద్పాదులు తమ సిద్ధాంతాన్ని స్థిరంగా నిలబెట్టడం కోసం అంతకు పూర్వం ఉన్న దర్శనాలలోని కొన్ని అంశాలను బాదరాయణ సూచిత మార్గంలో ఖండించారు. అందుచేత ఆ దర్శనాల స్వరూపం కూడా సంక్షిప్తంగా తెలుసుకోవడం అవసరం. వాటి సంక్షిప్త స్వరూపం ఇదీ:
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565