జంధ్యం ప్రాముఖ్యత
హిందూ సాంప్రదాయం ప్రకారం బ్రాహ్మణులు జంధ్యం ధరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే జంధ్యం ధరిస్తున్నారు. కానీ ఒకప్పుడు క్షత్రియులు, వైశ్యులు కూడా జంధ్యం ధరించేవారు. బ్రాహ్మణులైతే 8వ ఏట, క్షత్రియులకు 11వ ఏట, వైశ్యులకు 12వ ఏట జంధ్యం ధరింపజేస్తారు.
సాధారణంగా ఈ కార్యక్రమాన్ని ఏడాదికి ఒకసారి శ్రావణ పూర్ణిమ నాడు నిర్వహిస్తారు. ఈ తంతునే ఉపనయనం అని కూడా పిలుస్తారు. ఉపనయనంలో ధరింపజేసే జంధ్యాన్ని జందెం, జందియం, యజ్ఞోపవీతం అని కూడా పిలుస్తారు. అయితే ఇలా జంధ్యం ధరింపజేయడం వెనుక మనకు తెలియని ఎన్నో ఉపయోగకర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందువులు పాటించాల్సిన 16 సంస్కారాల్లో 10వ సంస్కారంగా జంధ్యం ధరించడాన్ని చెబుతారు. జంధ్యం ధరించిన వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుందట. వారు అమితమైన తెలివితేటలను ప్రదర్శిస్తారట. మలబద్దకం, అజీర్ణం వంటి జీర్ణాశయ సంబంధ సమస్యలు దరి చేరవట.
జంధ్యం ధరింపజేసే సమయంలో నేలపై కాళ్లను మడత పెట్టి కూర్చుంటారు. ఇలా కూర్చోవడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట.
జంధ్యంలో ఉండే మూడు దారాలు ముగ్గురు దేవతల స్వరూపాలని భావిస్తారు. ఒకరు శక్తినిచ్చే పార్వతి, మరొకరు ధనాన్నిచ్చే లక్ష్మి, ఇంకొకరు చదువునిచ్చే సరస్వతి. ఈ క్రమంలో జంధ్యం ధరించడం వల్ల ఆ ముగ్గురు దేవతల అనుగ్రహం పొందవచ్చట. దీంతో జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుందట.
జంధ్యం ధరించిన వారికి నెగెటివ్ ఆలోచనలు రావట. వారు ఎల్లప్పుడూ పాజిటివ్ దృక్పథాన్నే కలిగి ఉంటారట. దీనికి తోడు వారికి పాజిటివ్ శక్తి కూడా అందుతుందట.
జంధ్యం ధరించిన వారికి బీపీ వంటి సమస్యలు రావట. అన్ని కార్యక్రమాల్లోనూ వారు ముందుంటారట. ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తారట.
శుభకార్యాలలో, మామూలు సమయాల్లో జంధ్యాన్ని ఎడమ భుజం మీద నుండి వ్రేలాడుతూ కుడి వైపు నడుము చేరేటట్టు వేసుకుంటారు. అశుభ కర్మలప్పుడు కుడి భుజం మీదుగా ఎడమవైపు నడుమును తగిలేటట్టు వేసుకుంటారు. మలమూత్రం చేసేటప్పుడు మెడలో దండ లాగా ఉండే విధంగా వేసుకుంటారు. అలా జంధ్యం వేసుకోకుంటే వారికి అరిష్టం కలుగుతుందని చెబుతారు.

Hi, Its very Good Information....But small query about Food while Yagnopaveetham wearing like Non-veg and Veg.....Because as a Kshathriya they are Non Vegetarians so how could we consider it
ReplyDelete