మధుమేహమనేది ఎన్నో ప్రమాదకర వ్యాధులకు సింహద్వారం! ముందుగానే గుర్తించి దీన్ని కచ్చితంగా నియంత్రణలో పెట్టుకుంటే సరే! లేకపోతే ఇది పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకుండానే... చాప కింద నీరులా ఒళ్లంతా గుల్ల చేసేస్తుంది. కళ్ల నుంచి కాళ్ల వరకూ.. గుండె నుంచి గోళ్ల వరకూ.. శరీరం మొత్తాన్నీ చెద పురుగులా తినేస్తుంది. ఇంతటి పెను ముప్పు మన ఒంట్లో పాగా వేసినా ఆ విషయం మనం తెలుసుకోకపోతే నష్టం ఎవరికి?
మధుమేహం.. నేడు పరిచయం అక్కర్లేని పెను విపత్తు! యావత్ ప్రపంచాన్నీ వూపేస్తున్న ఈ సునామీ మన దేశాన్ని మరింతగా కబళిస్తోంది. ఏటా కొత్తగా ఎంతోమంది దీని బారినపడుతున్నారు. అయినా చాలామందికి అసలా విషయమే తెలియటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల్లో దాదాపు 50% మందికి.. అంటే 19.3 కోట్ల మందికి.. ఇంకా చెప్పాలంటే ప్రతి ఇద్దరు మధుమేహుల్లో ఒకరికి.. అసలు తమకీ సమస్య వచ్చిందన్న సంగతే తెలియటం లేదు. అంటే మనం ఎంత పెద్ద ప్రమాదం అంచున ఉన్నామో తెలుసా?
మధుమేహం వచ్చినా చాలాకాలం పైకి మనకెలాంటి సంకేతాలూ ఉండకపోవచ్చు. కానీ లోపల జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది. అందుకే క్రమం తప్పకుండా రక్తపరీక్ష చేయించుకుంటూ.. ఒకవేళ మనకు మధుమేహం వచ్చిందేమో తెలుసుకోవటం చాలా అవసరం. అందుకే ఈ ‘ఏటి మధుమేహ దినం’ సందర్భంగా.... ఈ పెను ముప్పును విస్మరించకండి.. మధుమేహంపై ఓ కన్నేసి ఉంచండి అని ప్రత్యేకంగా పిలుపిస్తోంది ప్రపంచ మధుమేహ సమాఖ్య!
* మధుమేహుల్లో 46.5% మందికి.. అంటే దాదాపు సగం మందికి.. ఇంకా చెప్పాలంటే ప్రతి ఇద్దరు మధుమేహుల్లో ఒకరికి.. అసలు తమకు మధుమేహం వచ్చిందన్న సంగతే తెలియటం లేదు.
* ప్రపంచవ్యాప్తంగా నేడు అంధత్వానికి మధుమేహమే అతి ముఖ్యమైన కారణంగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రతి ముగ్గురు మధుమేహుల్లో ఒకరు రెటినోపతి సమస్యతో సతమతమవుతున్నారు.
* ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంపై పెడుతున్న మొత్తం ఖర్చులో దాదాపు 12% ఒక్క మధుమేహం మీదే పోతోంది.
* మధుమేహం మూలంగా ప్రతి 6 సెకండ్లకు ఒకరు మరణిస్తున్నారు.
* ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెద్దల్లో 41.5 కోట్ల మంది మధుమేహంతో జీవిస్తున్నారు. 2040 నాటికి వీరి సంఖ్య 64.2 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. అంటే 2040 నాటికి ప్రపంచ జనాభాలో ప్రతి 10 మందిలో ఒకరు మధుమేహులే ఉంటారు.
కళ్లపైనా దృష్టి పెట్టండి!
ఈ రోజుల్లో మన కళ్లకు ప్రధాన శత్రువు ఎవరో తెలుసా?
అనుమానమేం లేదు. మధుమేహమే!
నేడు ప్రపంచ వ్యాప్తంగానూ, మన దేశంలోనూ కూడా అంధత్వానికి అతిపెద్ద కారణం ఏమిటో తెలుసా? మధుమేహమే!
మనదేశంలో మధమేహం కారణంగా ఏటా లక్ష మంది అంధత్వం బారినపడుతున్నారని అంచనా. అంతేకాదు ఇప్పటికే మధుమేహంతో పాటు కంటి జబ్బు కూడా ఉండటంతో వచ్చే 5-10 ఏళ్లలో మరో 60 లక్షల మందికి చూపు పోయే ముప్పూ పొంచి ఉంది. మన దేశంలో మొత్తం 4 కోట్ల మంది మధుమేహులున్నారని అంచనా. వీరిలో 16% మంది మధుమేహం కారణంగా తలెత్తే ‘రెటినోపతి’తో బాధలు పడుతున్నవాళ్లే. మనం ఇప్పటికైనా మేలుకుని, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోకపోతే వచ్చే పదేళ్లలో మరో 3.5 కోట్ల మంది దీని బారినపడే అవకాశముంది.
మధుమేహంతో బాధపడుతున్న భారతీయుల్లో కనబడే ప్రధాన రక్తనాళాల సమస్య రెటినోపతే. ఆ తర్వాత స్థానాల్లో కిడ్నీ జబ్బు (15%), గుండె జబ్బు (8%), పక్షవాతం (3%) ఉంటున్నాయి. కొత్తగా మధుమేహం నిర్ధరణ అయిన ఏడాదిలోపే సుమారు 16% మందిలో రెటినోపతి సమస్య కూడా బయటపడుతోంది. కాబట్టి మధుమేహం నిర్ధరణ అయినప్పటి నుంచే కంటి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించటం అత్యవసరం. ప్రతి సంవత్సరం కంటి వైద్యులతో లేదా కనీసం శిక్షణ పొందిన కంటి నిపుణులతో పరీక్ష చేయించుకోవటం తప్పనిసరి.
ఈ మధ్యకాలం వరకూ కూడా మన దేశంలో అంధత్వానికి ప్రధానంగా విటమిన్-ఎ లోపం, కంటి గాయాలు, శుక్లాలే ముఖ్య కారణాలుగా ఉండేవి. కానీ గత నాలుగు దశాబ్దాల్లో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలకృషి ఫలితంగా- శుక్లాలకు ఆపరేషన్లు చేయటం, విటమిన్-ఏ లోపం రాకుండా చూడటం వంటి చర్యలతో వీటన్నింటినీ చాలా వరకూ అధిగమించగలుగుతున్నాం. కానీ ఇప్పుడు మధుమేహం కళ్లకు అశనిపాతంలా తయారైంది. ఇప్పుడిదే అంధత్వానికి ముఖ్య కారణంగా మారింది. దీంతో మధుమేహ సంబంధ రెటినోపతిని సమర్థంగా ఎదుర్కొనాల్సిన అవసరం నేడు మరింతగా పెరిగింది.
మధుమేహులంతా కూడా రక్తంలో గ్లూకోజు స్థాయులను కచ్చితంగా అదుపులో ఉంచుకోవటం ద్వారా కంటి జబ్బును చాలావరకూ నివారించుకోవచ్చు. రెటినోపతిని తొలిదశలోనే గుర్తిస్తే ఇన్సులిన్ ఇంజెక్షన్లతో లేదా.. వీటితో పాటు ఇతరత్రా మందులతో దాన్ని అడ్డుకోవచ్చు. హెచ్‌బీఏ1సీ దాదాపు 7కు దగ్గరగా ఉండేలా చూసుకుంటే కంటి సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.
రెటినోపతి రాకుండా ఉండాలంటే మధుమేహంతో పాటు రక్తపోటు కూడా నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. రెటినోపతి బారినపడ్డ వారిలో కంటిలోని రెటీనా పొర మీది రక్తనాళాలు దెబ్బతింటాయి. వాటిలో అడ్డంకులు తలెత్తుతాయి. దీంతో రెటీనా పొరకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీన్ని అధిగమించేందుకు రెటీనా మీద కొత్తగా సూక్ష్మ రక్తనాళాలు పుట్టుకొస్తుంటాయి. అయితే అవి పల్చగా ఉండి, తేలికగా చిట్లిపోతూ.. రెటీనా పొర మీద రక్తం లీక్ అయ్యేలా చేస్తుంటాయి. దీంతో రెటీనా పొర బాగా దెబ్బతింటుంది. అందువల్ల కొత్త రక్తనాళాల వృద్ధిని ఆపటానికి అవాస్టిన్ వంటి ఖరీదైన మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మధుమేహం మూలంగా తలెత్తే అంధత్వాన్ని నివారించటంలో ఇవి బాగా తోడ్పడతాయి. ఒకవేళ రక్తనాళం నుంచి ఇప్పటికే రక్తం లీకవుతుంటే లేజర్ చికిత్స ద్వారా ఆ ప్రాంతాన్ని కొద్దిగా కాల్చి, రక్తం లీకవకుండా చేస్తారు. దీంతో కొత్తగా రక్తం లీక్ అవ్వదు.
ఇప్పటికే రెటీనోపతి సమస్య ఉన్న గర్భిణులకు మధుమేహం వస్తే- గర్భ సమయంలో ఈ సమస్య చాలా వేగంగా ముదురుతుంది. అంతకు ముందు రెటినోపతీ సమస్య లేకపోయినా.. గర్భిణి మధుమేహంలో తెలియకుండానే రెటీనా జబ్బు పుట్టుకురావొచ్చు. చాలా త్వరగా చూపు పోవచ్చు. అందువల్ల మధుమేహం గల గర్భిణుల్లో చిన్నపాటి కంటి సమస్య తలెత్తినా తీవ్రంగా పరిగణించాలి. వీలైనంత త్వరగా చికిత్స ఆరంభించాలి.
కిడ్నీ జబ్బుకూ, ఈ కంటిలోని రెటినోపతీ సమస్యకూ మధ్య బలమైన సంబంధం ఉంది. ఎందుకంటే ఈ రెండూ కూడా సూక్ష్మమైన, అతి పల్చటి రక్తనాళాల సమస్యలే. ఈ రెంటికీ కూడా మధుమేహం దోహదం చేస్తుంది. అలాగే మధుమేహం కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న వాళ్లందరిలోనూ రెటినోపతి కూడా కనబడుతోంది. అలాగే రెటినోపతి బారినపడ్డ దాదాపు సగం మందిలో కిడ్నీలు దెబ్బతినటం చూస్తున్నాం. కాబట్టి కిడ్నీ జబ్బు ముప్పు గల మధుమేహులందరికీ కంటి పరీక్ష తప్పనిసరి.
ఇతర సమస్యలు
మధుమేహులకు- దాని కారణంగా కంటి అద్దాల పవర్ త్వరత్వరగా మారిపోతుండొచ్చు. అలాగే శుక్లాలు వేగంగా ముదరొచ్చు. అలాగే కంటి చూపునకు అత్యంత కీలకమైన దృశ్యనాడి దెబ్బతిని హఠాత్తుగా చూపుపోయే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి కంటి చూపు విషయంలో మధుమేహులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
మధుమేహం కారణంగా తలెత్తే తీవ్ర సమస్యల్లో చూపు దెబ్బతినటం ముఖ్యమైనది. దీన్నే ‘డయాబెటిక్ రెటినోపతి’ అంటారు. మధుమేహుల్లో మూడింట ఒకొంతు మందికి ఏదో రకం రెటినోపతి తలెత్తే అవకాశముంది. ప్రస్తుతం మధుమేహంతో బాధపడుతున్న 9.3 కోట్ల మందిలో.. ప్రతి ముగ్గురిలో ఒకరు డయాబెటిక్ రెటినోపతి గలవారే!
ఎవరికైనా రావొచ్చు
‘మధుమేహం నాకెందుకు వస్తుంది?’ అని చాలామంది అనుకుంటుంటారు. నిజానికి మధుమేహం ఎవరికైనా రావొచ్చు. వచ్చినా పైకి ఎలాంటి సంకేతాలూ, లక్షణాలూ ఉండకపోవచ్చు. కాబట్టి హైబీపీ, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉండటం, ఇప్పటికే కుటుంబంలో మధుమేహులుండటం వంటి ముప్పులున్నవారు- అప్పుడప్పుడు రక్తంలో గ్లూకోజు పరీక్ష చేయించుకోవటం చాలా అవసరం. దీనివల్ల ఒకవేళ మధుమేహం వచ్చి ఉంటే ఆ విషయాన్ని సత్వరమే గుర్తించే వీలుంటుంది. ఒకవేళ మున్ముందు మధుమేహం వచ్చే అవకాశం ఉందేమో కూడా (ప్రి డయాబెటీస్) తెలుసుకునే వీలుంటుంది. దీంతో జీవనశైలిని చక్కదిద్దుకోవటం ద్వారా అది పూర్తిస్థాయి మధుమేహంగా మారకుండా చూసుకోవచ్చు.
పరీక్ష చేయించుకున్నప్పుడు..
* రక్తంలో గ్లూకోజు స్థాయులు పరగడుపున 125 ఎంజీ/డీఎల్, భోజనం చేశాక 200 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువుంటే మధుమేహం వచ్చినట్టే!
* ఒకవేళ ఈ గ్లూకోజు స్థాయులు పరగడుపున 100 నుంచి 125 మధ్య ఉన్నా, లేదా భోజనం చేసిన 2 గంటలకు 140 నుంచి 200 మధ్యలో ఉన్నా... వీరు ముందస్తు మధుమేహ దశలో ఉన్నట్టే. దీన్నే ‘ప్రీడయాబిటీస్’ అంటారు. ఈ దశలోనే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అది పూర్తిస్థాయి మధుమేహంగా మారకుండా చాలాకాలం పాటు నివారించుకోవచ్చు.
* మూడు నెలల సగటు గ్లూకోజు పరీక్ష (హెచ్‌బీ ఏ1సీ) ద్వారా కూడా మధుమేహాన్ని నిర్ధారించుకోవచ్చు. ఈ పరీక్షా ఫలితం 6.5 కన్నా ఎక్కువుంటే మధుమేహం ఉన్నట్టే! ఒకవేళ అది 5.7 నుంచి 6.5 మధ్యలో ఉంటే ముందస్తు మధుమేహం దశలో ఉన్నారని, జాగ్రత్తపడాలని అర్థం!
ఇలా ఉంటేనే నియంత్రణలో ఉన్నట్టు!
మధుమేహులు తరచుగా రక్త పరీక్ష చేయించుకుంటూ, మధుమేహం నియంత్రణలో ఉంటోందా? లేదా? అన్నది గమనిస్తూనే ఉండాలి. పరగడుపున పరీక్షలో రక్తంలో గ్లూకోజు 125 ఎంజీ/డీఎల్, భోజనం చేశాక 200 ఎంజీ/డీఎల్ మించకుండా చూసుకోవాలి. ఇక హెచ్‌బీ ఏ1సీ దాదాపు 7% ఉండేలా చూసుకోవాలి. ఇలా కచ్చితంగా నియంత్రణలో ఉంచుకుంటే.. మధుమేహం కారణంగా వచ్చే వ్యాధుల ముప్పు బాగా తగ్గుతుంది.
హైబీపీతో మరీ అనర్థం
మధుమేహం, అధిక రక్తపోటు రెండూ తోడు దొంగలు. చాలామంది మధుమేహుల్లో రక్తపోటు కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు మూలంగా గుండె జబ్బు, పక్షవాతం, అకాల మరణం, కళ్లు, కిడ్నీలు దెబ్బతినటం వంటి ముప్పులు పొంచి ఉంటాయి. అందువల్ల తరచుగా బీపీ కూడా పరీక్షించుకోవాలి. మధుమేహులు తమకు బీపీ దాదాపు 130/80కి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా మందులు వాడుకోవాలి.
అసలు రాకుండా చూసుకోవచ్చు!
నిత్యం తప్పకుండా వ్యాయామం చెయ్యటం, కొవ్వు పదార్థాలు తగ్గించటం, ఒత్తిడికి దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలీ సూత్రాలను పాటించటం ద్వారా 70% మధుమేహం కేసులను నివారించుకోవచ్చు. లేదూ, చాలాకాలం పాటు దీని బారినపడకుండా చూసుకోవచ్చు.
వచ్చినా జబ్బులు రాకుండా చూసుకోవచ్చు!
మధుమేహం వచ్చినా కూడా.. దాని మీద ఒక కన్నేసి ఉంచి... దాన్ని సమర్థంగా నియంత్రణలో ఉంచుకోవటం ద్వారా ఇతరత్రా దుష్ప్రభావాలు, వ్యాధుల బారినపడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. కానీ చాలామంది దీన్ని అదుపులో ఉంచుకోవటంలో విఫలమై.. అంధత్వం, గుండె జబ్బులు, కిడ్నీల వైఫల్యం వంటి పెను వ్యాధుల బారిన పడుతున్నారు. మధుమేహం కారణంగా పాదాల మీద పుండ్లు పడి, అవి మానక చివరికి పాదాలు తొలగించాల్సిన అవసరమూ పెరుగుతోంది. ఇలాంటి దుష్ప్రభావాలేవీ లేకుండా జీవించే అవకాశం ఉంటుంది.
ఒళ్లంతా కబళింత
గుండె జబ్బు గుదిబండ
మధుమేహులకు గుండె జబ్బు, పక్షవాతం ముప్పులు చాలా ఎక్కువ. మధుమేహులు మంచం పట్టటానికీ, అకాల మరణానికీ ప్రధాన కారణాలు ఈ రెండే! కాబట్టి మధుమేహులు దాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. పొగ అలవాటుకు దూరంగా ఉండాలి. కుటుంబంలో ఇలాంటి వ్యాధుల చరిత్ర ఉన్నవాళ్లు వీటిపై ఒక కన్నేసి ఉంచాలి. ఒకవేళ ముప్పు ఎక్కువగా ఉంటే వైద్యుల సూచనల మేరకు- కొవ్వులను తగ్గించే స్టాటిన్స్, బీపీ తగ్గించే మందులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
* మధుమేహులు- రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులను కూడా కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. ఎల్‌డీఎల్ 70 ఎంజీ/డీఎల్‌కు దగ్గరగా, హెచ్‌డీఎల్ 39 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్ల స్థాయులు దాదాపు 150 ఎంజీ/డీఎల్‌కు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.
కిడ్నీలు పదిలం
మనలాంటి దేశాల్లో దీర్ఘకాల కిడ్నీ జబ్బు(సీకేడీ)కు మధుమేహమే పెద్ద కారణంగా పరిణమిస్తోంది. మధుమేహుల్లో 25 నుంచి 50 మందికి కిడ్నీ జబ్బు ముప్పు పొంచి ఉంటోంది. ఇది తీవ్ర సమస్యగా మారి అకాల మరణాన్నీ తెచ్చిపెట్టొచ్చు. అందుకే మధుమేహం నిర్ధరణ అయినప్పటి నుంచే గ్లూకోజు స్థాయులను, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవటం చాలా అవసరం. దీంతో కిడ్నీ జబ్బుల ముప్పును నివారించుకోవచ్చు. మధుమేహులు కనీసం ఏడాదికి రెండు సార్లయినా మూత్రంలో ఆల్బుమిన్ మోతాదును పరీక్షించుకోవాలి. మూత్రపిండాల వడపోత సామర్థ్యాన్ని తెలిపే ‘ఈజీఎఫ్‌ఆర్’ పరీక్ష, రక్తంలో క్రియాటినైన్లను కూడా పరీక్ష చేయించుకోవాలి. వీటిలో తేడాలొస్తే కిడ్నీ జబ్బుల ముప్పు ముంచుకొస్తోందని అనుమానించాలి.
నాడులకు, పాదాలకు దెబ్బ
పాదాల మీద పుండ్లు పడటం. అవి ఒక పట్టాన మానక.. చివరికి వేళ్లూ, పాదాలూ తొలగించాల్సిన దుస్థితి రావటం. చాలామంది మధుమేహుల్లో చూసేదే ఇది. దీనికి ప్రధాన కారణం పాదాల్లో నాడులు దెబ్బతిని స్పర్శ కొరవడటం. వీరిలో నాడులు దెబ్బతినటం వల్ల ఒక్క పాదాల సమస్యలే కాదు.. జీర్ణ సమస్యలు, మలవిసర్జన సమస్యలు, మూత్ర సమస్యలు, లైంగిక సమస్యల వంటివెన్నో ముంచుకొస్తాయి. కాబట్టి మధుమేహులంతా దాన్ని కచ్చితంగా అదుపులో ఉంచుకోవటంతో పాటు.. పాదాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కడైనా పుండు పడిందా? గీసుకుందా? చూసుకోవాలి. పాదం కింది భాగం కనబడకపోతే అద్దంతో చూసుకోవాలి. వేళ్లు, గోళ్ల ఆకారం మారిపోవటం, చర్మం పొడి బారటం, రక్తనాళాలు ఉబ్బటం.. ఇలా పైకి ఎలాంటి మార్పులు కనబడినా వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి.
మనసు మీదా భారం
మధుమేహం జీవితాంతం ఉండిపోయే సమస్య. ఇది మానసికంగానూ మనిషిని కుంగదీస్తుంది. కొందరిలో మానసిక సమస్యలూ తలెత్తొచ్చు. మధుమేహం మూలంగా కుంగుబాటు వచ్చే అవకాశం రెట్టింపు అవుతుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటే మందులు వేసుకోవటం వంటి రోజువారీ పనులపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల మానసిక సమస్యల లక్షణాలేమైనా కనిపిస్తున్నాయేమో గమనిస్తుండాలి. ఏదైనా తేడా కనబడితే సైక్రియాటిస్టును సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.
మధుమేహం ఉన్నా ఈ పండ్లు తినొచ్చు
Sugar Patients also eat these fruits
+++++++మధుమేహం ఉన్నా
ఈ పండ్లు తినొచ్చు++++++
ఈ పండ్లు తినొచ్చు++++++
మధుమేహం ఉండీ పండ్లు తినడమా? అంటూ ఆశ్చర్యపోననవసరం లేదు. కొన్ని రకాల పండ్లను వారు కూడా హాయిగా తినొచ్చు. పైగా వాటిని తినడం మధుమేహస్తులకు చాలా అవసరం కూడా. ఎందుకంటే, కూరగాయాలకు మించి శరీరానికి అవసరమైన విటమిన్లు, లవణాలు, పీచుపదార్థం పండ్లలోనే లభిస్తాయి. కాకపోతే పండ్లు తినడానికి రక్తంలో షుగర్ నిల్వలు పూర్తి నియంత్రణలో ఉండాలి. అయితే పండ్లల్లోనూ కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో కాకుండా భోజనంలో భాగంగానే పండ్లను తీసుకోవాలి. ఎలాంటి పండ్లను తినాలో చూద్దాం..
యాపిల్: ఈ పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల కొలెస్ట్రాల్ నిలువలు తగ్తాయి. జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. వ్యాధినిరోధక యంత్రాంగం ఉత్తేజితమవుతుంది. యాపిల్స్‌లో ఉండే కొన్ని రకాల పోషకాలు కొవ్వు పదార్థాలను జీర్ణించుకోవడంలో కూడా బాగా తోడ్పడతాయి.
పీచ్: అతి తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండటంతో పాటు ఈ పండు చాలా రుచిగా కూడా ఉంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా ఇందులో ఎక్కువే.
జామ: మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు జామపండులో మలబద్దకాన్ని నివారించే గుణం కూడా ఉంది. దీనిలో విటమిన్ ఏ, సి లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో పీచు పదార్థం కూడా ఎక్కువే.
చెర్రీస్: వీటిలో ఉండే గ్లైసమిక్ విలువ 20. కొన్ని రకాల వెరైటీలల్లో ఇంతకన్నా తక్కువగానే ఉంటుంది. స్నాక్స్‌గా కూడా తీసుకోవడానికి వీలైనవి. వీటిని ఎప్పుడైనా తీసుకోవచ్చు.
బెర్రీస్: ఈ పండ్లు అనేక రకాలు వీటిల్లో సా్ట్రబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, క్రాన్‌బెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ మేలు చేస్తాయి.
నేరేడు: మధుమేహ వ్యాధిగ్ర స్తులు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పండు అల్లనేరేడు. రక్తంలోని షుగర్‌నిలువల్ని బాగా నియంత్రించే శక్తి గల పండు ఇది. నేరేడు పండులోని గింజల్ని పొడి చేసి రోజూ తీసుకున్నా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.
దానిమ్మ: రక్తంలోని షుగర్ నిలువల్ని సమర్థవంతంగా నియంత్రించే శక్తి ఈ దానిమ్మ గింజల్లో సమృద్ధిగా ఉంది. దీనిలో ఉండే ఫ్రక్టోజ్, పీచు పదార్థంలో గ్లైసిమిక్ ఇండెక్స్‌ను బాగా తగ్గించే గుణం ఉంది.
అంజీర: ఫైబర్ చాలా ఎక్కువగా ఉండే ఈ పండు మధుమేహుల్లో ఇన్సులిన్ చక్కగా పనిచేసేలా చేస్తుంది.ళీలీో5్డు
యాపిల్: ఈ పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల కొలెస్ట్రాల్ నిలువలు తగ్తాయి. జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. వ్యాధినిరోధక యంత్రాంగం ఉత్తేజితమవుతుంది. యాపిల్స్‌లో ఉండే కొన్ని రకాల పోషకాలు కొవ్వు పదార్థాలను జీర్ణించుకోవడంలో కూడా బాగా తోడ్పడతాయి.
పీచ్: అతి తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండటంతో పాటు ఈ పండు చాలా రుచిగా కూడా ఉంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా ఇందులో ఎక్కువే.
జామ: మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు జామపండులో మలబద్దకాన్ని నివారించే గుణం కూడా ఉంది. దీనిలో విటమిన్ ఏ, సి లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో పీచు పదార్థం కూడా ఎక్కువే.
చెర్రీస్: వీటిలో ఉండే గ్లైసమిక్ విలువ 20. కొన్ని రకాల వెరైటీలల్లో ఇంతకన్నా తక్కువగానే ఉంటుంది. స్నాక్స్‌గా కూడా తీసుకోవడానికి వీలైనవి. వీటిని ఎప్పుడైనా తీసుకోవచ్చు.
బెర్రీస్: ఈ పండ్లు అనేక రకాలు వీటిల్లో సా్ట్రబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, క్రాన్‌బెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ మేలు చేస్తాయి.
నేరేడు: మధుమేహ వ్యాధిగ్ర స్తులు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పండు అల్లనేరేడు. రక్తంలోని షుగర్‌నిలువల్ని బాగా నియంత్రించే శక్తి గల పండు ఇది. నేరేడు పండులోని గింజల్ని పొడి చేసి రోజూ తీసుకున్నా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.
దానిమ్మ: రక్తంలోని షుగర్ నిలువల్ని సమర్థవంతంగా నియంత్రించే శక్తి ఈ దానిమ్మ గింజల్లో సమృద్ధిగా ఉంది. దీనిలో ఉండే ఫ్రక్టోజ్, పీచు పదార్థంలో గ్లైసిమిక్ ఇండెక్స్‌ను బాగా తగ్గించే గుణం ఉంది.
అంజీర: ఫైబర్ చాలా ఎక్కువగా ఉండే ఈ పండు మధుమేహుల్లో ఇన్సులిన్ చక్కగా పనిచేసేలా చేస్తుంది.ళీలీో5్డు
మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF ఫైల్ పొందవచ్చును
---LIKE US TO FOLLOW:
---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565