ఇంటి వైద్యం:
సోంపు మనకు ఎలా ఉపయోగపడుతుంది?
తాతయ్యలూ బామ్మలూ భోజనం చేశాక ఆకూవక్కాసున్నంతో చుట్టిన తాంబూలాన్ని వేసుకునేవారు. అది అరగడానికీ నోటి సువాసనకీ ఉపయోగపడేది. ఆ తరవాత వక్కపలుకుతో సరిపెట్టుకోవడం అలవాటైంది. అదీ లేకపోతే లవంగమో ఏలకలో దాల్చినచెక్కముక్కో నమలడం తెలిసిందే. ఇప్పుడు వీటన్నిటి స్థానాన్నీ సోంపు గింజలు ఆక్రమించేశాయి. ఒకప్పుడు ఉత్తరాదివంటల్లోనూ హోటళ్లలోనూ కనిపించే ఈ సోంపు, ఇప్పుడు మన ఇళ్లలోని భోజనాల బల్లలమీదా కనిపిస్తోంది. చూడ్డానికి దొడ్డు జీలకర్రలా కనిపించే ఈ సోంపు జీర్ణశక్తిని పెంచడంతోబాటు నోటిదుర్వాసనని అడ్డుకునే అద్భుత ఔషధంగా అందరినోటా గుబాళిస్తోంది.
ముఖ్వాసుల్లో సోంపెంత?
ఒకప్పుడు సోంపుని నేరుగాకన్నా పంచదార పలుకులు చేర్చిగానీ లేదా పాకంలో ముంచి తీసిన రూపంలోగానీ హోటళ్లలో అందించేవారు. ఇప్పుడు దీన్ని నేరుగానూ ఇస్తున్నారు. అంతేకాదు, మార్కెట్లో కనిపిస్తోన్న ముఖ్వాస్(మౌత్‌ఫ్రెషనర్ల మిశ్రమం)లన్నింటిలోనూ సోంపుగింజలే ప్రధానం. అందుకే ముఖ్వాస్ అనగానే అందరికీ సోంపే గుర్తుకొస్తుంది. కాకపోతే సోంపుగింజలకి జోడించే మిశ్రమాలే మారుతుంటాయి. సోంపు గింజలతోబాటు అచ్చంగా సోంపుగింజల్లానే ఉండే అనీస్ గింజలూ ఎండుకొబ్బరితురుమూ నువ్వులూ అవిసెగింజలూ మెత్తని వక్కపలుకులూ దనియాలూ దోసగింజలూ సారపప్పులూ గులాబీరేకులూ ఎండు తమలపాకులూ ఎండు పుదీనాఆకులూ ఎండుఉసిరిముక్కలూ కుంకుమపువ్వూ పంచదార పలుకులూ ఇలా రకరకాల దినుసుల్ని పెప్పర్‌మింట్ నూనెతోబాటు ఇతరత్రా సుగంధద్రవ్యాల నుంచి తీసిన గాఢతైలాలనూ కలిపి చేసేదే ముఖ్వాస్. పైగా ఈ ముఖ్వాస్‌లు ఆకర్షణీయంగా కనిపించేందుకన్నట్లు రంగుల పంచదారపాకంలోముంచి తీసిన సోంపుగింజల్నీ కలుపుతుంటారు. కొందరు ఫుడ్‌కలర్సూ వాడతారు. దాంతో అవి మంచి పరిమళంతో రంగుల్లో కనువిందు చేస్తుంటాయి. కలిపే దినుసులను బట్టి ఈ ముఖ్వాసుల్లో బోలెడు రకాలుంటాయి. విందు భోజనాల్లో వాటిని తమలపాకుల్లో చుట్టిగానీ నేరుగాగానీ అందిస్తారు. అయితే ఈ ముఖ్వాసుల్లో ఎన్ని రకాలున్నా అన్నింటిల్లోనూ తప్పక కనిపించేదే సోంపు. ముదురుగోధుమ లేదా ఆకుపచ్చ రంగుల్లో ఉండే సోంపు గింజలు నమిలేకొద్దీ సువాసనను వెదజల్లుతుంటాయి. అందుకే సోంపుతో కూడిన ముఖ్వాసులను అభిరుచుల మేరకు ఇళ్లలోనే తయారుచేసుకుంటుంటారు.

సోంపు తాలింపు!
కొత్తిమీర, క్యారెట్, జీలకర్ర, షాజీరా మొక్కల్లానే ఉండే ఈ సోంపు మొక్క ఆకుల్ని ఆకుకూరగానూ సలాడ్లలోనూ వాడతారు. మొక్క మొదట్లో ఉల్లిపాయలా ఉండే కాండాన్ని కూరగాయగానూ వండుతారు. గింజల్ని మౌత్ ఫ్రెషనర్‌గానే కాకుండా డెజర్ట్‌లూ స్వీట్లూ ఇంకా కొన్ని రకాల వంటల్లోనూ వాడుతుంటారు. ఉత్తరాదిన కొన్ని రకాల వంటల్లో ఈ దినుసు వాడుక తప్పనిసరి. బెంగాలీలు వాడే కూరపొడిలో సోంపు పడాల్సిందే. కూరలే కాదు, బ్రెడ్డులూ కేకులూ బిస్కెట్లూ చీజ్...ఇలా పలు బేకరీఉత్పత్తుల్లోనూ సోంపుగింజల్ని వేస్తుంటారు. సోంపులానే ఉండే మరోరకం గింజలూ ఉన్నాయి. అవే అనీస్. కానీ రుచిలోనూ గుణాల్లోనూ అవి సోంపులానే ఉంటాయి. అందుకే తెలీనివాళ్లు వాటినీ సోంపు అనే అంటారు. కాకపోతే వీటితో పోలిస్తే వాటి పరిమాణం తక్కువ.

ఎందుకుమంచిది?
నోటి దుర్వాసనని దూరం చేయడంతోబాటు ఏ కాస్త అజీర్తిగా అనిపించినా కాసిని సోంపుగింజల్ని నమిలితే అది మాయమవుతుందంటారు సంప్రదాయ వైద్యులు. ఈ గింజల్ని మరిగించి తీసిన డికాక్షన్‌ను పాలిచ్చే తల్లులకు ఇస్తే పాలు పడతాయట. పసిపిల్లలకు ఈ గింజల్ని మరిగించిన నీటిని ఇస్తే పొట్టలోనొప్పి తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ గింజలనుంచి తీసిన నూనె దగ్గు, బ్రాంకైటిస్‌లనుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. లేదా వీటితో చేసిన టీ తాగినా మంచిదే. అలాగే ఈ నూనెతో మర్దనచేస్తే కీళ్లనొప్పులూ తగ్గుతాయి. నరాలకూ స్వాంతన కలుగుతుంది అంటారు సంప్రదాయ వైద్యులు. పూర్వం గ్లకోమావ్యాధినివారణకి వీటి రసాన్ని ఇచ్చేవారట. వేసవిలో సోంపుతో చేసిన పానీయాన్ని తాగితే వేడి తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఇది మంచి ఔషధమే కాదు, అద్భుత పోషకాలూ ఉన్నాయంటారు ఆధునిక వైద్యులు. కాపర్, ఐరన్, కాల్షియం...వంటి ఖనిజాలూ; ఎ, బి, సి, ఇ విటమిన్లకూ సోంపుగింజలు మంచి నిల్వలు.

* సోంపులోని ఫ్లేవనాయిడ్ల కారణంగా ఇది అజీర్తినీ అలసటనీ తగ్గిస్తుందట. వీటిల్లో లిమోనీన్, అనిసిక్ ఆల్డిహైడ్, పైనీన్, చావికోల్ ఫెంచోన్... వంటి గాఢ తైలాలు ఎన్నో ఉన్నాయి. వీటి కారణంగా సోంపు జీర్ణశక్తిని పెంచి కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. పోషకాలు ఒంటబట్టేలా చేస్తుంది. ఈ గింజల్లో ఉండే ఎపర్టిఫ్ ఆకలినీ పెంచుతుందట. పొట్టలో చెడు బ్యాక్టీరియాని తొలగించి మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఈ గింజలనుంచి తీసిన రసం శ్లేష్మాన్ని హరించి పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
* సోంపు గింజల్లోని క్యాంఫెరాల్, క్యుయెర్సిటిన్... వంటి శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్లూ ఇన్ఫెక్షన్లూ వయసుతోబాటు వచ్చే నరాల వ్యాధుల్నీ అడ్డుకుంటాయి.
* షాజీరా, జీలకర్రలో మాదిరిగానే ఇందులోనూ పీచు శాతం ఎక్కువ. దాంతో ఇది నీటిని ఎక్కువగా పీల్చుకుని మలబద్ధకం లేకుండా చేస్తుంది. ఈ పీచు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోబాటు పేగు క్యాన్సర్లు రానివ్వదట. బీ ఈ గింజలతో చేసిన టీ శరీరంలోని టాక్సిన్లను తొలగించి మూత్రాశయసమస్యల్ని నివారిస్తుంది. రక్తశుద్ధికీ తోడ్పడుతుంది.
* సోంపుగింజల్ని నమలడంవల్ల లాలాజలంలో నైట్రైట్ల శాతం పెరిగి బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం బీపీకీ గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు.
* ఈ గింజలనుంచి తీసిన రసంలోని ఫైటో ఈస్ట్రోజెన్ మెనోపాజ్ సమస్యల్ని నివారిస్తుంది. ఇందులోని ఫొలేట్ గర్భిణులకి ఎంతో మంచిది.
* సోంపు మెదడులో ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా చేయడంతో డిప్రెషన్, ఆందోళన... వంటి మానసిక సమస్యల్నీ నివారిస్తుంది.
* ఈ గింజల్లో అధికంగా ఉండే జింక్, సెలీనియం, కాల్షియం వంటి ఖనిజాలు హార్మోన్లను సమన్వయం చేస్తాయి. ఫలితంగా చర్మంమీద మొటిమలు రాకుండా ఉండేందుకూ సోంపు తోడ్పడుతుంది. గింజలే కాదు, వీటితో చేసిన టీ తాగడంవల్ల మేనిఛాయ మెరుగవుతుందట.

అదండీ సంగతి... ఏదో నోటి సువాసన కోసమే సోంపు అనుకోకుండా ఎక్కువగా తినేవాళ్లనూ వద్దనకుండా కొంచెంగానయినా తినడం అలవాటు చేసుకోండి... ఎందుకంటే సోంపు... ఓ మంచి సౌగంధ ఔషధం..!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565