పండగలైనా, ప్రత్యేక సందర్భాలైనా కళ తెచ్చే పట్టుచీరలదే హవా. ఆకట్టుకునే రంగుల్లో.. ఆధునిక డిజైన్లతో రూపొందించిన ఆ చీరలు కట్టుకుంటే అందం మన పట్టుబడినట్టే. ఇవిగో అలాంటివే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ పట్టుచీరలు..
చీర పట్టు కనికట్టు
చీరలు రకరకాల రంగుల్లో, రకాల్లో, డిజైన్లలో లభిస్తుంటాయి. అయితే వీటిలో ఎన్ని రకాలున్నా పెళ్లిళ్లు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం పట్టు చీరలదే హవా. అటువంటి సందర్భాల్లో ఫ్యాన్సీ వెరైటీలు లెక్కలేనన్ని ఉన్నా పట్టు చీరల తరువాతే అంటారు. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే పట్టు చీరలకి బోలెడంత గిరాకీ. నేటి తరం అమ్మాయిల అభిరుచులకు తగ్గట్టుగా... భిన్నమైన రంగుల మేళవింపుతో పట్టు చీరలకు కొత్త అందాలు దిద్దడంలో ఫ్యాషన్ డిజైనర్లు బిజీ అయిపోతారు. పట్టు చీరల్లో అలాంటి కొన్ని వెరైటీలు ఇవి...
ఓల్డ్ ఈజ్ గోల్డ్ - అవును నిజమే. అందుకే లంగావోణీలకి మనసారా ఆహ్వానం పలుకుతున్నాం అంటున్నారు నేటి తరం అమ్మాయిలు. ఈ ఫ్యాషన్ తరం అవసరాలకు తగ్గట్టుగా అవి కూడా రోజుకో రకంగా కొత్త మేకప్ అద్దుకుని ఒకే రంగు, ఒకే డిజైన్‌లతో కాకుండా బోలెడు వెరైటీల్లో లభిస్తున్నాయి. ప్లెయిన్ పరికిణీ, హెవీ డిజైన్ బ్లౌజ్‌లతో పాటు అక్కడక్కడా డిజైన్ ఉన్న వోణీ వేసుకున్నా... పరికిణీ, బ్లౌజ్‌లు హెవీ డిజైన్ ఉండి ప్లెయిన్ వోణీ వేసుకున్నా స్పెషల్‌గా కనిపించడం ఖాయం. అలాగే బ్లౌజ్‌లు కూడా మోచేతి వరకు కుట్టించుకున్నా... చేతుల్లేని బ్లౌజ్ అయినా బ్యూటిఫుల్‌గా ఉండాల్సిందే. ప్రత్యేక వేడుకలకి, పెళ్లిళ్లకు, పార్టీలకు లంగావోణీ వెరైటీలను వేసుకునేందుకు అమ్మాయిలు ఆసక్తి కనపరుస్తున్నారనేందుకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోలే నిదర్శనం

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565