నగలు కొత్తగా మెరవాలంటే?
ఆడవాళ్లకు చీరలు, నగలంటే మక్కువ ఎక్కువ. అందుకే వాటిని ఎంతో ప్రీతిగా చూసుకుంటారు. బట్టలనంటే అలమరలో పెడతారు. కానీ నగల విషయం అలా కాదు. విలువైన ఆభరణాల మెరుపులు పోకుండా ఏ నగలను ఎలా జాగ్రత్త చేయాలో చదవండి..
బంగారు నగలు..
- బంగారం మెరుపు ఎక్కువ కాలం ఉంటుంది. వారానికి రెండుసార్లు తక్కువ డిటర్జెంట్, గోరువెచ్చని నీళ్లు, మెత్తని గుడ్డతో బంగారు నగలను శుభ్రం చేయాలి.
- క్లోరిన్ తగిలితే బంగారం బలహీనపడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉంచాలి. నగలన్నీ ఒకేచోట కాకుండా వేరువేరుగా భద్రపరిస్తే చిక్కులు పడకుండా ఉంటాయి.
- రాళ్లు పొదిగిన బంగారు నగలను ఆల్కహాల్ కలిపిన ద్రవాలతో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. దీనివల్ల రాళ్లను అంటించడానికి పెట్టిన జిగురు పలుచన అవుతుంది. రాళ్లు ఊడిపోయే ప్రమాదం
ఉంటుందన్నమాట.
వజ్రాల నగలు..
- నగల దుకాణంలో దొరికే క్లీనింగ్ సొల్యూషన్ మాత్రమే వాడాలి. లేదా అమ్మోనియా కలిపిన నీళ్లను కూడా వాడవచ్చు. వీటి మీద ప్రయోగాలు మాత్రం చేయవద్దు.
- మెత్తని బ్రష్‌తో రుద్ది, మెత్తని వస్త్రంతో మాత్రమే శుభ్రం చేయాలి.
- వజ్రాలు పొదిగిన ఉంగరాలు ధరించి వంట పనులు చేయకూడదు. పదార్థాల వల్ల వజ్రాలు మెరుపు కోల్పోతాయి.
ముత్యాల నగలు..
- ముత్యాలను ధరించేటప్పుడు, భద్రపరిచేటప్పుడు జాగ్రత్త వహించండి. మెత్తని బట్టతో మాత్రమే ముత్యాలను శుభ్రం చేయాలి. డబ్బాలో మెత్తటి బట్ట వేసి గాలి చొరబడకుండా మూత పెట్టేయాలి.
- పర్‌ఫ్యూమ్, మేకప్, హెయిర్ స్ప్రేల వల్ల ముత్యాల రంగు మారుతుంది. కాబట్టి వాటిని మొత్తం రెడీ అయ్యాకే ధరించండి.
- ముత్యాల నగలు శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, బ్లీచ్‌లను ఉపయోగించ కూడదు.
- ఈ నగలను ప్లాస్టిక్ సంచుల్లో భద్రపరచకూడదు.
వెండి నగలు
- పాస్ఫేట్, డిటర్జెంట్ కలిపిన నీళ్లతో వెండి నగలను శుభ్రం చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రమైన గుడ్డతో తుడవాలి.
N కుంకుడు రసంలో కూడా కాసేపు నానబెట్టి ఆ తర్వాత శుభ్రం చేసినా కొత్తవాటిలా మెరిసిపోతాయి.
- కాగితంలో, కార్డ్‌బోర్డ్, కలపతో చేసిన డబ్బాల్లో వెండి నగలను ఉంచకూడదు.
- పూర్తిగా తడి ఆరాకే వెండి వస్తువులను దాచిపెడితే భద్రంగా ఉంటాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565