దేవీ భాగవతంలో.. సప్తద్వీపాలు
జంబూ, ప్లక్ష, కుశ, క్రౌంచ, శాక, శాల్మల, పుష్కరా:..... అని సప్తద్వీపముల పేర్లు వీటిలో ప్రతిదాని చుట్టు లవణ, ఇక్షు, సురా, సర్పిర్, దధి, క్షీర, జలార్ణవా అను 7 సముద్రములు పైద్వీపములలో ఉండునట. జంబూ ద్వీపము చుట్టు ఉప్పు సముద్రము ఉండునట. ప్లక్ష ద్వీపము చుటుట చెరుకు రసము సముద్రము ఉండునట. కుశ ద్వీపము చుట్టు సురా (మద్యం) సముద్రము ఉండునట. క్రౌంచ ద్వీపము చుట్టు సర్పిర్ (నెయ్యి) సముద్రము ఉండునట. శాక ద్వీపము చుట్టు దధి సముద్రము ఉండునట. శాల్మల ద్వీపము చుట్టు క్షీర సముద్రము ఉండునట. పుష్కర ద్వీపము చుట్టు మంచినీటి సముద్రము ఉండునట.
చాలమంది పండితంమన్యులు ఈ ద్వీపములు అనగా చుట్టు నీరు ఉండి మధ్యలో భూభాగము మాత్రమే ద్వీపము అనుకొని మన భారతదేశము జంబూ ద్వీపము కనుక సింహళ ద్వీపము ప్లక్ష ద్వీపము అనియు మ్యాన్మార్ ద్వీపము మయన్మా దేశము కుశ ద్వీపమనియు ఇట్లు ఇత్యాదిగా వారి వారి పరిమిత బుద్ధులకు తోచినట్లుగా సమన్వయములు చూపి మ్యాప్‌లు (పటములు) కూడ గీసిరి. కాని సముద్రముల విషయము ఎత్తలేకపోయిరి. ఆ సముద్రములు మన భూగోళములో ఎక్కడ ఎన్ని యాంత్రిక నౌకలలో తిరిగినను విమానములలో తిరిగినను కనపడలేదు కనుక.
కాని ఋషులు మహాభావులు. దేవీ భాగవతములో అష్టమ స్కంధములో ఈ ద్వీపముల వివరము విస్తృతముగా ఉన్నది. అవి చూచినచో మనము అర్థము చేసికోనుటయే పిచ్చి పిచ్చిగా ఉన్నది కాని అవి ఏవియు పిచ్చి పిచ్చిగా లేవు అనిపిస్తుంది. అక్కడ ఎట్లున్నది అనగా మన సూర్యునికి సగము క్రిందివైపు చుట్టురు ఒక సాసర్‌లాగా ఒక గట్టి పదార్థము ఉన్నదట. ఆ గట్టి పదార్థము పైన ఉన్న సూర్యుని వెలుతురు, వేడి క్రిందికి ప్రసారము కాకుండా అడ్డుకొనుచుంచెను. అప్పుడు మునుపు పుత్రుడు ప్రియవ్రతుడు తన రసముతో (ఆ రసం ఎటువంటిదో ఎవరికి తెలియదు) ఆ సాసర్ చుట్టు 7 కన్నములు పడునట్లు త్రిప్పెనట. అవి అన్నియు ఒక సాసర్ పోయి 7 సాసర్‌లు అయి అందుచేత ఆ భ్రమణములో దగ్గరగా చేరి కొన్ని లక్షల సంవత్సరములకు ఒక్కొక్క సాసర్ భాగము గుండ్రముగా తయారై మన భూమి మొదలగు గ్రహములుగా మారి సూర్యుని చుట్టు శరవేగముగా తిరుగుచున్నవట. (మన భూమియే సూర్యునికి 9 కోట్ల మైళ్ళ దూరమున చుట్టి వచ్చుటకు గం.కు సుమారుగా 70, 80 మైళ్ళువేగముగా వెళ్ళుచుండునట. ఆ వెళ్ళుటలో తన చుట్టు తాను కూడ నిదానముగా తిరుగుచుండును. అన్ని గ్రహములు ఇట్లే తిరుగుచుండును. తర్వాత ఆ దేవీ భాగవతములో ఇక ప్లక్ష, కుశ, క్రౌంచ ఇత్యాది ద్వీపములను గురించిన ఆ దేవీ భాగవత ప్రవచనకర్త ఐన ఋషి జంబూ ద్వీపము గురించి మాత్రమే చాల వివరముగా చెప్పెను. ఆ వివరములు చూడగా మన భూగోళమంతయు జంబూ ద్వీపము అనిపించును. ఎందుకనగా మన జంబూ ద్వీపములో (మన భూగోళం) ఉప్పు నీటి సముద్రము ఒకటి మాత్రమే చుట్టుకొని ఉన్నది. అందువలన మన మొత్తం భూగోళము జంబూద్వీపమని భావింపవలెను. ఈ ద్వీపమునకు ఋషులు ఎందుకో చెట్ల పేరు పెట్టిరి. మన భూగోళమునకు జంబూ=నేరెడు చెట్టు, ప్లక్ష= జువ్విచెట్టు (ఇది అంగారక గ్రహం కావచ్చును) కుశ=దర్భ (గురుగ్రహం కావచ్చును) క్రౌంచ= ఒక విధమైన పొడగాటి మెడ కలిగిన కొంగ (క్రేన్ శనివారం కావచ్చును) శాక= ఆకుకూరల చెట్టు (పూర్వకాలమున పేరు లేని ఒక గ్రహం కావచ్చును యూరెనస్ ఉండవచ్చును) శాల్మల= బూరుగు చెట్టు (ఇది నెప్ట్యూన్ పూర్వకాలమున దీని పేరు లేదు యమలోకములో పాపులను వ్రేలాడుదీయు చెట్టు) పుష్కరా:= పద్మలత (ప్లూతో గ్రహం కావచ్చును పూర్వకాలమున దీని పేరుకూడ లేదు) ఇవి స్వతంత్ర ద్వీపములు ఆయా సముద్రముల మధ్యలో ఉండును. ఆ సముద్రములు మనకు కనపడువు తెలియవు మేష= మేక వృషభం= ఎద్దు కాదు. అని గ్రహించగలరు ఒక పదార్థము మధ్యలో విభిన్న పదార్థము ఉన్నచో దానికి ద్వీపమందురు. జంబూ ద్వీపమును ఋషులు 9 టైమ్ జోన్స్ (కాల విభాగములు కొరకు) ఋషులు విభజించిరి. అందులో ఇలా వృతం (ఉత్తరధ్రువం మంచుఖండం) దానికి దక్షిణమున కింపురుష (అది రష్యా భాగం కావచ్చును) దానికి దక్షిణమున నిషధ, హరిదశ్వ, భారత, పాంచజన్య, రుమణ్వక (రమ్యక) ప్రస్తుతం దీనిని యూరప్ అనుచున్నారు. హిరణ్యక (బంగారం ఎక్కువ ఉన్నది ప్రస్తుతం ఆఫ్రిక) కేతుమాల (అమెరికా అనుచున్నారు) ఈ పేరు యొక్క వికృతి ఇప్పటికిని మధ్య అమెరికాలో గేతేమాల అను దేశమున్నది. కేతుమాల అనగా జెండాకర్రల మాలిక అనగా పొడువు ఎక్కువ వెడల్పు తక్కువ అమెరికా జ్యారూపం ఇట్లే ఉండును అని గమనించినచో అమెరికా భూగోళ స్వరూపము కూడ ఈ పేరుపెట్టిన ఋషికి తెలియునని గ్రహించవచ్చును. అందువలన మన జంబూ ద్వీపము ఎతె్తైతే నిరాధారాకాశములో సూర్యుని చుట్టు పరిభ్రమించుచున్నదో అట్లే ప్లక్షాది గ్రహములు కూడ సూర్యుని చుట్టు పరిభ్రమించుచున్నవని భావము. వాటి వివరములు ఋషులు తెలుపలేదు. మనకు అవసరము లేదు.
- బ్రహ్మశ్రీ తెలకపల్లె విశ్వనాథశర్మ
Part-1
Part-2
Part-3
Part-4
Part-5
Part-6
Part-7
Part-8
Part-9
Part-10
Part-11
https://youtu.be/lZUeVmrxvAw
https://youtu.be/lZUeVmrxvAw
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565