MohanPublications Print Books Online store clik Here Devullu.com

వినిపిస్తుంది... మెరిపిస్తుంది-Listening And Enjoying

వినిపిస్తుంది... మెరిపిస్తుంది
బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు బోర్‌ కొడితే మొబైల్‌లో పాటలు వింటారు... లేకపోతే గేమ్స్‌ ఆడతారు. ఏదో ఆటవిడుపు కోసం కాసేపు అయితే ఫర్వాలేదు కానీ... ఎప్పుడూ అదే పని అంటే విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నట్లే. ఆ సమయంలో మీకు నచ్చిన, ఆసక్తి ఉన్న అంశానికి సంబంధించిన వార్తలు, వ్యాసాలు వింటూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీని కోసం కొన్ని పాడ్‌కాస్ట్‌లున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి. 
ఆర్థిక విషయాలు
ప్రపంచ మార్కెట్‌, ఆర్థిక వ్యవహారాల వార్తలంటే మీకు ఆసక్తి ఉందా? అయితే వాటికి సంబంధించిన వార్తలు, విషయాలను శబ్దం రూపంలో ఆసక్తికరంగా అందించే పాడ్‌ కాస్ట్‌లు కొన్ని ఉన్నాయి. వాటిలో Planet Money ఒకటి. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్తే అంశాల వారీగా పాడ్‌కాస్ట్‌ ఆడియోలు ఉంటాయి. వాటిని క్లిక్‌ చేసి పాటల్లా మార్కెట్‌ వివరాల్ని ఆంగ్లంలో వినొచ్చు. ఏవైనా సందేహాలుంటే కామెంట్లు పెట్టి, నిపుణుల సమాధానాలు పొందొచ్చు.
వారానికొకసారి... ఆరు నిమిషాలు 
మార్కెట్‌కి సంబంధించిన వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే కన్నా... వారం విషయాలన్నింటినీ ఒకేసారి తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే Hard Pass పాడ్‌కాస్ట్‌ మంచి ఎంపిక. ఇందులో అంతర్జాతీయంగా వ్యాపార రంగంలో వస్తున్న, రాబోయే మార్పుల గురించి ఇద్దరు వ్యక్తుల సంభాషణ రూపంలో అందిస్తారు. సుమారు ఒక్కో పాడ్‌కాస్ట్‌ ఆడియో ఆరు నిమిషాల నిడివితో ఉంటుంది.
వార్తల వింటారా?
ప్రపంచవ్యాప్తంగా ఏ క్షణాన, ఏ మూల, ఏం జరిగిందో తెలుసుకోవడమంటే మీకు ఆసక్తా? దీని కోసం రకరకాల వెబ్‌సైట్లలో వార్తలు చదువుతుంటారా? అయితే సరదాగా ఆ విషయాల్ని పాడ్‌కాస్ట్‌లో వార్తల రూపంలో వినేయండి.The Daily ఓ పాడ్‌కాస్ట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో రోజుల వారీగా వార్తలు, వాటి విశ్లేషణలు ఆడియో రూపంలో ఉంటాయి.
సైకాలజీ చెబుతారు
మనిషి ప్రతి ప్రవర్తన వెనుక ఓ కారణం ఉంటుంది. ఆ హేతువును బట్టే రకరకాల వ్యక్తుల ప్రవర్తన, వాళ్ల శైలిని, సరళిని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వివరాల్ని అందించే పాడ్‌కాస్ట్‌ Hidden Brain. ఇందులో శంకర్‌ వేదాంతం అనే సైన్స్‌ పాత్రికేయుడు ఓ మనిషి ప్రవర్తన, చేసే పనుల వెనుక ఉండే అంతస్సూత్రాలను వివరంగా ఆడియో రూపంలో అందిస్తారు. ఆయనతోపాటు మరికొంతమంది నిపుణులు మానవ ప్రవర్తన వెనుక ఉండే విషయాల్ని విశ్లేషిస్తారు.
ఆనాడు జరిగినవి
‘ఫలానా ఏడాది... ఇదే రోజున..’ అంటూ గతంలో జరిగిన ముఖ్యమైన విషయాల్ని కొన్ని పత్రికలు, వెబ్‌సైట్లు వార్తలుగా అందిస్తుంటాయి. ఇలాంటి విషయాలను ఆడియోల రూపంలో అందించే పాడ్‌కాస్ట్‌లున్నాయి. The Memory Palace పాడ్‌కాస్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా గతంలో జరిగిన ముఖ్యమైన విషయాల గురించి వివరంగా అందిస్తారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారి కోసం ఇలాంటివి ఉపయుక్తంగా ఉంటాయి.
సాంకేతికత సంగతులు 
కంప్యూటర్లు, మొబైళ్లు, సాంకేతికత విషయాలను తెలుసుకోవడం మీకు అలవాటా? వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి, మీ సందేహాలను నివృత్తి చేయడానికి Codebreaker పాడ్‌కాస్ట్‌ ఉంది. ఇందులో సాంకేతికతకు సంబంధించిన అనేక అంశాల విషయంలో నిపుణుల వ్యాసాలు ఆడియో రూపంలో ఉంటాయి. వాటి దిగువన కామెంట్‌ బాక్స్‌లో మీరు ప్రశ్నలు రాస్తే... ఆయా నిపుణుల బృందం మీకు సమాధానాలిస్తుంది.
పాడ్‌కాస్ట్‌ అంటే...
పాడ్‌కాస్ట్‌ అంటే సాధారణ వెబ్‌సైటే. అయితే ఇది శబ్దం ప్రధానంగా ఉంటుంది. ఓ విషయానికి సంబంధించి సంక్షిప్తంగా టెక్స్ట్‌ఇస్తూ, ఆడియో రూపంలో పూర్తి వివరాలు అందిస్తారు. వివిధ రకాల అంశాలకు సంబంధించిన ఆడియోలు వీటిలో లభిస్తాయి. ఈ ఆడియోలు ఎక్కువ శాతం ఆంగ్లంలోనే ఉంటాయి.
కొత్త ఆలోచనల కోసం 
మీరు ఆర్కిటెక్టా... లేదా మీకు ఆర్కిటెక్చర్‌ అంటే ఆసక్తి ఉందా? ఆ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, అందులో నిష్ణాతులైన వ్యక్తుల విషయాలను అందింస్తోంది99% Invisible పాడ్‌కాస్ట్‌. ఇందులో ఎపిసోడ్లు, అంశాలు, విభాగాల వారీగా పాడ్‌కాస్ట్‌ ఆడియోలున్నాయి. వాటికి సంబంధించిన ఆసక్తికరమైన ఫొటోలు కూడా ఈ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
భాష నేర్చుకుంటుంటే 
మీరు ఆంగ్ల భాష నేర్చుకుంటున్నారా? అయితేThe Allusionist పాడ్‌కాస్ట్‌ మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఆంగ్ల భాషలోని క్లిష్టమైన, ప్రత్యేకమైన పదాల అర్థం, దాన్ని వినియోగించే విధానాన్ని కొన్ని ఉదాహరణలతో ఆడియో రూపంలో పొందొచ్చు. దీంతోపాటు టెక్స్ట్‌ రూపంలోనూ ఆ సమాచారాన్ని పొందొచ్చు. అలా ఒక్కో పదానికి వేర్వేరుగా వివరాలు అందుబాటులో ఉంటాయి.
మానవ సంబంధాలు
ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే... ఏ బంధమైనా ఎక్కువ రోజులు నిలుస్తుంది అంటారు. అందుకే కొందరు మానవ సంబంధాల విషయంలో పత్రికలు, వెబ్‌సైట్స్‌లో వచ్చే కథనాలు, ప్రశ్న- జవాబు లాంటి ఫీచర్లు చూస్తుంటారు. అలాంటి వారి కోసంWhy Oh Why పాడ్‌కాస్ట్‌ ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో ఓ ప్రయోక్త తన స్నేహితులు, నిపుణులతో మాట్లాడిన ఇంటర్వ్యూల ఆడియోలుంటాయి. వాటిలో మానవ సంబంధాల గురించి చర్చిస్తారు.
మొబైల్‌లో పాటల ప్లేయర్ల బదులు ఈ పాడ్‌కాస్ట్‌లను ఆన్‌ చేసి మీకు కావల్సిన సమాచారాన్ని వినండి... మెరిసిపోండి.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list