కాలక్షేపం కాదు... ఆరోగ్యం నిక్షేపం!
గుడ్ ఫుడ్
ాలక్షేపం బఠాణీలు అంటూ వాటిని తింటుంటాం. కానీ బఠాణీల వల్ల ఒనగూరే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని
ఇవి...
బఠాణీల్లో పీచు పాళ్లు, ప్రోటీన్లు చాలా ఎక్కువ. పీచు, ప్రోటీన్లు చక్కెరలను నెమ్మదిగా జీర్ణమయ్యేలా చూస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులకు బఠాణీలు చాలా మంచిది
⇔బఠాణీల్లో ఉండే పీచు పదార్థం జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంతో పాటు మంచి జీర్ణశక్తికి దోహదం చేస్తుంది
⇔బఠాణీల్లో ఫోలిక్ యాసిడ్ పాళ్లు ఎక్కువ. కాబోయే తల్లుకు ఫోలిక్ యాసిడ్ చాలా మేలు చేస్తుంది.
⇔ అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారికి, కాబోయే తల్లులకు బఠాణీలు మేలు చేస్తాయి
⇔బఠాణీల్లో ఉండే విటమిన్ బి 6, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉన్నందున అవి గాయాల తాలూకు ఇన్‌ఫ్లమేషన్‌ను (ఎర్రబారడం, నొప్పి, మంట) త్వరగా తగ్గిస్తాయి.
⇔ప్రోటీన్లు కూడా చాలా ఎక్కువ కాబట్టి అవి గాయాలను త్వరగా మాన్పుతాయి
⇔బఠాణీలు చర్మానికి నిగారింపును కూడా ఇస్తాయి
⇔బఠాణీల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. అందుకే అవి ఎన్నోరకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంటాయి. అంతేగాక వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అనర్థాలను తగ్గిస్తాయి.
⇔ఫ్రీ–రాడికల్స్‌ను హరించే గుణం వల్ల అవి పెరిగే వయసును కనిపించనివ్వకుండా చేస్తాయి. చర్మంపై ముడుతలు రాకుండా చూస్తాయి
⇔ఆస్టియోపోరోసిస్‌ను అరికట్టే గుణం బఠాణీలకు ఉంది .
⇔బఠాణీలలోని విటమిన్–కెతో పాటు ఉండే ఇతర పోషకాలు వయసు పెరిగాక మతిమరపును తెచ్చే అలై్జమర్స్ డిసీజ్‌ను అరికడతాయి.
టాగ్లు: Health, Peas, ఆరోగ్యం, బఠాణీలు
దంత రక్షణకు వేప!
ఇంట్లో ఉండే పదార్థాలతోనే పంటి, నోటి సమస్యల్ని తగ్గించుకోవచ్చు. మరి అవేంటో చూద్దామా!
ఉసిరి: దీనిలో యాంటీ ఆక్సిడెంట్లూ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి నోటిలోని హానికర బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడి చిగుళ్లను కాపాడతాయి. ఉసిరి సహజ క్లెన్సర్‌లా పనిచేసి నోటి దుర్వాసననూ పొగొడుతుంది. కాబట్టి రోజూ ఓ ఉసిరిని తినేయండి. లేదా పావు చెంచా ఉసిరిపొడిని అరకప్పు నీటిలో కలిపి తాగినా ఫలితం ఉంటుంది.
వేపాకు: వేపలో చాలా ఔషధ గుణాలుంటాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను అంతమొందిస్తాయి. అంతేకాదు దంతాలకూ, చిగుళ్లకూ బలాన్ని, ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. కొన్ని చుక్కల వేపరసంతో మీ పళ్లూ, చిగుళ్లపై మృదువుగా రాయాలి. కాసేపాగి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
లవంగం: ఇందులోని యాంటీఇన్‌ఫ్లమేటరీ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పంటి నొప్పిని తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి. చిగుళ్ల సమస్యలు పెరగకుండా నియంత్రిస్తాయి. పావు చెంచా నువ్వుల నూనెలో కొన్ని చుక్కల లవంగం నూనె కలిపి, అందులో దూది ఉండను ముంచి పంటినొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టాలి. బుగ్గన రెండు లవంగ మొగ్గలు పెట్టుకున్నా ఉపశమనం లభిస్తుంది.
వంట సోడా: దీనిలోని ఆల్కలైన్ సమ్మేళనాలు నోటిలో ఎక్కువైన ఆమ్లాలను పీల్చుకుంటాయి. దంత క్షయానికీ, చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే ఆమ్లాలను వంటసోడాలోని ఆల్కలైన్ సమ్మేళనాలు నియంత్రిస్తాయి. దాంతో నోటిలో వాటి తీవ్రత తగ్గుతుంది. అయితే తరచూ వాడటం వల్ల పళ్ల ఎనామిల్‌కు హాని జరగొచ్చని మరవకూడదు. ఇలాంటి చిట్కాలు ఒకటిరెండురోజులు ప్రయత్నించి చూడొచ్చు. అప్పటికీ తగ్గకపోతే దంతవైద్యుల్ని సంప్రదించడం తప్పదు.
హెల్త్ టిప్స్
పళ్లనొప్పులకు... అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగం నూనెలను తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి. దాన్ని నొప్పి పెడుతున్న పంటిపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పంటినొప్పి తగ్గడంతోపాటు పళ్లు దృఢంగా తయారవుతాయి. గొంతునొప్పి, మంట, దగ్గుకు... టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం, అర స్పూన్ నల్ల మిరియాల పొడి, టీస్పూన్ ఉప్పులను ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి.
తలనొప్పి నివారణకు యాస్ప్రిన్ వేసుకోవడం అందరూ చేసే పనే. అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్లవచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది. అజీర్తి, పులితేన్పులు వస్తుంటే రెండు చిటికలు దాల్చిన చెక్క , రెండు చిటికలు శొంఠిపొడి, నాలుగు చిటికలు యాలకుల పొడీ కలిపి రోజూ భోజనానికి ముందు సేవిస్తూ ఉంటే అజీర్ణం, తేపులు రాకుండా ఉంటాయి.
టాగ్లు: Teeth pain, Clove, పళ్ల నొప్పు, లవంగం
అమ్మ మాట... అమృత తుల్యం!
ఆత్మీయం
బిడ్డకు తల్లే తన తొలి గురువు. అమ్మ ఏమి చెబితే, అది అక్షరాలా ఆచరిస్తారు. అమ్మను చూసి అనుసరిస్తారు. ఎందరో ప్రముఖులు బాల్యంలో తల్లి చెప్పిన మాట విని, దానిని అక్షరాలా ఆచరించి, ఆ తరువాత గొప్పవారయ్యారు. అందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. గాంధీగారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒకరోజు ఓడలో విదేశాలకు బయల్దేరబోతున్నారు. పరస్త్రీ సంగమం ఎన్నటికీ చేయనని తనకు మాటివ్వమని అడిగి తల్లి పుత్లీబాయ్ ప్రమాణం చేయించుకుంది. కొన్నేళ్ళ తరువాత ఒకసారి ఆయన చెయ్యకూడని పొరబాటు చేయడానికి వెళ్ళి అంగుళం దూరంలో ఉన్నప్పుడు అమ్మకిచ్చిన మాట గుర్తొచ్చి సర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇదంతా స్వయంగా ఆయన తన జీవిత చరిత్రలో నిజాయితీగా రాసుకున్నారు. అంత నిగ్రహం చూపి అలా వెనుకకు తిరిగి వెళ్ళిపోయిన కారణానికి ఆయన తరువాత కాలంలో మహాత్ముడయ్యాడు.
జాతిపిత అని, దేశప్రజల చేత ‘తండ్రీ’ అని పిలిపించుకోలిగాడు. తల్లి జీజీబాయ్ నూరిపోసిన దేశభక్తి, సనాతన ధర్మ పరిరక్షణ హితోక్తులతో శివాజీ మహరాజ్ సామ్రాజ్య స్థాపన చేసి, గోసంరక్షణ చేసి శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారి అనుగ్రహంతో భవానీ ఖడ్గాన్ని కూడా పొందగలిగాడు. అమ్మ మాట అమృతతుల్యం. అమ్మ వాక్కు బ్రహ్మ వాక్కు. ‘అమ్మ’ కు ఈ వేదభూమి, ఈ దేశం ఇచ్చిన గౌరవం అది. ఆ తరమయినా, ఈ తరమయినా, ఏతరమయినా సనాతన ధర్మ పరిరక్షణ అమ్మ చేతుల్లోనే ఉంది, అమ్మల చేతల్లోనే ఉంది. అందుకే అమ్మను గౌరవిద్దాం. ఆదరిద్దాం. ప్రేమిద్దాం. బాల్యంలో అమ్మ పెట్టిన గోరుముద్దలు తిన్నాం... పెద్దయ్యాక ‘అమ్మ మాట బోరు’ అనకుండా విందాం. ఆమ్మ కోరిక తీరుద్దాం.
టాగ్లు: Teacher, Mother, గురువు, అమ్మ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565