అన్నదాతా సుఖీభవ
భగవంతుడు ప్రసాదించిన భాగవత రత్నాకరములో అన్నము విశిష్టత చతుర్థ స్కంధములో చక్కగా తెలుపబడి నది. మైత్రేయుడు విదురునికి ధృవ్ఞని విషయాలను వివరిస్తూ విదురా! ధృవ్ఞడు వనములకు వెళ్లిన పిదప వారి కుమారుడు ఉత్కళుడు తన తండ్రి సార్వభౌమవైభవాన్ని, రాజ్యసింహాసనమును, రాజ్యభారాన్ని స్వీకరించలేదు. వైరాగ్యభావముతో పుట్టుకనుండియు శాంతిచిత్తుడును-ఆసక్తిరహితుడును, సమదర్శిగా నుండి సమస్త లోకములను తన ఆత్మయందును తన ఆత్మను సమస్తలోకములందును చూచినాడు.
శ్లోI సజన్మనో పశాన్తాత్మా నిఃసంగఃసమదర్శనంః దదర్శలోకేవితతం ఆత్మానలోకమాత్మని మరొక
శ్లోకం ద్వారా ఇలా తెలుపుతూ…
శ్లో ఆత్మానం బ్రహ్మనిర్వాణం ప్రత్యస్తమిత విగ్రహం అవబోధరసైకాత్మ్యం ఆనందమనుసంతతం విదురా! ఉత్కళుడు తన అంతఃకరణమునందలి వాసనా రూపమైన మాలిన్యమును అఖండయోగాగ్నిచే భస్మము చేసినాడు. తన ఆత్మను విశుద్ధ రస స్వరూపముగను, ఆనందమయముగను సర్వత్ర వ్యాపించిన దానినిగను చూచి నాడు. ఆత్మకంటె వేరుగా దేనినీ చూచేవాడు కాదు. అతని రాజ్యంలో కులవృద్ధులు, మంత్రులు అతనిని జడుడుగా, ఉన్మత్తునిగా భావించారు.
రాజ్యం అరాచకమౌతుందని గ్రహించారు. వెంటనే అతని చిన్నతమ్ముడును, భ్రమీ పుత్రు డును అగు వత్సరుని రాజుగా చేశారు. ఆ వంశ పరంపరలోని అంగుడను రాజునకు సునీత అను పత్ని వలన క్రూరుడైన వేనుడు జన్మించినాడు. అతని దుర్మార్గపు ప్రవర్తనకు ఖిన్నుడై అంగుడునగరము విడిచివెళ్లినాడు. మునులు అది గాంచి వేనుని దుస్స్వభావమునకు కుపితులైనారు. అతనికి శాపమిచ్చినారు. మునులశాపం అమోఘం. వేనుడు మరణించిన పిదప రాజ్యాన్ని పాలించే రాజు ఎవరునూ లేరు. రాజ్యంలో దొంగలు ప్రబలినారు. ప్రజల బాధలు ఎక్కువైనాయి.
అది చూచియును వేనుని కుడిభుజమును మధించినారు. దాని నుండి నారాయణుని అంశావతార మున్ను, ఆది సామాట్ట్రును అయిన పృథు చక్రవర్తి ప్రత్యక్షమై నాడు. విప్రులు పృథువ్ఞనకు రాజ్యాభిషేకం చేసి ప్రజలకు రక్ష కునిగా ప్రకటించారు. ఆ కాలంలో భూమిలో పంటలు క్షీణిం పగా ప్రజలు అన్నహీనమై, ఆకలితో అలమటించి శుష్కించిపో సాగినారు. పృథురాజుకు ఆకలిబాధను వివరింపగా ప్రజల ఆక్రందన విన్న రాజు ఖిన్ను డైనాడు. తీవ్రమైన విచారం సలిపిన పిదప ఒక ఆలోచన చేసినాడు రాజు. భూమి స్వయముగనే అన్న, ఓషధులను తన లోపల దాచియున్న దని నిశ్చయించుకుని వెంటనే తన ధనుస్సునెత్తి, క్రుద్ధుడై భూమి వైపు గురిబెట్టి బాణమును సంధిం చినాడు. భూమి కంపించి వణకసాగినది.
భయపడి భూమాత గోరూపము ధరించి పరుగిడసాగింది. రాజు వెంటాడినాడు. రాజు ఆగ్ర హమును గ్రహించి భూమి రాజును స్తుతించి హృదయమును విచారణ చేసుకుని ఇలా అన్నది. శ్లోII సంనియచ్ఛాభిభోమన్యుం నిబోధశ్రావితంచమే సర్వతః సారమాదత్తే యధామధుకరోబుధఃII ప్రభూ! మీరు కోపమును చల్లార్చుకుని నా ప్రార్థననాలకింపుడు. బుద్ధిమంతులైన వారు తుమ్మెద వలె అన్ని చోట్ల నుండి సారమును గ్రహించుదురు. సమస్త ప్రాణులకును అభీష్టమైనదియును, బలమును వృద్ధి పఱచునదియునగు అన్నము మీకు కావలసినచో నాకు మీకు వెంటనే యోగ్యమగు దూడను, పాత్రను, పాలు పితుకువానిని తెచ్చుకొను ఏర్పాటుచేయుడు. ఆ దూడమీద ప్రేమచే నేను క్షీరరూపమున నీకు సమస్త అభీష్ట పదార్థములను ఇస్తాను అన్నది భూదేవి. భూమి తెలిపిన హితవచనములను విన్నాడు. ఆమె మనవికి అంగీకరించి పృధ్డువు మనువును దూడగా చేసుకుని స్వయముగ సమస్త ధాన్యములను పితికినాడు.
పృథుచక్రవర్తి ఆచరించిన యజ్ఞములచే చాలా సంతసించి యజ్ఞభోక్తయు, యజ్ఞేశ్వరుడును అగు విష్ణు భగవానుడు ఇంద్రునితో కలిపి రాజు వద్దకు వచ్చాడు. రాజా! రూను అశ్వమేథ యాగములు పూర్తి చేయవలెనను మీ సంకల్పమునకు ఇంద్రుడు విఘ్నము కలుగజేసెను. ఇపుడు వారు మిమ్ములను క్షమాపణ కోరుచున్నారు. మీరు క్షమించమని కోరినాడు. ఇంకనూ భగవంతుడు రాజునుద్దేశించి శ్లోII సుధియఃసాధవోలోకే నరదేవనరోత్తమాః నాభిద్రుహ్యన్తి భూతేభ్యో యర్హినాత్మాకలేవరమ్II అంటూ రాజా! సాధువులు, సద్బుద్ధి సంపన్నులు అగు శ్రేష్టమానవులు ఇతరులకు ద్రోహం చేయరు. ఈ శరీరము ఆత్మకాదు కావ్ఞన మీ వంటివారు కూడా నా మాయచే మోహితులైనచో, ఇక బహుకాలమాచరింపబడిన జ్ఞానుల సేవచే కేవలం శ్రమయే మిగిలినదగును. జ్ఞానులైనవారు ఈ శరీరమును అవిద్యా, వాసనా, కర్మముల ఫలితమని తలచి దీనియందు ఆసక్తులు కాకుందురు.
మమత్వం కల్గియుండరు. అంటూ ఆత్మతత్వం బోధగావించి రాజా! మీ ఉన్నతగుణములు, స్వభావమును నన్ను తృప్తిపరచినవి. మీకిష్టమైన వరము కోరడు. సమత్వము గలవారి హృద యంలో నేను వసిస్తాను అన్నాడు భగవంతుడు. పృథువ్ఞ స్తోత్రముచేయగా ఆజ్ఞను పాలంచుట ధర్మమని ఎరింగ నంతనే భగవంతుడు అంతర్థానమైనాడు. రాజు పిదప యజ్ఞదీక్ష చేపట్టి దీక్షచేయగా దేవతలు బ్రహ్మర్షులు, రాజ ర్షులుగా వారిని గౌరవించి వారిని స్తోత్రము చేసి భూదేవి నుండి వివిధ ధ్యానములను స్వీకరించి ప్రజలను ఆకలి బాధ నుండి విముక్తులను గావించినాడు. ప్రజలు రాజు ఉదారతను, సద్గుణములను స్తుతించారు. రాజ ధర్మాన్ని ప్రశంసించి సంతృప్తులై అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి అన్నదాతా సుఖీభవ అని పృధుమహారాజును కొనిచాడుట రాజు ప్రజల మధ్య వాత్సల్యాన్ని తెలుపుతుంది. జీవ్ఞలకు అన్నపానాదులే కదా ప్రధానం. ”నమో భగవతే వాసుదేవాయ
– పి.వి. సీతారామమూర్తి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565