MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఇలా మెరిసిపోదాం..Shining Your Face Like this

ఇలా మెరిసిపోదాం...
వేడి ప్రభావానికి చర్మం కాంతి విహీనంగా మారుతుంది. దాన్ని అధిగమించి చర్మం తాజాగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిల్లో ఇవి కొన్ని... 

ఎండలో ఎక్కువ తిరిగే వారి చర్మం సులువుగా నల్లగా మారుతుంది. దుమ్మూ, ధూళి చేరి మృదుత్వాన్ని కోల్పోతుంది. ఇలాంటప్పుడు పావు కప్పు చొప్పున బత్తాయి, క్యారెట్‌, నిమ్మరసం కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆపై సహజంగా ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుంటే చాలు. మురికివదిలి ముఖం కళగా మెరిసిపోతుంది. 
* అరకప్పు పెరుగులో పావుకప్పు కీరదోస రసం, చెంచా తేనె, రెండు చుక్కల ఆలివ్‌నూనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎండతగిలే శరీర భాగాలైన ముఖం, మెడా, చేతులకు రాసుకోవాలి. ఇరవై నిమిషాల పాటు ఈ ప్యాక్‌ని ఆరనిచ్చి చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారంలో కనీసం రెండుమూడు సార్లైనా చేస్తే ఎండ ప్రభావానికి గురైన చర్మం సాంత్వన పొందుతుంది. 
* ముఖం కాంతివిహీనంగా కనిపిస్తున్నప్పుడు పావుకప్పు కొబ్బరి నీళ్లలో, రెండు చెంచాల పాలు, కొద్దిగా గులాబీనీరు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆపై సవ్య, అపసవ్య దిశల్లో పదినిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేస్తే రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ముఖం తాజాగానూ కనిపిస్తుంది. 
* కళ్లుకింద వాపూ, నల్లటి వలయాలు ముఖాన్ని కాంతివిహీనంగా కనిపించేలా చేస్తాయి. దీనికి పరిష్కారంగా బంగాళాదుంప రసంలో కొద్దిగా గులాబీనీరు కలిపి దానిలో ముంచిన దూదితో కళ్లకింద అద్దుకోవాలి. ఆపై చల్లటినీళ్లతో ముఖం కడుక్కుని తరవాత రెండు చుక్కల బాదం నూనెతో కళ్లకింద చర్మంపై మృదువుగా మర్దన చేయాలి. 
* చర్మంపై టాన్‌, మృతకణాల వంటి సహజంగా ఎదురయ్యే సమస్యలు. వీటి నివారణగా అరకప్పు ఓట్‌ మీల్‌లో నాలుగు టేబుల్‌ స్పూన్ల బియ్యం రవ్వా, పావు కప్పు కీరదోస రసం కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి పాలునీ కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడా, చేతులకు పట్టించి నలుగులా రుద్దితే మృతకణాలు తొలగిపోతాయి. ముఖంపై పేరుకొన్న టాన్‌ వదిలిపోతుంది. చర్మం మృదువుగా ఉంటుంది.

ఏమని పొగడం!
పొగడ గింజలను మెత్తని చూర్ణం చేసి, రోజూ దానితో దంతాలు తోముకుంటే, వదులైన దంతాలు గట్టిపడతాయి. పొగడ వేరు బెరడును నీటిలో మెత్తగా నూరి, ఒక స్పూన్‌ ముద్దను అరకప్పు ఆవు పాలలో కలిపి, ప్రతి రోజూ ఉదయాన అలా మూడు రోజుల పాటు సేవిస్తే వృద్దుల దంతాలు కూడా ధృడపడతాయి. దీని పట్టను నమిలినా కదులుతున్న దంతాలు సైతం గట్టిపడతాయి. గింజల పొడిని అద్దితే, చిగుళ్ల వాపు తగ్గుతుంది.
30 మి.లీ చెక్క కషాయాన్ని రెండు పూటలా సేవిస్తే మూత్రపు మంట తగ్గుతుంది.
అరకప్పు పెరుగులో ఒక తులం పొగడ బెరడు రసం కలిపి రెండు పూటలా సేవిస్తే, అతిసార వ్యాధి అమీబియాసిస్‌, డిసెంట్రీ తగ్గిపోతాయి.
30 మి.లీ పొగడ చెక్క కషాయాన్ని గానీ, పచ్చి కాయలతో చేసిన కషాయాన్ని గానీ, రెండు పూటలా తాగుతూ ఉంటే, మూత్ర మార్గంలోని పుండ్లు, చీము, స్రావాలు, నొప్పి, మూత్రం ద్వారా వచ్చే రక్తస్రావం తగ్గుతాయి.
రెండు స్పూన్ల పొగడ బెరడు రసాన్ని రోజూ రెండు పూటలా సేవిస్తే గర్భాశయానికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి గర్భధారణకు మార్గం సుగమం అవుతుంది.
పొగడ పూలను నీడన ఎండించి, వస్త్రంతో వడబోసి ఆ చూర్ణం భద్రపరుచుకోవడం ఎంతో క్షేమం. తలనొప్పితో బాధపడేవారు రెండు చిటికెల ఈ చూర్ణాన్ని నస్యంగా పీలిస్తే, తలనొప్పి తక్షణమే తగ్గిపోతుంది.
పొగడ పూల రసాన్ని ప్రతి రోజూ నీళ్లల్లో కలిపి తాగుతూ ఉంటే, గుండె ఎక్కువగా కొట్టుకోవడం తగ్గిపోవడంతో పాటు గుండెకు బలం చేకూరుతుంది.

శుభాన్నే సంకల్పించాలి
ఆత్మీయం
భారతీయ ఆధ్యాత్మిక వాఙ్మయం అత్యంత ప్రాచీనమైనది, శాస్త్రీయమైనది. భూమి, సౌరవ్యవస్థలోని గ్రహాల పరిభ్రమణం మొదలైన వివరాలను మన మహర్షులు ఎంతో శోధించి మనకు అందించారు. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ ఆధ్యాత్మికమైనవే. కంటికి కనిపించని పరబ్రహ్మ దర్శనం వేదధర్మం వలన కలుగుతుంది. నీరు, నిప్పు, గాలి, సూర్యచంద్రులు, పర్వతాలు, పుడమి, చెట్టు, చేమా...అన్నీ ఈశ్వరమయాలు.
అవి మనకు శాంతిని, సుఖాన్ని కలిగించాలని అధర్వణ వేదం ఆకాంక్షిస్తోంది. చుట్టూ ఉన్న ప్రపంచంలోని స్థావర జంగమాలన్నీ సమృద్ధిగా ఉండాలని కోరుకోవడమే కాక ఏ పీడలూ లేకుండా ఉండాలని ఆకాంక్షించారు వేదర్షులు. వేదాలు మనకు బోధించింది ఏమిటంటే.. మనం చేయగలిగినదంతా చేసి, ఊహించని ఫలం ఎదురైనప్పుడు ప్రారబ్ధమనో, దైవ సంకల్పమనో సమాధానపడాలి.
ఆ ఫలం కూడా గతంలో మన కర్మకు ప్రతిఫలంగానే భావించాలి. ఏదేమైనా శుభాన్నే సంకల్పించడం, ఆశించడం మన విధి. భగవద్గీతను బోధించిన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వేదధర్మాన్ని బోధించాడు. వేదాలు, ఉపనిషత్తులు మనకేవో అర్థంకాని విషయాలు చెబుతాయని అనుకోనక్కర్లేదు. చిన్న చిన్న కథలతో జ్ఞానమార్గాన్ని చూపించే శక్తియుక్తులు వాటిలో చాలా ఉన్నాయి. మనిషి చేయాల్సిందల్లా ఆ జ్ఞానాన్ని పొందడానికి త్రికరణశుద్ధిగా గురువును అనుసరించడమే. అప్పుడు సమాజమంతా జ్ఞానమయమే అవుతుంది.

టాగ్లు: Indian spiritual, Spiritually, భారతీయ ఆధ్యాత్మిక, ఆత్మీయం

క్యాన్సర్లను తరిమేసే కరివేపాకు
గుడ్‌ఫుడ్‌

కూరలో కరివేపాకు అంటూ దాని పేరిట ఒక సామెతే వెలిసింది. కానీ కరివేపాకు అంత తీసివేయదగినది ఎంతమాత్రమూ కాదు. దానితో ఒనగూరే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కరివేపతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే...
►కరివేపాకులో క్యాన్సర్లను తరిమేసే గుణం ఉంది. కాబట్టే ఉత్తరాది వారితో పోలిస్తే... కూరలతో పాటు చాలా వంటకాల్ని తాలింపు పెట్టుకునే అలవాటు ఉన్నందున దక్షిణాది ప్రాంతాలవారికి జీర్ణసంబంధిత క్యాన్సర్ల వంటి కొన్ని రకాల విస్తృతి చాలా తక్కువ. కరివేపాకుతో ల్యూకేమియా, ప్రోస్టేట్‌ క్యాన్సర్లు సైతం దూరమవుతాయి. కరివేపలో క్యాన్సర్లతో పోరాడే, నివారించే గుణం అందని జపాన్‌లోని మెజియో యూనివర్సిటీకి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడికల్‌ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ నిపుణులు ఆధారాలతో సహా నిరూపించారు.
►కరివేపలో డయాబెటిస్‌తో పోరాడే గుణం కూడా ఉంది. ఈ విషయాన్ని చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌కు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ అండ్‌ మాలెక్యులార్‌ బయాలజీ విభాగం సైతం తమ అధ్యయనాల్లో నిరూపించింది.
►మన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ పాళ్లను కరివేపాకు గణనీయంగా తగ్గిస్తుందని ‘యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ’లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ పరిశోధకులు తేల్చి చెప్పారు.
►కరివేపాకులో విటమిన్‌–ఏ పాళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మన ఆహారాల్లో కరివేప వాడేవారి చూపు చాలాకాలం పాటు బాగుంటుంది.
►కరివేప కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి, సిర్రోసిస్‌ బారినుంచి కాలేయాన్ని రక్షిస్తుంది. హెపటైటిస్‌ వంటి సమస్యలను నుంచి కూడా రక్షిస్తుంది.
►చర్మసౌందర్యాన్ని ఇనుమడింపజేయడంలో కరివేపాకు భూమిక చాలా ఉందని తేలింది. జుట్టు బాగా పెరిగేందుకు కూడా దోహదపడుతుంది.
► ఒత్తిడిని అధిగమించడంలోనూ బాగా ఉపయోగపడుతుందని తేలింది. 
టాగ్లు: Curry leaves, Cancer, కరివేపాకు, క్యాన్సర్

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list