మానవజన్మ మహత్తు
ఉపాధులన్నింటిలో మనుష్యుని ఉపాధి ఉత్తమోత్తమమైనది. ఆత్మదీప్తి ప్రకాశం కలిగిన మనుష్యులు తక్కిన జంతువులవలె ఉదర పోషణతో తృప్తి చెందక యుక్తాయుక్త వివేకం, ఆత్మకల్యాణ జ్ఞానం మొదలైన సాధనలతో మోక్షాన్ని సాధించగలుగుతున్నారు. ఈశ్వరుడే అన్నింటికీ కారణమని తెలుసు కొన్నాడు. భగవంతుని నుంచి పుట్టినదంతా ప్రళయ కాలంలో తిరిగి భగవంతునిలోకి లీనమ వుతుంది. అంతవరకు పాపపుణ్యాల లెక్కలతో జనన మరణ చక్రంలో తిరుగాడుతూ ఉంటుందని మానవుడు తెలుసుకొన్నాడు.
మానవుడు ఒకవేళ పుణ్యకర్మ ఆచరించి నట్లయతే స్వర్గలోకాదులను పొందినప్పటికీ ఆ పుణ్యఫలం నశించినా, లేక అహంకారం పెరిగినా తిరిగి మనష్యలోకంలోకి రావాల్సిందే నని యయాతి మహారాజు లాంటి జీవిత చరిత్రలు చెప్తున్నాయ. నిత్యమూ, సత్యమూ అయన పరమాత్మ సాయుజ్యాన్ని పొందా లంటేబంధాలను, రాగాలను, పాప పుణ్యాల సంచయాలను నిర్మూలన చేసుకోవలసిందే. ఇట్లా మమత లను వీడడం అనేది సులభ మైన పని కాదు. దేహంతోకూడిన జన్మను పొందిన తరువాత దేహి ఎపుడూ శారీరకమైన సుఖాలను కోరుకుంటూ ఉంటాడు. ఆ లౌకిక సుఖాలను పొందడానికి శరీరం కావాలి. సహజంగా ప్రాణులందరూ తమ తమ శరీరాలను అపురూపంగా చూసుకొంటారు. పండితులు కూడా శరీరం అనేది ఉంటేనే కదా పలుధర్మకార్యాలు చేయడానికి అని శరీనాన్ని జాగ్రత్తగా చూసుకొంటారు. రంతిదేవుడు, శిబి చక్రవర్తి లాంటి వారు శరీరాన్ని పెంచి పోషించుకుంది ఇతరులకు ఉపయోగపడడానికే కాని అందచందాలకు కాదని వేరే వారికోసం శరీరాన్ని తృణప్రాయంగా ఎంచారు.
కాని వీరందరూ వారి ప్రాణాలకు ముప్పు ఏమీ లేదని కనుక దానం ఇచ్చారు అనుకొంటే దధీచి మహర్షి తాను బతికి ఉన్నప్పుడే మహేంద్రుని వజ్రాయుధం కోసం తన వెన్నుముకను దానం చేసాడు. తాను యోగాగ్నిలో లీనమై తన వెన్నముకను దానం చేసిన త్యాగశీలిగా వినుతికెక్కాడు. ఇలా ఎందరో శరీరాన్ని అసలు మానవ జన్మను కేవలం ఇతరులకు ఉపయోగపడేవిధంగానే మసలుకున్నారు.
మరణం వస్తుంది అంటే భయపడి దానికి దూరంగా ఉండాలని సాధారణ జీవుడు అనుకొంటూ ఉంటాడు. కాని మరణం అనేది తప్పదు. కనుక చనిపోయనా కీర్తి కలిగి ఉంటే అంటే మంచి పనులు చేసి నలుగురికి ఉపయె గకరమైనవి చేపడితే వారు చనిపోయనా వారిని స్మరించడం వల్ల వారు జీవించి ఉన్నట్టుగా నే పరిగణించబడుతారు. వారినే నిత్య స్మరణీయులు చిరంజీవులని అంటారు. ఇట్లా చేయడంలో అమృతోత్పాదన అంటారు. అమృతాన్ని సాధించి దాన్ని సేవించి చిరంజీవి గా ఉండడం కన్నా త్యాగగుణంతో మనుషులు దేహాన్ని వదిలినా వారి అజరా మరమైన కీర్తితో సజీవులై మెలుగుతారు. దీనికి మనుష్యుల్లో త్యాగగుణంతో పాటుగా మానవత్వం పరిమ ళించాలి. సౌభాహృత్వంతో మెలిగినపుడు మానవత్వపు పరిమళం వీచి త్యాగగుణాన్ని ఉద్దీప్తం చేస్తుంది. దానితో మానవుడు మహనీ యునిగా ఎదుగుతాడు. చిరస్మరణీయుడు అవుతాడు.
- గున్న కృష్ణమూర్తి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565