ధ్వజస్తంభమంటే..
దేవాలయ దర్శనంతోపాటుగా ధ్వజ స్తంభ దర్శనం సాధారణమే. అయతే ఈ ధ్వజస్తంభంఈ దేవాలయాల్లో ఎందుకు నిలుపుతారు అని తరిచిచూస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనకు తెలుస్తాయ.. అవి ఏంటంటే
‘్ధ్వజ’మనగా పతాక. అనగా జనసామాన్య భాషలో జండా. స్తంభమనగా కంభం. అది కర్రదైనా కావచ్చు. లోహంతో చేసిందైనా కావచ్చు. లేక రాతిదైనా కావచ్చు.
స్తంభం పొడుగ్గా, ఎత్తుగా ఉంటుంది. ఆకసంలోకి చొచ్చుకుపోయి, మబ్బుల్తో ముచ్చటిస్తూ ఉంటుంది. కదలకుండా స్థిరంగా ఉంటుంది. కానీ, ధ్వజం మాత్రం ‘రెపరెప’లాడుతూ ఉంటుంది. రెండూ పరస్పర విరుద్ధాలు. వైవిధ్య భరితమైనదే కదా సృష్టి!
ఇక లోతుల్లోకి వెళ్తే-
‘స్తంభించినదే స్తంభం’ కాబట్టి, ఆకాశమూ స్తంభమే! అనంత మహావిశ్వమూ స్తంభమే. అది కదలదు. ఉన్నచోటే ఉంటుంది. ఇక దాని చివర్లో ‘రెపరెప’లాడే సూర్యుడే ఆ పతాక.
స్తంభం సరే. సూర్యుడెలా పతాక?
సూర్యుని నిండా హైడ్రోజన్, హీలియమ్ వాయువులే! మంటలే! అవి ‘్భగభగ’, ‘్భగభుగ’మంటూంటాయి. ‘రెపరెప’లాడుతూంటాయి. లక్షల మైళ్ళ దూరం విస్తరిస్తాయి. అందువల్ల అక్షరాలా సూర్యుడూ ధ్వజమే! అనగా పతాకయే! సూర్యుడే ఎందుకు? నక్షత్రం కావచ్చు కదా?
కావచ్చు. కానీ, సూర్యుడున్న వేళ నక్షత్రాలు కనిపించవు. దూరంగా పారిపోతాయి. అనగా అదృశ్యమవుతాయి.
చంద్రుడూ కావచ్చుకదా?
రాత్రుళ్ళైతే సరే. కానీ, పగటివేళ చంద్రుడూ వెలవెలబోతాడు. అనగా, స్పష్టంగా కాంతివంతంగా కనిపించడు. కాంతిని కోల్పోయి, నేల చూపులు చూస్తాడు రాముని ముందు పరశురామునివలె (రాముడు సూర్య, ప్రతీక, పరశురాముడు చంద్ర ప్రతీక). ఐనా, సూర్యుడూ ఒక నక్షత్రమే. మనకత్యంత దగ్గర్లోని నక్షత్రం. ఇక చంద్రుడో సూర్యప్రతిబింబం. అనగా, అద్దంలో సూర్యుడు. కాబట్టి స్థూల దృష్టికి మాత్రమే సూర్యచంద్రులు వేరువేరు. సూక్ష్మదృష్టికి మాత్రం ఇరువురూ ఒకరే! అందువల్ల ఆకాశమే స్తంభమనీ, సూర్యుడే ధ్వజమని చెప్పడం సముచితంగా ఉంటుంది. పైన ఒక యజ్ఞం జరుగుతోంది. విశ్వపురుషుడు నక్షత్రాల్ని కుప్పలుగా పోసి ఒక యజ్ఞం చేస్తున్నాడు. అది విశ్వయజ్ఞం. (అదే విశ్వప్రతీకయైన దశరథ యజ్ఞం. దానికి అనుకరణే, అనుసరణే, మనం చేసే ద్రవ్యయజ్ఞం. లేదా కామ్యయజ్ఞం.)
దేవతలు చేసిన ఒక యజ్ఞంలో సూర్యున్ని ధ్వజస్తంభానికి యజ్ఞపశువుగా కట్టివేశారని ఒక కథ. ఇది కేవలం ఒక కల్పనాచాతుర్యమే! కట్టుకథే! ఐనా, అర్ధవంతం (ముని కుమారుడైన శునఃశేవుని కట్టివేశారని మరో కథ. మునులు నక్షత్ర ప్రతీకలు. కాబట్టి నక్షత్రం కొడుకు మరో నక్షత్రమే అనగా మళ్ళీ సూర్యుడే. చంద్రుడని చెప్పుకున్నా ఇబ్బందిలేదు. చంద్ర ప్రతికమైన కర్ణుడు సూర్యకుమారుడే కదా!) నిజానికి చంద్రుడనగా అద్దంలో సూర్యుడే!) ‘‘వర్షతీత వృషభః’’- కాబట్టి వెలుగునీ, వేడిమినీ విద్యుత్తునీ విద్వత్తునీ శక్తినీ, మబ్బుల ద్వారా నీటినీ, ఆపై అనుగ్రహాన్నీ వర్షిస్తాడు కాబట్టి, సూర్యుడొక వృషభం. అంతేకాదు. సూర్యుడు కిరణ స్వరూపుడు. కిరణమనగా సాంకేతిక పరిభాషలో అశ్వమే. అందువల్ల కిరణ స్వరూపుడైన సూర్యున్ని అశ్వమన్నా అభ్యంతరముండదు కదా?
వృషభమైనా, అశ్వమైనా పశువే. ‘పాశంతో బంధింపబడినదే పశువు’. మనిషికి సైతం ఎన్నో, ఎనె్నన్నో బంధాలు. కాబట్టి మనిషి కూడా ఒక పశువే!... డ్జ్ళనిజ నిజ! మనమంతా పశువులమైతే ఈశ్వరుడు పశపతి? అందువల్ల దేవతలు సూర్యున్ని ఆకాశమనే యజ్ఞస్తంభానికి బలి పశువుగా బంధించారన్నమాట.
ఇక్కడ మనకు ప్రహ్లాదుని కథ గుర్తుకొస్తుంది. ‘‘ఈ స్తంభమున చూపగలవే చక్రిన్! గిక్రిన్?’’ అన్న తండ్రి ప్రశ్నకు, ‘‘ఎందెందువెదకి చూచిన అందందే కలడు’’ అంటూ ప్రహ్లాదుడు సమాధానమివ్వడం, హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని పగులగొట్టడం, శ్రీహరి నారసింహునిగా ఆ స్తంభం లోంచి బయటపడడం, హిరణ్య కశిపుణ్ణి సంహరించడం లోక విదితమే.
- గన్ను కృష్ణమూర్తి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565