MohanPublications Print Books Online store clik Here Devullu.com

దక్షిణాదేవి స్తోత్రం_dakshinaDevi_Stotram



శ్రాద్ధ కర్మలయందు,యజ్ఞ కర్మల యందు
 దక్షిణా దేవి ప్రాముఖ్యత


ఒక గోపిక ... సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా మారిపోవడం అనేది మనకి 'దక్షిణా దేవి' విషయంలో కనిపిస్తుంది. నిజానికి దక్షిణా దేవి గురించి చాలా తక్కువ మందికి తెలుసు.


రాధా కృష్ణుల ప్రేమ ప్రపంచంలో ... ప్రణయ తీరాల్లో విహరిస్తూ వున్న రోజుల్లో 'సుశీల' అనే గోపిక రాధకి ప్రధాన సహచరిగా వుండేది.గోలోకములో రాస లీలా వినోదములో తన్మయుడై యుండగా అతని దక్షిణ భాగము నుండి ఒక కన్య జనించెను. కృష్ణుని దక్షిణ పార్శ్వము నుండి పుట్టినది కావున ఆమెకు దక్షిణా దేవి అను పేరు గలిగెను .ఈమె శ్రీ కృష్ణుని యర్ధాంగి యగు రాధకు ప్రియసఖి రాధాకృష్ణులకు నిత్యము సేవలు చేయుచుండెను .


ఒకసారి ఆమె శ్రీ కృష్ణుడితో మాట్లాడుతూ ఊహించని విధంగా ఆయన తొడపై కూర్చుంది. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన రాధ ... పరిగెత్తుకు రాసాగింది. అది చూసిన సుశీల అక్కడి నుంచి పారిపోయింది. తిరిగి ఆమె గోకులంలో ప్రవేశిస్తే ప్రాణాలు కోల్పోతుందని రాధ శాపం పెట్టింది..దక్షిణ ,గోలోకము వదలి వైకుంటము నందున్న లక్ష్మీలో ప్రవేశించెను .దక్షిణా దేవి యద్రుశ్యు రాలగుట వలన యజ్ఞ యాగాదులు చేసిన వారికి ఫలము దక్కకుండా బోయెను.

"దానం యజ్ఞా నాం వరూధం దక్షిణా " అని శ్రుతి (యజ్ఞములు పూర్తియైన తరువాత దక్షిణా దానము తప్పని సరి . ఆ దక్షిణ యజ్ఞ ఫలమును కవచము వలె కాపాడి ,యజమానునకి చ్చును ) దేవతలకు హవిర్భాగములు సరిగా అందకుండా పోయెను . ఈ విషయమును దేవతలు బ్రహ్మతో చెప్పుకొనిరి . బ్రహ్మ కోరికపై విష్ణువు , లక్ష్మి నుండి దక్షిణను వేరు చేసెను .యజ్ఞ సంబందమైన సమస్త కార్యములను సంపన్న మొనర్చుటకు దక్షిణాదేవిని తీసుకుని పోయి యజ్ఞ పురుషునికి ఇచ్చి పెండ్లి చేసెను .యజ్ఞ పురుషునికి దక్షిణ యందు ఫలుడు (ఫలము ) అను పుత్రుడు గలిగెను.

బ్రహ్మ ,కళ్యాణ సమయ మందు దక్షిణా యజ్ఞ పురుషులకు వర మిచ్చెను . "యజ్ఞము చేసిన తరువాత యోగ్యమైన దక్షిణ నీయనివారికి ఫలము లేక పోవును.దక్షిణా యుక్తమైన యజ్ఞమే ఫలము నిచ్చును " అని దక్షిణ లేని యజ్ఞముల ఫలము బలి చక్రవర్తికి చెందును.

" యే బ్రాహ్మణా బహు విదః తేభ్యో యద్దక్షి ణాన నయేత్ ,దురిష్టగ్ స్యాత్ " అని శ్రుతి (బాగుగా చదువుకొన్న బ్రాహ్మణులు ,అధ్వర్యులు గాను ఋత్విక్కులు గాను ఇతర పాత్రల లోను నిలిచి యజ్ఞము జరిపించిన తరువాత వారి కియ్యవలసినంత దక్షిణ సరిగా నియ్యక పోయినచో యజమానికి అనర్ధము కలుగునని యర్ధము )

శ్రాద్ధ కర్మలయందు,యజ్ఞ కర్మల యందు,దేవతా ప్రీత్యర్ధం మొనరించిన సకల పూజా కార్యక్రమములందు యజ్ఞ కర్త దక్షిణ ఇవ్వకున్నను,పురోహితుడు దక్షిణ ఆర్జించని యెడల శ్రీ మహాలక్ష్మీ శాపముతో దరిద్రుడై భాదలను అనుభవించునని బ్రహ్మ వైవర్త పురాణం నందు వివరించబడినది.దక్షిణ ఇవ్వకుండా,తీసుకోకుండా చేయు కర్మ ఫలితాలు బలి చక్రవర్తికి చెందును.శ్రాద్ధ కర్మములందు అర్పించిన వస్తువులన్నియు బలి చక్రవర్తికి భోజన రూపమున చేరగలవు.

దక్షిణా దేవి స్తోత్రమును యజ్ఞ సమయమున పఠించిన వారికి సర్వ యజ్ఞ ఫలములు నిర్విగ్నంగా సంపన్నమగును.దక్షిణాదేవి దివ్య చరితా శ్రవణ మొనర్చిన వారికి ధనం,విద్య,స్ధిరాస్తులు,లభించును.అలాంటి దక్షిణా దేవిని పూజించిన వారికి వ్యాధుల బారి నుంచి ... బాధల బారి నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

దక్షిణాదేవి ధ్యానము, స్తోత్రము, పూజాదికము, ఆ దక్షిణాదేవిని సాలగ్రామము లేక కలశమున ఆవాహనము చేసి పూజింపవలెను.

ఈదేవిని ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయైస్వాహా అను మూల మంత్రముచే పూజించుచు అర్ఘ్యపాద్యాది షోడశోపచార పూజలను చేయవలెను.




 దక్షిణా దేవి స్తోత్రం


పురా గోలోకగోపీ త్వం గోపీనాం ప్రవరాపరా |

రాధాసమా తత్సఖీ చ శ్రీకృష్ణప్రేయసీ ప్రియే ||




కార్తికీ పూర్ణిమాయాంతు రాసేరాధా మహోత్సవే |

ఆవిర్భూతా దక్షిణాంశాత్‌ కృష్ణస్యాతో హి దక్షిణా ||




పురా త్వం చ సుశీలాఖ్యా శీలేన సుశుభేన చ |

కృష్ణ దక్షాంశవాసాచ్చ రాధాశాపాచ్చ దక్షిణా ||




గోలోకాత్త్వం పరిద్వస్తా మమభాగ్యాదుపస్థితా |

కృపాం కురమత్వమేవాద్య స్వామినం కురు మాం ప్రియే ||




కర్తౄణాం కర్మణాం దేవీ త్వమేవ ఫలదా సదా |

త్వయా వినా చ సర్వేషాం సర్వం కర్మ చ నిష్ఫలం ||




ఫలశాఖా విహీనశ్చ యథావృక్షో మహీతలే |

త్వయా వినా తథా కర్మ కర్తౄణాం న చ శోభతే ||




బ్రహ్మవిష్ణు మహేశాశ్చ దిక్పాలాదయ ఏవ చ |

కర్మణశ్చ ఫలం దాతుం న శక్తాశ్చ త్వయా వినా ||




కర్మరూపీ స్వయం బ్రహ్మా ఫలరూపీ మహేశ్వరః |

యజ్ఞరూపీ విష్ణురహం త్వమేషాం సారరూపిణీ ||




ఫలదాతా పరం బ్రహ్మ నిర్గుణః ప్రకృతేః పరః |

స్వయం కృష్ణశ్చ భగవాన్‌ న చ శక్తస్త్వ యా వినా ||




త్వమేవ శక్తిః కాంతే మే శశ్వజ్జన్మని జన్మని |

సర్వకర్మణి శక్తోహం త్వయాసహ వరాననే |




లక్షీ్మ దక్షాంశ సంభూతాం దక్షిణం కమలాకళాం |

సర్వకర్మసు దక్షాం చ ఫలదాం సర్వకర్మణాం ||




విష్ణోః శక్తి స్వరూపాం చ సుశీలాం శుభదాం భజే |

ధ్యాత్వానేనైవ వరదాం సుధీర్మూలేన పూజయేత్‌




ఈ దక్షిణాఖ్యానమును శ్రద్ధగా విన్నచో అతడు చేయు సత్కర్మలు నిర్విఘ్నముగా పరిపూర్ణమగును. పుత్రులు లేని వారికి పుత్రులు, భార్యలేనివారికి గుణవతియగు భార్య, విద్యలేనివానికి విద్య, ధనములేనివానికి ధనము, భూమిలేనివానికి భూమి లభించును. కష్టకాలమున, బంధువుల వియోగకాలమున, కారాగారమున బద్దుడైనప్పుడు దీనిని ఒక నెలవరకు విన్నప్పటికిని అతని కష్టములన్నియు తీరిపోవును.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list