MohanPublications Print Books Online store clik Here Devullu.com

సదా మీ సేవలో-In your service

సదా మీ సేవలో 
- గూగుల్‌ అసిస్టెంట్‌
వార్తలు వెతికిపెట్టడం, ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌, ఏ వస్తువు ఎక్కడుందో గుర్తు పెట్టుకోవడం, పాటల ప్లే లిస్ట్‌ రూపొందించడం, ఆంగ్ల పదాల అర్థం చెప్పడం... మీకు ఇలాంటి పనులు చేయడానికి ఓ అసిస్టెంట్‌ కావాలా? అయితే గూగుల్‌ అసిస్టెంట్‌ వాడేయండి. ఆపిల్‌ మొబైల్స్‌లో సిరి... అమెజాన్‌లో అలెక్సా... విండోస్‌ ఫోన్స్‌లో కొర్టానా... అలాగే ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లకి గూగుల్‌ అసిస్టెంట్‌! గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను తనలో ఇముడ్చుకున్న ఈ అసిస్టెంట్‌తో ఏమేం చేయొచ్చో చూసేయండి!
గూగుల్‌ అసిస్టెంట్‌ మన దేశంలో ఇంకా ప్లే స్టోర్‌లోకి ఆప్‌ రూపంలో రాలేదు. అయితే దీన్ని గూగుల్‌ ఆలో ఆప్‌లో పొందొచ్చు. వాట్సాప్‌ తరహాలో మెసేజింగ్‌ ఆప్‌లా పనిచేసే ఆలో ఆప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోగానే... ఛాట్‌ ట్యాబ్‌లో గూగుల్‌ అసిస్టెంట్‌ కనిపిస్తుంది. పైన ఉన్న మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే ‘యాడ్‌ టు హోమ్‌ స్క్రీన్‌’ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేస్తే హోమ్‌ స్క్రీన్‌ మీద ‘అసిస్టెంట్‌’ ఐకాన్‌ వచ్చి చేరుతుంది. దాన్ని ఓపెన్‌ చేసి అసిస్టెంట్‌ను వాడుకోవచ్చు. స్నేహితుడితో ఛాట్‌ చేసినట్లే దీంతోనూ మాటలు కలపొచ్చు. మెసేజ్‌ లేదా వాయిస్‌ రూపంలో సంభాషణలు జరపొచ్చు. వాయిస్‌ కోసమైతే మైక్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి. మెసేజ్‌ అయితే కీబోర్డు మీద టైప్‌ చేయాలి. గూగుల్‌ పిక్సల్‌ మొబైల్స్‌, గెలాక్సీ ఎస్‌ 7, ఎల్‌జీ జీ 6 మొబైల్స్‌లో అసిస్టెంట్‌ ఇన్‌బిల్ట్‌గా వస్తోంది. దీంతోపాటు గూగుల్‌ ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ ఆప్‌తో కూడా టెక్స్ట్‌, సౌండ్‌ రూపంలో సంభాషణలు కొనసాగించొచ్చు. దీన్ని ఓపెన్‌ చేసి ‘ఓకే గూగుల్‌’ అంటే మీ సేవకుడు సిద్ధమైపోతాడు. మీకు కావల్సిన విషయాన్ని మాటల్లో చెబితే ఆ పని చేసి పెడతాడు.
* మొబైల్‌లో యూట్యూబ్‌ ఓపెన్‌ చేయాలంటే... ఆప్‌ కోసం స్క్రోల్‌ చేసి క్లిక్‌ చేయక్కర్లేదు. మొబైల్‌ దగ్గరగా ‘ఓకే గూగుల్‌... ఓపెన్‌ యూట్యూబ్‌’ అంటే చాలు, ఆ ఆప్‌ ఓపెన్‌ అయిపోతుంది. ఈ ఆప్షన్‌ను గూగుల్‌ అనుబంధ ఆప్స్‌తోపాటు కొన్ని థర్డ్‌ పార్టీ ఆప్‌లకు కూడా వాడొచ్చు.
* కుటుంబంతో విహార యాత్రకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఏదైనా స్నాక్స్‌ తిందామనిపిస్తే దగ్గరలో రెస్టరెంట్లు, హోటళ్లు ఉన్నాయా అంటూ అక్కడ ఉన్న వారిని వాకబు చేస్తుంటారు. ఈ మాట గూగుల్‌ అసిస్టెంట్‌ను అడిగినా చెబుతుంది. దగ్గరలో ఉన్న రెస్టరెంట్ల వివరాలు, ప్రత్యేకతలు అన్నీ మీ మొబైల్‌ స్క్రీన్‌ మీద ప్రత్యక్షమవుతాయి. ఇవే కాదు షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లు, పార్కులు... ఇలా చాలా వాటికి వాడుకోవచ్చు.
* పర్సు, తాళం చెవి, మొబైల్‌ను ఎక్కడపడితే అక్కడ ఉంచి మరచిపోతుంటారా? లేదంటే ముఖ్యమైన లెటర్‌, ఫైళ్లను ర్యాక్‌లో దాచి మరచిపోతుంటారా? అలా ఉంచిన వస్తువు ఎక్కడ ఉందో అసిస్టెంట్‌ను అడిగితే చెబుతుంది. ఉదాహరణకు మీ వ్యాలెట్‌ను మీ డెస్క్‌లో పెట్టినప్పుడు Remember that I left my wallet on the desk అని అసిస్టెంట్‌లో రాయాలి. అప్పుడు తిరుగు సమాధానంగా Ok i will remeber that అని వస్తుంది. ఆ తర్వాత ఆ వస్తువు మీకు అవసరమైనప్పుడు Where is my wallet అని అసిస్టెంట్‌లో రాస్తే... గతంలో మీరు గుర్తుంచుకోమని రాసిన మెసేజ్‌ సమాధానం రూపంలో వస్తుంది. అలా ఏది ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
* స్నేహితులతో సరదాగా షికారుకు వెళ్లాలనుకున్నారు. అయితే ఎక్కడికి వెళ్లాలి, అక్కడ ఏమేం చూడాలి, ఎలా వెళ్లాలి లాంటి వివరాలు కావాలంటే గూగుల్‌లో వెతుక్కోవాల్సిందే. అయితే అసిస్టెంట్‌ను వాడుకుంటే ఈ వివరాలు సులభంగా, క్రమ పద్ధతిలో దొరుకుతాయి. వెకేషన్‌ ప్లేసెస్‌ అని టైప్‌ చేసి ఎంటర్‌ కొడితే చాలు... వివరాలు సిద్ధం.
* యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌, సన్‌నెక్స్ట్‌ లాంటి వాటిలో వీడియోలు చూడటానికి ఆ ఆప్‌ ఓపెన్‌ చేసి ఆ షో పేరు టైప్‌ చేయాలి. అదే అసిస్టెంట్‌లో మీకు కావల్సిన షో, ఆప్‌ పేరు ఎంటర్‌ చేస్తే.. ఆ ఆప్‌ ఓపెన్‌ అయ్యి, మీరు అడిగిన వీడియో వివరాలు కనిపిస్తాయి.
* స్నేహితుడు కలవగానే ‘ఏంటిరా వార్తలు’ అని అడుగుతుంటాం. అలా అసిస్టెంట్‌ను కూడా అడగొచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా అసిస్టెంట్‌ను ఓపెన్‌ చేసి ‘గుడ్‌ మార్నింగ్‌’ అని టైప్‌ చేస్తే సరి. వాతావరణ వివరాలు కావాలా, వార్తలు కావాలా? అంటూ అసిస్టెంట్‌ ఓ జాబితా ఇస్తాడు. అందులో మీకు కావల్సినదాన్ని క్లిక్‌ చేస్తే ఆ వార్తలు కనిపిస్తాయి. అలా రోజూ కావాలంటే వార్తల దిగువ ఉన్న ‘సెండ్‌ డైలీ’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాల్సిందే.
* మీ మూడ్‌కి తగ్గ పాటల్ని ఎంచుకొని ఓ ప్లే లిస్ట్‌ రూపొందించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కుదరడం లేదా? అయితే గూగుల్‌ అసిస్టెంట్‌కు ఈ పని చెప్పండి. ఠక్కున చేసేస్తుంది. మీరు చేయాల్సిందల్లా అసిస్టెంట్‌ ఓపెన్‌ చేసి ‘ప్లే మ్యూజిక్‌’ అనడమే. వెంటనే గూగుల్‌ మ్యూజిక్‌ ఆప్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో వివిధ సందర్భాలకు తగ్గట్టుగా ప్లేలిస్ట్‌లు ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. వాటిని క్లిక్‌ చేసి హాయిగా సంగీతాన్ని ఆస్వాదించొచ్చు.
* గూగుల్‌ అసిస్టెంట్‌ కేవలం చెప్పిన పనులు చేయడం, అడిగిన సమాచారం చెప్పడమే కాదు... ముఖ్యమైన తేదీలు, సమయాల్ని కూడా గుర్తు చేస్తుంది. దానికి ఒక్కసారి తేదీ, సమయం చెప్పారంటే ఇక మిగిలిన పని అది చేసుకుంటుంది. సరిగ్గా ఆ సమయానికి మీకు నోటిఫికేషన్‌ రూపంలో సమాచారం అందిస్తుంది. తేదీ, ప్రాంతం బట్టి ఈ నోటిఫికేషన్లను ఏర్పాటు చేసుకోవచ్చు.
* ‘రేపు ఉదయాన్నే ఆరు గంటలకల్లా నిద్ర లేపు’ అని ఇంట్లో చెబుతుంటారు. ఈ మాటను గూగుల్‌ అసిస్టెంట్‌కి చెబితే... ఆ సమయానికి అలారం మోగించి నిద్ర లేపుతుంది. అసిస్టెంట్‌ ఓపెన్‌ చేసి Wake me up at 6 am tomorrow అని మెసేజ్‌ పంపిస్తే ఆ సమయానికి మీ మొబైల్‌లో అలారం సెట్‌ అయిపోతుంది.
* ‘హయత్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌కి వెళ్లడానికి ఎంత టైమ్‌ పడుతుంది... దగ్గర దారి ఏదైనా ఉందా?’ ఇలాంటి ప్రశ్నలు మీరూ అడిగే ఉంటారు. లేదంటే గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేసి చూసుంటారు. అసిస్టెంట్‌లో ఈ ప్రశ్న అడిగితే మీకు మ్యాప్‌తోపాటు, కచ్చితమైన సమాచారం దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి.
* మీరు బండి డ్రైవ్‌ చేస్తున్నారు... ఆపడానికి అవకాశం లేదు. అర్జెంటుగా స్నేహితునికి మెసేజ్‌ పంపాలి. ఇదేం పెద్ద సమస్య కాదు. అసిస్టెంట్‌కి వివరాలు చెబితే... అది పంపించేస్తుంది. ‘ఓకే గూగుల్‌’ అన్నాక... సెండ్‌ ఏ మెసెజ్‌ టు సుమంత్‌ (ఫ్రెండ్‌ పేరు ఇది అనుకుంటే) అని చెప్పాలి. ఆ తర్వాత మెసేజ్‌ ఏంటో చెప్పి, సెండ్‌ అంటే సందేశం వెళ్లిపోతుంది.
* 18658x5820, 25748/457... ఇలాంటి లెక్కలు వేయాలంటే క్యాలిక్యులేటర్‌ తప్పనిసరి. ఈ పనిని అసిస్టెంట్‌తో కూడా చేయొచ్చు. అసిస్టెంట్‌ను ఓపెన్‌ చేసి టెక్స్ట్‌ బాక్స్‌లో ఆ లెక్కను టైప్‌ చేస్తే సమాధానం దాని పక్కన వెంటనే వచ్చేస్తుంది.
* టైమ్‌ పాస్‌ కోసం చిన్న చిన్న క్విజ్‌లు, సరదా ఆటలు ఆడుతుంటారా? దీని కోసం రకరకాల ఆప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోనక్కర్లేదు. అసిస్టెంట్‌లో ఇలాంటి ఆటలు చాలా ఉన్నాయి. అసిస్టెంట్‌లో ‘గేమ్స్‌’ అని టైప్‌ చేస్తే... కొన్ని గేమ్స్‌ వస్తాయి.
* ఇంగ్లిష్‌ టు హిందీ, ఇంగ్లిష్‌ టు తెలుగు... ఇలాంటి నిఘంటువుల అవసరం మీకు ఎక్కువగా ఉంటుందా? అయితే అసిస్టెంట్‌ను మీరు నిఘంటువులా వాడుకోవచ్చు. ఇందులో మీకు అర్థం తెలియాల్సిన ఆంగ్ల పదం ఇచ్చి, దాన్ని హిందీలో ఏమంటారు అని అడిగితే అర్థం వచ్చేస్తుంది.
* పక్కనే మొబైల్‌ ఉంది... కానీ అన్‌లాక్‌ చేయడానికి చేతులు ఖాళీగా లేవు. అయితేనేం... దానికి వినిపించేలా ‘ఓకే గూగుల్‌’ అంటే వెంటనే అన్‌లాక్‌ అయిపోతుంది. అయితే పిన్‌, ప్యాట్రన్‌ లాక్‌ ఉంటే ఈ ఆప్షన్‌ పని చేయదు.



//view.joomag.com/mohan-publications-2018-pidaparti-vari-telugu-panchanga-calender/0422979001505386729


<iframe name="joomag-embed-75ecb05e-ca55-4cd9-acd9-f4e98c283c52" style="width:900px;height:636px;" width="900" height="636" hspace="0" vspace="0" frameborder="0" src="//view.joomag.com/mohan-publications-2018-pidaparti-vari-telugu-panchanga-calender/0422979001505386729?e=1&amp;page=1&amp;embedInfo=;"></iframe> <div class="joomag-backlinks"><a href="//view.joomag.com/mohan-publications-2018-pidaparti-vari-telugu-panchanga-calender/0422979001505386729" target="_blank">Open publication</a> - Free <a href="https://www.joomag.com/?ref=embed_backlink" target="_blank" >publishing</a></div> 

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list