అనారోగ్య సమస్యలు పీడిస్తుంటే...
ఆహార విహారాల్లో నియమబద్ధంగా ఉంటున్నప్పటికీ, అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటున్నప్పటికీ కొందరు తరచుగా ఆరోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. తరచు ఆరోగ్య సమస్యలు పీడిస్తుండటంతో మనశ్శాంతి కోల్పోతారు. అలాంటి ఇబ్బందులను అధిగమించడానికి కొన్ని పరిహారాలు...
► ప్రతి శనివారం కుక్కలకు, కాకులకు తీపి రొట్టెలు పెట్టాలి. వాటికి పెట్టే రొట్టెల సంఖ్య మీ కుటుంబ సభ్యుల సంఖ్య కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి
► ఇంట్లో ఎవరైనా అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లయితే, ఏదైనా ఒక గురువారం ఉదయం పూట ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ఒక తీపి గుమ్మడి కాయను సమర్పించండి
► ఆంజనేయుడి ఆలయంలో ఆవనూనెతో అఖండ జ్యోతిని వెలిగించండి. ఈ పరిహారాన్ని వరుసగా ఐదు మంగళవారాలు పాటించాల్సి ఉంటుంది. ఆలయానికి వెళ్లడానికి అవకాశం లేకుంటే, ఇంట్లోనే పూజ మందిరంలో ఆంజనేయుడి పటాన్ని ఉంచి కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు
► స్నానం తర్వాత పూజకు ఉపక్రమించే ముందు తుంగముస్తికలను అరగదీసి, అందులో కాస్త గోరోచనాన్ని కలిపి తిలకంలా ధరించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. దీర్ఘవ్యాధులతో బాధపడే పేద వృద్ధులకు ఔషధ దానం చేయండి
► రాత్రి నిద్రించేటప్పుడు ఒక రాగిచెంబులో నీళ్లు నింపి తల వద్ద ఉంచుకోండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయండి.
– పన్యాల జగన్నాథ దాసు
టాగ్లు: Health problems, remedies, ఆరోగ్య సమస్యలు, పరిహారాలు
nice
ReplyDelete