MohanPublications Print Books Online store clik Here Devullu.com

ప్రదక్షిణలతో పరివర్తన-Pradakshanalu

ప్రదక్షిణలతో పరివర్తన
ప్రదక్షిణము అనే పదము మన ఆధ్యాత్మిక వారసత్వ సంపదతో ముడివడి వుంది. ప్రదక్షిణము అంటే పరిభ్రమణము. అసలు ప్రదక్షిణ ఎందుకు చేయాలి ఎలా చేయాలి ప్రదక్షిణ అంటే కుడినుండి ఎడమకు తిరుగుట. మరి అప్రదిక్షణ అంటే ఎడమనుండి కుడికి తిరుగుట. అప్రదక్షిణ ఎందుకు చేస్తారు. ఏఏ సందర్భాల్లో చేస్తారు అంటే ఎక్కువగా పితృసంబంధిత కార్యములపుడు చేస్తారు. భగవంతునికి నేను వంద ప్రదక్షిణలు చేసాను, మండలం రోజులు చేసాను అంటారు. ఇది నిజమేనా అంటే పాక్షికంగా మాత్రమే నిజం. ఎందుకంటే మనకు అంటే మానవ జాతికి సంపూర్ణంగా ఒక ప్రదక్షిణ చేయడం కూడా వల్లకాదు. ఎందుకంటే భగవంతుడు ఈ సర్వభువనములయందు నిండివున్నాడు. ఆత్మలయందు అనాత్మలయందు పరమాత్మ వున్నాడు. ఇంతటి ప్రదక్షిణ చేయడం కుమారస్వామి వారికి మాత్రమే చెల్లింది. కాని భగవంతుడు సర్వాంతర్యామి కనుక చెట్టుకు గానీ పుట్టకు గానీ గుట్టకు కానీ ఆలయమునందు కాని ఎచట ప్రదక్షిణ చేసినా ఫలితం వుండకపోదు. ఆశించిన ప్రయోజనం ఒనగూరుతుంది. ఏదీ వీలుకానప్పుడు మనలో సైతం దేవుడు వున్నాడు కనుక మన చుట్టు మనం తిరిగితే అది ఆత్మప్రదక్షిణం.
మనస్పూర్తిగా వారికి మనం ఏది సమర్పించినా ఆ భగవానునికి సమర్పించినట్టే. ఏ రాశులు, ఏ దోషములు తల్లిదండ్రికి ప్రదక్షిణ చేసేవారికి వర్తించవు. ఇప్పటివరకు చేయని వారు ఇప్పటినుంచి ప్రారంభించినా వారికి మంచికాలం ఆరంభం అయినట్టే. ఆవిధంగా గణేశుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి ఎంతో గౌరవం పొందాడు.
ఇక దక్షిణమున ఎంతో ప్రసిద్ధి పొందిన అరుణగిరికి ప్రదక్షిణము చే సినట్టయితే ఎంతటి వారైనా పాపములు చేయగూడదు అనే చింతనకు వచ్చి అహంకారం దూరమై సాధుసత్వ గుణములతో జీవనం గడిపెదరు. అశ్వద్థ వృక్షం చుట్టు నలభై రోజులపాటు ప్రదక్షిణ చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని సద్గురు నృసింహ సరస్వతి తన అనసూయాయికిచెప్పారు. ఆమె గురువుగారు చెప్పిన విధంగా ఆచరించి సత్ఫలితములు పొందింది.
-ఏ వ్యక్తి అయినా తమ శక్తానుసారం తులసికోటకు ప్రదక్షిణ చేస్తే ఆ ఇల్లు వైకుంఠ సమానమే. విష్ణువు అచటనే నివశిస్తాడు.
- వేదగిరి రామకృష్ణ

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list