కులం ప్రధానం కాదు
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలుగా, అనాది నుండీ కులవ్యవస్థ నిర్ణయించబడినది. ప్రతీ కులం వారికీ ఒక నిబద్ధత, నీతిసూత్రాలు ఉన్నాయి. ఏ కులజులైనా, వారి వారి నడవడికలను బట్టి గొప్పవారిగా, యుగయుగాలలో మహనీయులైనారు. ఎవరూ ఎవరికీ తీసిపోని విధంగా నాటి నుంచీ ఈనాటి వరకూ వివిధ కులస్థుల ప్రాతినిధ్యం వహించి మానవలోకంలో మనుగడ సాగిస్తూ ఉన్నారు. పురాణ పురుషుల విషయానికి వస్తే త్రేతాయుగంలో శ్రీరాముడు క్షత్రియుడై రాజధర్మాన్ని ధరపై నిలిపి, భోగభాగ్యాలకు అతీతుడై తండ్రి మాటను, ప్రజావాక్కుని శిరసావహించి, ఏకపత్నీ వత్రుడై సోదరప్రేమని లోకానికి చాటి, రాజ్యం అంటే రామరాజ్యంలా ఉండాలనే పాలన గావించాడు. ద్వాపరంలోక్రిష్ణుడు యాదవ్ఞడై మహిమాన్వితుడుగా తనలీలలతో దుష్టశిక్షణ శిష్ణ రక్షణ గావించి, భగవద్గీతను బోధించాడు.
బోయకులంలో పుట్టిన ఏకలవ్ఞ్యడు, ద్రోణుడు అడిగినచో బొటకన వ్రేలును కోసి ఇచ్చి గురుభక్తికి ప్రతీకగా, ఏకలవ్వ శిష్యుడిగా పేరు పొందాడు. భగవంతుడు భక్తులకు దాసుడే అనడానికి నిదర్శనంగా, భక్తికన్నప్ప మాంసాహారాన్ని, శివ్ఞడు నైవేద్యంగా స్వీకరిస్తే, శబరి పెట్టిన ఎంగిలిపండ్లను ప్రీతితో ఆరగించి, శ్రీరాముడు ఆమెకు ముక్తిని ప్రసాదించాడు.
ఇక బోయకులంలో జన్మించి, అడవ్ఞలలో కిరాతకంగా బాటసారులను వధించి ఆ సొమ్ముతో కుటుంబాన్ని పోషించి, వారు తన పాపాన్ని పంచుకోరని తెలుసుకుని, నారదుడు బోధించిన ‘మరా అనే పదాన్నే రామ నామధ్యానంగా తలపోసి, మహనీయుడైన బుషిగా, వాల్మీకి రామాయణ కర్తగా కావడం, కులప్రసక్తి లేని భక్తిభావానికి ఆదర్శపురుషుడిగా నిలవడానికి నిదర్శనం.
అలాగే అమాయకుడైన పడవ నడిపే గుహుడు, రాముడి పాదం సోకితే తన పడవ అహల్య లాగా రాయి అవ్ఞతుందని భయపడుతూ, రాముడిని తీరం దాటించడం, రాముడికి సాయపడటం రామయణ కావ్యానికే ఒక అద్భుతఘట్టం. మహాసాధ్వి సీత, రామునిచే పరిత్యజించబడి వాల్మీకి ఆశ్రమం చేరి అక్కడ లవకుశులకు జన్మనిచ్చి, వాల్మీకి రక్షణలో, అరణ్యవాసం చేసి తల్లి భూమాతను చేరడం వాల్మీకి రామయణానికీ పరాకాష్ఠ. భగవంతుడికీ లేని కుల మత భేదాలు మనుషులకు ఉండకూడదు.
మానవత్వమే కులంగా, దయాదాక్షిణ్యాలతో, దానధర్మాలతో, నీతితో జీవించేవారు ఎప్పుడూ అగ్రకులస్తులవ్ఞతారు. మంచి పనులు చేయడానికి కులం అడ్డుగోడ కాదు. అధికారాలకు, పదవ్ఞలకు ఏ కులస్తులయినా అర్హులే. అందుకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే సాక్షి. తెలివితేటలు ఒకరిసొత్తు కాదు. తామే అధికులని భావించేవారు ఏ కులం వారైనా అల్పులే. ఐకమత్యంతో రాణించే కులవ్యవస్థ కలకాలం ప్రాచుర్యం పొందుతుంది. ఈర్ష్యాద్వేషాలతో రగిలే వారు ఎప్పటికీ విజయం సాధించలేరు. సాటి మనుషులను ప్రేమించారు. సహాయ సహకారాలతో మనుషులు మసలుకుంటే అన్ని కులాల వారు, సుఖసౌభాగ్యాలతో ఆనందంగా, కాలం గడుపుకోవచ్చు. గుణహీనంగా బ్రతుకరాదు.
– యం.వి.రమణకుమారి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565