అలసటతీరి... హాయిగా!
ఆఫీస్‌లో గంటలు గంటలు కూర్చుని పనిచేశాక శరీరం అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. ఇంటికెళ్లిన తర్వాత మరే పని చేయబుద్ధి కాదు. ముఖ్యంగా చాలామందిలో నడుం కింది భాగం పట్టేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా కేవలం ఓ పదిహేను నిమిషాల పాటూ ఈ వ్యాయామాలు చేస్తే చాలు.. ఉపశమనం లభిస్తుంది. ఇంటికెళ్లిన తర్వాత కూడా చురుగ్గా ఉండగలుగుతాం..
వెల్లకిలా పడుకుని గాలిని లోపలికి పీల్చుకుంటూ రెండు కాళ్లను మడిచి అరిపాదాలను రెండింటినీ కుర్చీ అంచులకు ఆనించాలి. ఇప్పుడు కాళ్లను నెమ్మదిగా పైకి లేపుతూ పొట్ట దగ్గరగా తీసుకురావాలి. రెండు చేతులతో మోకాళ్ల చుట్టూ బంధించి ఉంచాలి. చిత్రంలో చూపినవిధంగా అరనిమిషం ఉండాలి. ఇలా చేయడం వల్ల నడుము కిందిభాగానికి రక్తప్రసరణ పెరిగి.. ఒత్తిడి తగ్గుతుంది.
వెల్లకిలా పడుకుని కాళ్లను నిటారుగా చాపాలి. ఇప్పుడు ఎడమ కాలిని నెమ్మదిగా పైకి లేపుతూ కుడికాలి తొడపై నుంచి తీసుకురావాలి. అరనిమిషం పాటూ ఉన్న తర్వాత మళ్లీ కుడికాలితో ఇలా ప్రయత్నించాలి. ఇలా కాళ్లు మార్చి మార్చి.. నాలుగైదుసార్లు చేయాలి. శరీరం తేలికపడి అన్ని పనులు చురుగ్గా చేయగలుగుతాం.
ఈ వ్యాయామాల కోసం ఓ కుర్చీని దగ్గర పెట్టుకోవాలి. వెల్లకిలా పడుకుని ఎడమ కాలిని కుర్చీకి ఆన్చి కుడి కాలిని ఫొటోలో చూపిన విధంగా ఎడమ మోకాలిపై ఉంచాలి. రెండు చేతులతో ఎడమకాలి తొడను పట్టుకోవాలి. ఇదేవిధంగా కుడికాలితోనూ చేయాలి. నడుం కింది భాగాలకు రక్త ప్రసరణ బాగా జరిగి పట్టేసిన కండరాలు విశ్రాంతి పొందుతాయి.
డాక్టర్ మణిపవిత్ర
యోగా నిపుణురాలు
* 7702491110
very nice
ReplyDelete