గురు స్వరూపం.. హయగ్రీవుడు!
భగవంతుడే అందరికీ ఆది గురువు. ఒక్కో దేవతకూ ఒక్కో గురు స్వరూపం ఉంది. పరమేశ్వరుడిని గురువుగా భావిస్తే దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తాడు. అమ్మవారిని గురువుగా కొలిస్తే శారదగా జ్ఞానం ప్రసాదిస్తుంది. విష్ణుమూర్తిని గురువుగా పూజిస్తే.. హయగ్రీవుడుగా కరుణిస్తాడు. నారాయణుడు ధరించిన అనేక అవతారాల్లో.. గురు స్వరూపం హయగ్రీవుడు. గుర్రం ముఖం, నర శరీరంతో ఉంటాడు. ఆయన అవతరించిన శ్రావణ శుద్ధ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు.
హయగ్రీవుడి ఉత్పత్తి గురించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. సృష్టి ఆదిలో మహా విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు, ఆయన నుంచి దేవతలు ఉద్భవించారు. దేవతలంతా తమ కర్తవ్యం ఏమిటని బ్రహ్మను అడిగారట. అదే విషయాన్ని బ్రహ్మదేవుడు.. విష్ణుమూర్తిని అడిగాడట. అప్పుడు మహావిష్ణువు యజ్ఞం చేయాలని వారికి సూచించాడట. అయితే యజ్ఞం ఆచరించడానికి తగిన జ్ఞానం ప్రసాదించమని కోరాడట బ్రహ్మ. అప్పుడు నారాయణుడు హయగ్రీవ రూపంలో ప్రకటితమై.. ‘‘ప్రపంచాన్ని సృష్టించి, నడపగలిగే జ్ఞానం, యజ్ఞ విజ్ఞానాన్ని ఇస్తున్నాన’’ని వేదాలను బ్రహ్మ దేవుడికి అనుగ్రహించాడట. ఈ వేదాలను మధుకైటభులు అనే రాక్షసులు అపహరించగా.. హయగ్రీవుడు వాటిని సంరంక్షించి మళ్లీ బ్రహ్మకు అందజేశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. హయగ్రీవుడి రూపం విచిత్రంగా ఉంటుంది. గుర్రం ముఖం చైతన్యానికి ప్రతీక. గుర్రం సకలింపు నుంచి బీజాక్షరాలు ఉద్భవించాయని అంటారు. శుద్ధ స్పటిక రూపం ఆయనది. నిర్మలత్వానికి చిహ్నం ఇది. రెండు చేతుల్లో శంఖ, చక్రాలు ధరించి ఉంటాడు. మరో చేతిలో పుస్తకం ఉంటుంది. ఇంకో చేతిని చిన్ముద్రతో చూపుతూ భక్తులను అనుగ్రహిస్తుంటాడీ దేవుడు. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు హయగ్రీవుడు. ఆయన్ను గురువుగా భావించి ఉపాసిస్తే.. సద్బుద్ధి కలుగుతుంది. సత్వ గుణం వికసిస్తుంది. విద్యాప్రాప్తి కలుగుతుంది. సకల దేవతా మంత్రాలు ఆధీనంలోకి వస్తాయని
చెబుతారు.
శ్రావణ పూర్ణిమ - హయగ్రీవ జయంతి
జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||
వ్యాఖ్యా ముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే
బిభ్రద్భిన్నస్పటికరుచిరే పుండరీకే నిషణ్ణః |
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం
ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః ||
శ్రావణ పూర్ణిమ అంటే రక్ష కట్టుకోవడం ఒకటే అనే స్థితిలోకి వచ్చాం ఈ నాడు, కానీ ఈ రోజు ప్రాధాన్యత మరచిపోయాం. రక్ష కట్టుకోవడం అనేది దేశ రక్షణ కోసం అని, సోదరీలు సోదరులకు రక్ష కట్టినట్లయితే వారు రక్షణ కలిపిస్తారని కొన్ని ఈ మధ్యకాలంలోని పురుషోత్తముడు అలెగ్జాండర్ కథ చెబుతారు. శ్రావణ పూర్ణిమ అంటే అంతవరకే చెబుతారు.కానీ అంతవరకే ఈ శ్రావణ పూర్ణిమ ప్రాధాన్యత కాదు. అది లక్ష్మీమయమైన మాసంలో వచ్చినది కనుక సంపదలు ఇచ్చే శక్తి ఉంది. దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని విద్యాప్రదమైన అవతారం హయగ్రీవ అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం.
మనిషికి ప్రధానమైనది జ్ఞానం, జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు, శాస్త్రాలకు మూలం వేదం. ఆవేదాన్ని లోకానికి అందించిన అవతారం హయగ్రీవ అవతారం. విద్య చదువుకున్న వారికందరికి కంకణం కడుతారు, వారు రక్షకులు అవుతారు అని. జ్ఞానికి రక్షగా ఉంటారని. ఆ జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికి రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షబంధనం అయ్యింది. వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు. ఆతరువాత వేద అంగములైన శిక్షా, వ్యాకరణం, నిరుక్తం, కల్పకం, చందస్సు మరియూ జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు. విద్యారక్షకుడైన భగవంతుడిని ఉపాసన చేసుకొని మొదలు పెడుతారు. వేదాన్ని కొత్తగా నేర్చే వారే కాక, వేదాన్ని నేర్చినవారు తిరిగి ఇదే రోజునుండి మరచిపోకుండా నవీకరణం చేసుకుంటూ అధ్యయణం మొదలు పెడుతారు. హయగ్రీవుడిగా అవతరించి లోకాన్ని ఉద్దరించిన రోజు.
బ్రహ్మ కాంచీపురంలోని వరదరాజ స్వామి సన్నిదానంలో చేసిన హోమం నుండి శ్రావణ పూర్ణిమనాడు భగంతుడు గుఱ్ఱపుమెడ కలిగిన ఆకృతిలో వచ్చి గుఱ్ఱం యొక్క సకిలింత ద్వని మాదిరిగా వేదాన్ని వేదరాశిని ఉపదేశం చేసాడు. అందుకే హయగ్రీవ స్వామి శతనామావళితో ఆరాధన చేయాలి. హయగ్రీవ అనే రాక్షసుడిని సంహరించడానికి భగవంతుడు గుఱ్ఱపు ఆకారంలో అవతరించాడు అంటూ ప్రమాణికం కాని కథలను చెబుతారు. కానీ అట్లాటి ప్రస్తావన వేదవ్యాసుడు అందించిన ఏపురాణాలలో లేదు. శ్రీమద్భాగవతంలో శ్రీసుఖమహర్షి పరిక్షిత్తు మహారాజుకి చేసే ఉపదేశంలో హయగ్రీవ అవతారం కూడా భగవంతుడు వేదోద్దరణ కోసం ఎత్తిన అవతారం అనేది తెలుస్తుంది. వేద వ్యాసుడు చిట్ట చివరగా పురాణాల సారముగా అందించినదే శ్రీమద్భాగవతం. ఆ తరువాత ఆయన ఎట్లాంటి పురాణాలను అందించలేదు.
శ్రీహయగ్రీవ అష్టోత్తర శతనామావళిః
001 ఓం హయగ్రీవాయ నమః
002 ఓం మహావిష్ణవే నమః
003 ఓం కేశవాయ నమః
004 ఓం మధుసూదనాయ నమః
005 ఓం గోవిందాయ నమః
006 ఓం పుండరీకాక్షాయ నమః
007 ఓం విష్ణవే నమః
008 ఓం విశ్వంభరాయ నమః
009 ఓం హరయే నమః
010 ఓం ఆదిత్యాయ నమః
011 ఓం సర్వవాగీశాయ నమః
012 ఓం సర్వాధారాయ నమః
013 ఓం సనాతనాయ నమః
014 ఓం నిరాధారాయ నమః
015 ఓం నిరాకారాయ నమః
016 ఓం నిరీశాయ నమః
017 ఓం నిరుపద్రవాయ నమః
018 ఓం నిరంజనాయ నమః
019 ఓం నిష్కలంకాయ నమః
020 ఓం నిత్యతృప్తాయ నమః
021 ఓం నిరామయాయ నమః
022 ఓం చిదానందమయాయ నమః
023 ఓం సాక్షిణే నమః
024 ఓం శరణ్యాయ నమః
025 ఓం సర్వదాయకాయ నమః
026 ఓం శ్రీమతే నమః
027 ఓం లోకత్రయాధీశాయ నమః
028 ఓం శివాయ నమః
029 ఓం సారస్వతప్రదాయ నమః
030 ఓం వేదోద్ధర్త్రే నమః
031 ఓం వేదనిధయే నమః
032 ఓం వేదవేద్యాయ నమః
033 ఓం ప్రభూత్తమాయ నమః
034 ఓం పూర్ణాయ నమః
035 ఓం పూరయిత్రే నమః
036 ఓం పుణ్యాయ నమః
037 ఓం పుణ్యకీర్తయే నమః
038 ఓం పరాత్పరాయ నమః
039 ఓం పరమాత్మనే నమః
040 ఓం పరంజ్యోతిషే నమః
041 ఓం పరేశాయ నమః
042 ఓం పరగాయ నమః
043 ఓం పరాయ నమః
044 ఓం సర్వవేదాత్మకాయ నమః
045 ఓం విదుషే నమః
046 ఓం వేదవేదాంతపరగాయ నమః
047 ఓం సకలోపనిష్ద్వేద్యాయ నమః
048 ఓం నిష్కలాయ నమః
049 ఓం సర్వశాస్త్రకృతే నమః
050 ఓం అక్షమాలాజ్ఞానముద్రాయుక్తహస్తాయ నమః
051 ఓం వరప్రదాయ నమః
052 ఓం పురాణాయ నమః
053 ఓం పురుషశ్రేష్ఠాయ నమః
054 ఓం శరణ్యాయ నమః
055 ఓం పరమేద్వరాయ నమః
056 ఓం శాంతాయ నమః
057 ఓం దాంతాయ నమః
058 ఓం జితక్రోధాయ నమః
059 ఓం జితామిత్రాయ నమః
060 ఓం జగన్మయాయ నమః
061 ఓం జన్మమృత్యుహరాయ నమః
062 ఓం జీవాయ నమః
063 ఓం జయదాయ నమః
064 ఓం జాడ్యనాశనాయ నమః
065 ఓం జనప్రియాయ నమః
066 ఓం జపస్తుత్యాయ నమః
067 ఓం జాపకప్రియకృతే నమః
068 ఓం ప్రభవే నమః
069 ఓం విమలాయ నమః
070 ఓం విశ్వరూపాయ నమః
071 ఓం విశ్వగోప్త్రే నమః
072 ఓం విధిస్తుతాయ నమః
073 ఓం విధీంద్రశివసంస్తుత్యాయ నమః
074 ఓం శాంతిదాయ నమః
075 ఓం క్షాంతిపారగాయ నమః
076 ఓం శేయఃప్రదాయ నమః
077 ఓం శ్రుతిమయాయ నమః
078 ఓం శ్రేయసాంపతయే నమః
079 ఓం ఈశ్వరాయ నమః
080 ఓం అచ్యుతాయ నమః
081 ఓం అనంతరూపాయ నమః
082 ఓం ప్రాణదాయ నమః
083 ఓం పృథివీపతయే నమః
084 ఓం అవ్యక్తాయ నమః
085 ఓం వ్యక్తరూపాయ నమః
086 ఓం సర్వసాక్షిణే నమః
087 ఓం తమోహరాయ నమః
088 ఓం అజ్ఞాననాశకాయ నమః
089 ఓం జ్ఞానినే నమః
090 ఓం పూర్ణచంద్రసమప్రభాయ నమః
091 ఓం జ్ఞానదాయ నమః
092 ఓం వాక్పతయే నమః
093 ఓం యోగినే నమః
094 ఓం యోగీశాయ నమః
095 ఓం సర్వకామదాయ నమః
096 ఓం మహాయోగినే నమః
097 ఓం మహామౌనినే నమః
098 ఓం మౌనీశాయ నమః
099 ఓం శ్రేయసాంపతయే నమః
100 ఓం హంసాయ నమః
101 ఓం పరమహంసాయ నమః
102 ఓం విశ్వగోప్త్రే నమః
103 ఓం విరాజే నమః
104 ఓం స్వరాజే నమః
105 ఓం శుద్ధస్ఫటికసంకాశాయ నమః
106 ఓం జటామండలసంయుతాయ నమః
107 ఓం ఆదిమధ్యాంతయహితాయ నమః
108 ఓం సర్వవాగీశవరేశ్వరాయ నమః
హయగ్రీవ జయంతి విశిష్టత
శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. భారతీయులంతా ఆ రోజు రాఖీని ఘనంగా జరుపుకొంటారు. కానీ రాఖీ రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే హయగ్రీవ జయంతి. ఆ హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో, ఆ రోజున ఏం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందామా!
హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి... వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికీ, వివేకానికీ చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడు జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం. ఆయనకు ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ గాథ వినిపిస్తుంది. పూర్వం గుర్రపుతల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే, తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉంది. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి, హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు చెబుతారు. అంటే హయగ్రీవుడు శత్రునాశకుడు కూడా అన్నమాట! ఆ హయగ్రీవుని ఆరాధించడం వల్ల అటు జ్ఞానమూ ఇటు విజయమూ రెండూ లభిస్తాయన్నది పెద్దల మాట.
హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్యచంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా... ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా!
హయగ్రీవుని ఆరాధన ఇంత విశిష్టమైనది కనుకే కొందరు ప్రత్యేకించి హయగ్రీవుని ఉపాసిస్తారు. అత్యంత నిష్టతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి... కనీసం హయగ్రీవ జయంతి రోజున అయినా ఆయనను ఆరాధించాలి. హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజగదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కానీ, హయగ్రీవ అష్టోత్తర శతనామావళిని కానీ పఠించాలి. ఏదీ కుదరకపోతే కనీసం-
జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్|
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||
... అనే మంత్రాన్ని పఠించాలి. హయగ్రీవునికి తెలుపురంగు పూలు, యాలుకలతో చేసిన మాల, గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవే కాబ్టటి, వాటిని ఆయనకు అర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి.
ఇంతకుముందు చెప్పుకొన్నట్లుగా హయగ్రీవుడు జ్ఞానప్రదాత. అందుకనే చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి, ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు. ఈ రోజు ఆయనను ఆరాధించినవారికి సకల విద్యలూ అబ్బుతాయనీ, అన్ని ఆటంకాలూ తొలగిపోతాయనీ చెబుతారు. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి, ఆయన ఆరాధన వల్ల సిరిసంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది. మరెందుకాలస్యం! ఈ హయగ్రీవ జయంతి రోజున ఆయనను ఆరాధించి మీ మనోభీష్టాలన్నింటినీ నెరవేర్చుకోండి.
#Sri_Hayagriva_jayanti
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565