MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఒత్తిడా.... ముద్ర వేద్దాం!-Mudra Veddam


ఒత్తిడా.... ముద్ర వేద్దాం! 
ఒక్కోసారి పెద్దగా కారణం కూడా ఉండదు. కానీ ఆందోళనగా, గుండె దడగా ఉంటుంది. దీన్నే ఆంగ్లంలో ఫ్లయింగ్‌ బటర్‌ఫ్లైస్‌ ఇన్‌ స్టమక్‌ అంటారు. ‘టెన్షన్‌గా ఉంది’ అంటామే అలాంటి పరిస్థితి. పనిలో ఒత్తిడి పెరగడం, భయం వంటివి దీనికి కారణం. ఆ కంగారూ, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ముద్రలూ, ఆసనాలు ఉపయోగపడతాయి.
గోముఖాసనం: ముందుగా వజ్రాసనంలో కూర్చుని... ఎడమకాలిని వెనక్కి మడిచి ఉంచాలి. దానిపై కుడికాలిని ఉంచాలి. కాళ్లు రెండు ఒకదానిపై ఒకటి ఉండి... ముందుకు వస్తాయి. ఇప్పుడు ఒక చేతిని భుజం పైనుంచి రానిచ్చి రెండో చేతిని వీపు వెనుకగా తెచ్చి రెండింటినీ పట్టుకోవాలి. దీనివల్ల ఛాతీ విశాలంగా అయి.. శ్వాస అందుతుంది. ఒత్తిడీ, కంగారు తగ్గడమే కాదు.. వ్యతిరేక ఆలోచనలు ఉన్నా పోతాయి. 
ముష్టిముద్ర: వజ్రాసనం లేదా సుఖాసనంలో కూర్చోవాలి. తరవాత బొటనవేలిని ఉంగరం వేలుమీదుగా రానిచ్చి పిడికిలిని బిగించాలి. అలా చేయడం వల్ల కోపం, ఆవేశం, ఆందోళన, చిరాకు వంటి సమస్యలు ఉంటే తగ్గుతాయి. రోజూ రెండు నుంచి మూడు నిమిషాల వరకూ ఈ ముద్రలో కూర్చోవచ్చు.
క్షేపన ముద్ర: సుఖాసనం లేదా వజ్రాసనంలో కూర్చుని.. రెండు అరచేతులూ దగ్గరగా ఉంచి... చూపుడువేళ్లు మాత్రం పైకి ఉంచి తక్కిన వేళ్లను చిత్రంలో చూపించినట్టుగా ఒకదానితోఒకటి మడవాలి. బొటనవేళ్లని ఒకదానిపై ఒకటి క్రాస్‌గా ఉంచాలి. ఇలాగే ఉండి... ఏడు నుంచి పదిహేను సార్లు శ్వాస తీసుకుని వదలాలి.
కాళేశ్వర ముద్ర: ఒక్కసారిగా రకరకాల ఆలోచనలు మనల్ని చుట్టుముట్టకుండా మనసుని ప్రశాంతంగా ఉంచే ముద్ర ఇది. వజ్రాసనం లేదా సుఖాసనంలో కూర్చుని చిత్రంలో చూపించినట్టుగా రెండు చేతుల వేళ్లూ కిందకు ఉంచాలి. బొటనవేళ్లూ, మధ్యవేళ్లూ ఒకదానితో ఒకటి తాకించి తక్కిన వేళ్లు పైకి మడిచి ఉంచాలి. చేతులని ఛాతీకి దగ్గరగా కాకుండా కాస్త దూరంగా ఉంచాలి. ఇప్పుడు ఇలా చేస్తే శరీరంలోని ఒత్తిడి తొలగిపోతుంది.
డాక్టర్‌ మణిపవిత్ర 
యోగా నిపుణురాలు, * 7702491110

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list