MohanPublications Print Books Online store clik Here Devullu.com

గోపాల గోవిందుడు-Gopala Govindhudu


గోపాల గోవిందుడు
మధురమైన స్నేహమంత ప్రీతి... అటుకులంటే ఆయనకు. ‘వెన్న దొంగ’ అని పిలిచినా ఫర్వాలేదనేంత ఇష్టం వెన్న ముద్దలంటే. ఇన్ని అటుకులు, అంత బెల్లం ముక్క, మరికాస్త వెన్నముద్ద పెడితే చాలు చిలిపి కన్నయ్య ఇట్టే ప్రసన్నం అయిపోతాడు. రెండు రోజుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ. అటుకులు, వెన్న, బెల్లం, పచ్చి శెనగపప్పులతో కన్నయ్యకు రకరకాల వంటకాల నివేదన..
శెనగపప్పు పాయసం
కావలసినవి: పచ్చి శెనగపప్పు, పాలు - ఒక్కోటి ముప్పావు కప్పు చొప్పున, బెల్లం పొడి - ఒక కప్పు, ఎండుకొబ్బరి ముక్కలు - ఒక టేబుల్‌ స్పూన్‌, యాలకుల రెబ్బలు - నాలుగు (పొడి చేసి), జీడిపప్పులు, ఎండుద్రాక్షలు - అవసరమైనన్ని, నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు.
తయారీ:
పాన్‌లో ఒక టీస్పూన్‌ నూనె వేడి చేసి శెనగ పప్పుని మూడు నిమిషాలు వేగించాలి.
తరువాత వేగించిన పప్పులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి ప్రెషర్‌ కుక్కర్‌లో పెట్టి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. స్టీమ్‌ వచ్చాక పప్పుని మరీ మెత్తగా కాకుండా మెదపాలి.
ఒక గిన్నెలో బెల్లం వేసి, పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు వేడిచేయాలి.
పప్పు, యాలకుల పొడి వేసి ఐదు నిమిషాలు లేదా మిశ్రమం చిక్కబడేవరకు ఉంచాలి.
తరువాత స్టవ్‌ ఆపేసి పాలు పోసి బాగా కలపాలి.
మిగిలిన నెయ్యిని వేడిచేసి అందులో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. దీన్ని పాయసం మీద పోసి కలపాలి.
అటుకుల దద్ధ్యోదనం
కావలసినవి:
మందపాటి అటుకులు - ఒక కప్పు, పెరుగు - ఒకటిన్నర కప్పులు, మరిగించి, చల్లార్చిన పాలు - పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరిగి), అల్లం తరుగు - ఒకటిన్నర టీస్పూన్లు, పచ్చిశెనగపప్పు, ఆవాలు - ముప్పావు టీస్పూన్‌, మినపప్పు - పావు టీస్పూన్‌, కరివేపాకులు - కొన్ని, ఇంగువ - చిటికెడు, నూనె - ఒక టేబుల్‌ స్పూన్‌, ఎండుమిర్చి - రెండు, ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ:
అటుకులు మెత్తబడే వరకు నీళ్లతోకడగాలి. తరువాత నీళ్లు వంపేసి కొన్ని నిమిషాలు పక్కన పెట్టాలి.
ఒక గిన్నెలో అటుకులు, పాలు, పెరుగు, ఉప్పు వేసి కలపాలి. కావాలంటే మరికొంచెం పెరుగు కలపొచ్చు.
పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, పచ్చిశెనగపప్పు, మినపప్పులతో తాలింపు వేయాలి.
తాలింపు గింజలు చిటపటమంటున్నప్పుడు పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి కొంచెంసేపు వేగించాలి.
ఈ తాలింపును అటుకుల మిశ్రమం మీద పోసి కలిపితే అటుకులదద్ధ్యోదనం సిద్ధం.
అటుకులు, పల్లీల లడ్డు
కావలసినవి:
అటుకులు - ఒక కప్పు, పంచదార - అరకప్పు, పల్లీగింజలు, నెయ్యి - ఒక్కోటి పావు కప్పు చొప్పున, వంటల్లో వాడే కర్పూరం - చిటికెడు, యాలకుల పొడి - ముప్పావు టీస్పూన్‌, జీడిపప్పులు - ఐదు.
తయారీ:
అటుకుల్ని నూనె వేయకుండా సన్నటి మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేగించి, చల్లార్చాలి.
పల్లీగింజలను కూడా గోధుమ రంగు వచ్చే వరకు నూనె వేయకుండా వేగించి చల్లార్చాలి. పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేయాలి.
తరువాత వేగించిన అటుకుల్ని మెత్తటి పిండిలా గ్రైండ్‌ చేయాలి.
పంచదారను కూడా అలానే మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
అటుకులు, పంచదార, పల్లీగింజలు,
యాలకుల పొడిని వెడల్పాటి గిన్నెలో వేసి అందులో కర్పూరం పొడి వేసి కలపాలి.
జీడిపప్పుని చిన్న చిన్న పలుకులుగా చేయాలి. తరువాత నెయ్యి వేడిచేసి ఆ పలుకుల్ని బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.
వేడిచేసిన నెయ్యిని అటుకుల మిశ్రమంలో పోసి స్పూన్‌తో కలపాలి.
మిశ్రమం చేతితో పట్టుకునే వేడి ఉన్నప్పుడు లడ్డూలు చేయాలి. గాలి చొరబడని డబ్బాలో ఉంచితే రెండు వారాల వరకు పాడుకావు.
తీపి అటుకులు
కావలసినవి:
అటుకులు - ఒక కప్పు, బెల్లం పొడి - ముప్పావు కప్పు, కొబ్బరి తురుము - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి - అరటీస్పూన్‌, నెయ్యి - రెండు టీస్పూన్లు, జీడిపప్పు - కొద్దిగా.
తయారీ:
అటుకుల్ని కడిగి వడకట్టి పక్కన పెట్టాలి.
పాన్‌లో నెయ్యి వేడిచేసి జీడిపప్పుపలుకుల్ని బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.
పాన్‌లో బెల్లం పొడి వేసి నీళ్లు పోసి తీగపాకం వచ్చేలా ఉడికించాలి.
స్టవ్‌ మంట ఆపేసి యాలకుల పొడి, కొబ్బరి, అటుకుల మిశ్రమాన్ని వేసి కలపాలి. వేగించిన జీడిపప్పులతో అలంకరించాలి.
అటుకుల పులిహోర
కావలసినవి:
మందపాటి అటుకులు - ఒక కప్పు, చింతపండు - చిన్న నిమ్మకాయంత సైజ్‌, పల్లీగింజలు, జీడిపప్పులు - ఒక్కోటి రెండు టీస్పూన్ల చొప్పున, ఆవాలు, శెనగపప్పు - ఒక్కోటి అర టీస్పూన్‌ చొప్పున, పసుపు - పావు టీస్పూన్‌, నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, పచ్చిమిర్చి - మూడు, ఎండుమిర్చి - రెండు, కరివేపాకులు - కొన్ని, ఇంగువ - చిటికెడు.
తయారీ:
చింతపండును నీళ్లలో పదినిమిషాలు నానబెట్టి రసం పిండాలి.
అటుకుల్ని శుభ్రంగా కడిగి నీళ్లలో రెండు నిమిషాలు నానబెట్టాలి. తరువాత నీళ్లను వడకట్టి పక్కన పెట్టాలి.
పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, పల్లీగింజలు వేసి వేగించాలి. అవి చిటపటమంటున్నప్పుడు ఇంగువ, కరివేపాకులు, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి కొంచెంసేపు వేగించాలి. తరువాత చింతపండు మిశ్రమం, ఉప్పు, పసుపు వేసి గరిటెతో కలిపి, మూతపెట్టి ఉడికించాలి.
చింతపండు మిశ్రమం చిక్కగా అయ్యాక నానబెట్టిన అటుకుల్ని అందులో వేసి కలపాలి.
ఓ మాదిరి మంట మీద రెండు నిమిషాలు ఉడికించాక స్టవ్‌ ఆపేస్తే అటుకుల పులిహోర రెడీ.
వెన్న ఉండలు
కావలసినవి:
మైదా, పంచదార - ఒక్కో కప్పు చొప్పున, బియ్యప్పిండి - పావు కప్పు, వెన్న - 25 గ్రాములు, నూనె - వేగించడానికి సరిపడా, వంటసోడా -
చిటికెడు.
తయారీ:
మైదా, బియ్యప్పిండి, వెన్న, వంటసోడాలను ఒక గిన్నెలో వేయాలి. అందులో గోరువెచ్చని నీళ్లు పోసి పిండిముద్దలా చేయాలి. దానిపైన తడి బట్ట వేసి ఒక గంటసేపు పక్కన పెట్టాలి.
ఆ తరువాత చిన్న చిన్న ఉండలు చేసి వాటి మీద కూడా తడి బట్ట వేసి ఐదు నిమిషాలు ఉంచాలి.
పాన్‌లో నూనె వేడి చేశాక వెన్న ఉండల్ని సన్నటి మంట మీద లేత
గోధుమరంగుకి వచ్చే వరకు వేగించాలి.
వేగిన ఉండల్ని చల్లారనివ్వాలి. ఈ లోపు పంచదార మునిగే అన్ని నీళ్లు పోసి తీగపాకం వచ్చేంతవరకు వేడిచేయాలి.
పాకం రెడీ అయ్యిందా లేదా తెలుసుకునేందుకు ఒక ప్లేట్‌లో నీళ్లు పోసి అందులో ఒక చుక్క పాకం వేయాలి. అది కరిగిపోకుండా ఉంటే పాకం రెడీ అయినట్టు.
అప్పుడు స్టవ్‌ ఆపేసి వేగించిన వెన్న ఉండల్ని పంచదార పాకంలో వేసి గరిటెతో కొంచెం సేపటి వరకు ఆపకుండా కలపాలి.

మీఠా భారత్‌ మహాన్‌
పంజాబ్‌ పాలు గుజరాత్‌ తేనె బెంగాల్‌ పాకం కర్ణాటక మీగడ ప్రాంతాలు వేరైనా మధురిమ ఒకటే..
మధురత ఒకటేఈ దేశం తియ్యనఈ హృదయం తియ్యనఈ సహజీవనం తియ్యన మీఠా భారత్‌ మహాన్‌!
మైసూర్‌ పాక్‌
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రుచికరమైన స్వీట్‌ మైసూర్‌పాక్‌. భారతీయ ప్రధాన స్వీట్లలో ఒకటిగా నిలిచింది.
కావల్సినవి: శనగపిండి – ముప్పావు కప్పు; పంచదార – 4 కప్పులు; నెయ్యి – రెండున్నర కప్పులు
తయారీ: ∙ముందుగా శనగపిండిని జల్లించాలి ∙స్టౌ మీద మూకుడు పెట్టి వేడి చేయాలి. దీంట్లో పంచదార వేసి, రెండున్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. పంచదార కరిగేంతవరకు కలుపుతూ ఉండాలి ∙పంచదార పూర్తిగా కరిగాక అందులో అరకప్పు నెయ్యి పోస్తూ మెల్లగా కలపాలి ∙దీంట్లో శనగపిండి పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ∙మిశ్రమం ఉడుకుతుండగా కొద్ది కొద్దిగా మళ్లీ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి ∙మిశ్రమం బాగా ఉడికిందనడానికి గుర్తుగా సువాసన వస్తుంది. అప్పుడు మంట తీసేసి, వెడల్పాటి బేసిన్‌ అడుగున నెయ్యి రాసి, శనగపిండి మిశ్రమాన్ని పోసి, వెడల్పుగా చేయాలి. కొద్దిగా ఆరాక కత్తితో ముక్కలుగా కట్‌ చేసి, చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ముక్కలుగా ఉన్న పాక్‌ని తీసి సర్వ్‌ చేయాలి. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రుచికరమైన స్వీట్‌ మైసూర్‌పాక్‌. భారతీయ ప్రధాన స్వీట్లలో ఒకటిగా నిలిచింది.
కావల్సినవి: శనగపిండి – ముప్పావు కప్పు; పంచదార – 4 కప్పులు; నెయ్యి – రెండున్నర కప్పులు
తయారీ: ∙ముందుగా శనగపిండిని జల్లించాలి ∙స్టౌ మీద మూకుడు పెట్టి వేడి చేయాలి. దీంట్లో పంచదార వేసి, రెండున్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. పంచదార కరిగేంతవరకు కలుపుతూ ఉండాలి ∙పంచదార పూర్తిగా కరిగాక అందులో అరకప్పు నెయ్యి పోస్తూ మెల్లగా కలపాలి ∙దీంట్లో శనగపిండి పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ∙మిశ్రమం ఉడుకుతుండగా కొద్ది కొద్దిగా మళ్లీ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి ∙మిశ్రమం బాగా ఉడికిందనడానికి గుర్తుగా సువాసన వస్తుంది. అప్పుడు మంట తీసేసి, వెడల్పాటి బేసిన్‌ అడుగున నెయ్యి రాసి, శనగపిండి మిశ్రమాన్ని పోసి, వెడల్పుగా చేయాలి. కొద్దిగా ఆరాక కత్తితో ముక్కలుగా కట్‌ చేసి, చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ముక్కలుగా ఉన్న పాక్‌ని తీసి సర్వ్‌ చేయాలి.
మోతీచూర్‌ లడ్డూ
దేశం మొత్తమ్మీద రకరకాల లడ్డూల తయారీ వాడుకలో ఉంది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో మోతీచూర్‌ లడ్డూ బాగా ప్రసిద్ధి చెందింది.
కావల్సినవి: పంచదార – కప్పు; నీళ్లు – అర కప్పు; కుంకుమపువ్వు – 10 రేకలు (వేళ్లతో కొద్దిగా నలపాలి);
బూందీకి: శనగపిండి – కప్పు; కుంకుమపువ్వు – 10 రేకలు; నీళ్లు – 3/4 కప్పు; యాలకులు – 3 (గింజలు తీసుకోవాలి); సార పప్పు – టేబుల్‌ స్పూన్‌; నూనె – వేయించడానికి తగినంత; లడ్డూ కట్టే ముందు నూనె లేదా నెయ్యి చేతులకు అద్దుకోవాలి.
తయారీ: పాకం : మందపాటి గిన్నె తీసుకొని, అందులో నీళ్లు పోసి, పంచదార కరగనివ్వాలి. దీంట్లో కుంకుమపువ్వు రేకలు వేసి స్టౌ మీద పెట్టి, మరిగించాలి. పాకం అయ్యాక మంట తీసేయాలి.
బూందీ: శనగపిండిలో కుంకుమపువ్వు, నీళ్లు పోసి జారుగా కలపాలి. పిండి ముద్దలుగా లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. బూందీ చేసే జల్లెడ పట్టుకొని, సిద్ధంగా ఉంచిన పిండి వేసి, వేళ్లతో వలయాకారంగా రుద్దాలి. జల్లెడ తీసేసి, బూందీని వేయించుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. (బూందీ మరీ గట్టిగా కాకుండా జాగ్రత్తపడాలి.) బూందీ చల్లారాక చక్కెర పాకంలో వేసి కలపాలి. (చక్కెర పాకం మరీ వేడిగా ఉండకూడదు). బూందీ పాకంలో బాగా కలవాలంటే టేబుల్‌ స్పూన్‌ వేడి నీళ్లు చల్లవచ్చు. దీంట్లో యాలకుల పొడి, సారపప్పు వేసి కలపాలి. నూనె లేదా నెయ్యి చేత్తో అద్దుకుంటూ కొద్ది కొద్దిగా బూందీ మిశ్రమం తీసుకుంటూ లడ్డూ చేయాలి. చల్లారాక సర్వ్‌ చేయాలి.
నోట్‌: కిస్‌మిస్, జీడిపప్పు, బాదంపప్పు పలుకులు కూడా వాడుకోవచ్చు. ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలంటే నెయ్యిని ఉపయోగించకూడదు. ఫ్రిజ్‌ చల్లదనానికి నెయ్యి గడ్డకడుతుంది.
ఘరీ
గుజరాతీయులు చేసుకునే తీపి వంటకం ఇది.
కావల్సినవి: మైదా – కప్పు; నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్లు; పాలు – తగినన్ని; పిస్తాపప్పు – అర కప్పు; బాదంపప్పు – పావుకప్పు; కోవా – కప్పు; బొంబాయి రవ్వ – 2 టేబుల్‌ స్పూన్లు; శనగపిండి – 2 టేబుల్‌ స్పూన్లు; యాలకుల పొడి – టీ స్పూన్‌; కుంకుమపువ్వు – 10 రేకలు (టీ స్పూన్‌ పాలలో కలపాలి); పంచదార పొడి – తగినంత; అలంకరణకు: నెయ్యి 8 టేబుల్‌ స్పూన్లు; పంచదార పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; పిస్తా పప్పు (సన్నగా కట్‌చేయాలి) – తగినన్ని.
తయారీ: నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేయించి, తర్వాత శనగపిండి కలిపి వేపాలి. దీంట్లోనే కోవా వేసి 5 నిమిషాలు వేయించి, యాలకుల పొడి కలపాలి. ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని 2 భాగాలు చేయాలి. ఒక భాగంలో కచ్చాపచ్చాగా దంచిన బాదంపప్పు, సగం కుంకుమపువ్వుపాలు, సగం పంచదార పొడి కలపాలి. మరో భాగంలో కచ్చాపచ్చాగా దంచిన పిస్తాపప్పు, మిగతా పంచదార పొడి, కుంకుమ పువ్వు పాలు కలపాలి. వీటిని చిన్న ఉండలు చేయాలి. పిస్తాపప్పు ఉన్న పిండి భాగపు ఉండను అరచేత్తో వెడల్పు చేయాలి. దీంట్లో బాదంపప్పు పిండి ఉండను పెట్టి, చుట్టూ మూసేయాలి. మైదాలో కొద్దిగా నెయ్యి, పాలు కలిపి పూరీపిండిలా కలపాలి. చిన్న పిండి ముద్దలు చేసి, అదిమి, దీంట్లో సిద్ధం చేసిన పిస్తాబాదంపప్పు ఉండను పెట్టి మళ్లీ చుట్టూ మూయాలి. వీటిని ఆవిరి మీద ఉడికించాలి. (నూనెలో కూడా వేయించుకోవచ్చు) తర్వాత నెయ్యి కలిపిన పంచదార పొడిలో రోల్‌ చేయాలి. సర్వ్‌ చేసే ముందు పిస్తాపప్పు అలంకరించాలి.
శ్రీఖండ్‌
మహారాష్ట్రీయులు ఇష్టపడే తీపి వంటకం
కావల్సినవి: గట్టి తాజా పెరుగు – అరకేజీ; పంచదార పొడి – 5 టేబుల్‌ స్పూన్లు; యాలకుల పొడి – చిటికెడు; కుంకుమపువ్వు – 10 రేకలు; గోరువెచ్చని పాలు – అర టేబుల్‌ స్పూను; బాదం, పిస్తాపప్పు – 5 (అలంకరణకు)
తయారీ: పల్చటి కాటన్‌ క్లాత్‌లో పెరుగు వేసి గట్టిగా ముడివేయాలి. నీళ్లన్నీ పోయేలా ఆ మూట మీద బరువుంచాలి. 3 గంటల తర్వాత తీసి ఫ్రిజ్‌లో 4–5 గంటలసేపు ఉంచాలి. ∙గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి కలపాలి. ఫ్రిజ్‌ నుంచి తీసిన పెరుగులో పంచదార పొడి వేసి కలపాలి. అలాగే కుంకుమపువ్వు పాలు కలపాలి. బీటర్‌తో బాగా గిలకొట్టాలి. బాగా మృదువుగా అయ్యాక దీంట్లో రుచిని బట్టి మరికొంత పంచదార కలుపుకోవచ్చు. పైన సన్నగా తరిగిన పిస్తా, బాదంపప్పు పలుకులను అలంకరించాలి.
మాల్‌పువా
వెస్ట్‌ బెంగాల్, రాజస్థానీయులు ఈ వంటకాన్ని విరివిగా చేసుకుంటారు.
కావల్సినవి: మైదా – కప్పు; పాలు – అర కప్పు; పచ్చి కోవా – పావు కప్పు; యాలకుల పొడి – టీ స్పూన్‌; తరిగిన బాదంపప్పు – కొద్దిగా; వంటసొడా – చిటికెడు; పంచదార – అర కప్పు; నీళ్లు –కప్పు; నెయ్యి లేదా నూనె – వేయించడానికి తగినంత;
అలంకరణకు: బాదం, పిస్తాపప్పు తరుగు – టీ స్పూన్‌
తయారీ: ∙పాత్రలో పంచదార, నీళ్లు పోసి చిక్కటి మిశ్రమం (గులాబ్‌జామూన్‌ పాకంలా) అయ్యేంతవరకు మరిగించాలి. దీంట్లో యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని పక్కన ఉంచుకోవాలి. కావాలనుకుంటే ఇందులో చిటికెడు కుంకుమపువ్వు కూడా కలుపుకోవచ్చు ∙మరొక పాత్రలో మైదా, వంటసొడా, కోవా, పాలు వేసి ఉండలు లేకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙కడాయిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి ∙మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకొని, ఉండలు చేసి, పూరీలా (మందంగా) వత్తుకుని కాగిన నూనెలో వేసి రెండు వైపులా కాల్చాలి. (పెనం మీద నెయ్యి వేసుకొని కూడా ఎర్రగా కాల్చుకోవచ్చు.) ∙ఇలా తయారుచేసుకున్నవాటిని పంచదార పాకంలో ముంచి, ప్లేటులోకి తీసుకోవాలి ∙వీటి మీద సన్నగా తరిగిన బాదం, పిస్తాపప్పును అలంకరించి, వడ్డించాలి.
కుటుంబానికి రక్షణ – రైస్‌బ్రాన్‌ వంటనూనె
మంచి వంటనూనె వంటలకు చక్కని రుచిని అందించడమే కాదు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే వంటనూనెల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ (ఆర్‌బీఓ) పూర్తి శాకాహారనూనె. పాలిషింగ్‌ ప్రాసెస్‌లో ఉన్న ఊక నుంచి ఈ నూనెను తయారు చేయడం వల్ల దీంట్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా చేసిన అధ్యయనాలలో రైస్‌బ్రాన్‌ నూనెలో కొలెస్ట్రాల్‌ తగ్గించే గుణాలున్నాయని నిరూపితమైంది.
⇔ రిఫైన్‌ చేసిన రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ గోల్డెన్‌ ఎల్లో రంగులో ఉంటుంది. అమెరికాలోని కొలంబస్‌ ఒహియో ఎండీ, ఎఫ్‌ఆర్‌సీఏ డాక్టర్‌ షాలినీ పి.రెడ్డి మాట్లాడుతూ –‘రైస్‌బ్రాన్‌ వంటనూనె స్టీమ్‌ డిస్టిలేషన్‌ విధానంలో రిఫైన్‌ చేయడంతో పోషకాలు అన్నీ అలాగే నిలిచి ఉంటాయి. ఈ నూనెను అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్, ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారస్‌ చేశాయ’ని వివరించారు.
⇔ ఫ్రీడం రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ వైస్‌ప్రెసిడెంట్, సేల్స్‌ మార్కెటింగ్‌ పి.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ‘ఫ్రీడం బ్రాండ్‌ ప్రయాణం ఆరోగ్యకరమైన ఉత్పత్తులను వినియోగదారులకు పరిచయం చేయడమే ప్రధాన లక్ష్యం. ఆ ప్రమాణాలను కచ్చితంగా పాటించడం వల్లే వృద్ధిరేటు బాగుందని’ అన్నారు.
రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ప్రయోజనాలు
⇔ చెడు కొలెస్ట్రాల్‌(ల్‌డీఎల్‌)ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌(హెచ్‌డీఎల్‌) పెంచుతుంది.
⇔ గుండె, సంబంధిత రక్తనాళాలకు అత్యుత్తమ రక్షణ అందిస్తుంది. హృదయ దమనుల్లో కొలెస్ట్రాల్‌ నిల్వలు చేరకుండా అడ్డుకోవడంతో పాటు రక్తం సులువుగా గుండెకు చేరేందుకు తోడ్పడుతుంది.
⇔ అత్యధిక యాంటీ యాక్సిడెంట్లు కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
⇔ రైస్‌బ్రాన్‌ నూనెలో 10000+ పీపీఎం ఒరిజనల్‌ ఉంది. n ఒరైజనాల్, టోకోట్రైనాల్, టోకోఫిరాల్స్, ఫైటోస్టీరాల్స్, స్క్వాలీన్‌ వంటి అత్యధిక యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి. n 15 % కన్నా తక్కువ నూనె పీల్చుకుంటుంది. అందువల్ల వేపుడు పదార్ధాలు కూడా పోషకాలు కోల్పోవు. nఅత్యధిక ఉష్ణోగ్రతల వద్దనూ మరింత స్థిరంగా ఉంటుంది. n వేపుళ్లకు అతి తక్కువ సమయం పడుతుంది. అందువల్ల మరింత శక్తి ఆదా అవుతుంది.
టాగ్లు: Mysore Pak, Motichur Laddu, Ghari, మైసూర్‌ పాక్‌, మోతీచూర్‌ లడ్డూ, ఘరీ


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list