కుండలిని శక్తి అంటే..?
ప్రతి మనిషిలో కుండలిని శక్తి ఉంటుంది. ఇది మూలాధార చక్రంలో అంటే భౌతిక శరీరంలో వెన్నుపూస కింది భాగంలో రెండున్నర చుట్లు చుట్టుకుని సర్పాకారంలో చైతన్యరహితంగా ఉంటుంది. అయితే ఇది సూక్ష్మశరీరంలో ఉంటుంది కాబట్టి భౌతిక శరీరంలో మనం చూడలేం. కుండలిని శక్తికి చైతన్యం కలిగితే కాని ధ్యానయోగం మొదలవదు. ఈ కుండలిని శక్తి మనందరిలో చైతన్యరహితంగా ఉన్న స్థితిని నిద్రించడంగానూ, ఇది చైతన్యవంతం అవడాన్ని కుండలిని నిద్రలేవడంగానూ ఆధ్యాత్మికంగా వ్యవహరిస్తున్నారు.
ఈ శక్తి నిద్రలేచాకే ధ్యానయోగం మొదలవుతుంది. అప్పుడే భౌతిక శరీరం ద్వారా మనం ధ్యానంలో అనేక అనుభూతులను పొందగలం. అంటే ధ్యానయోగంలో ప్రవేశించాలనుకుంటే ముందుగా కుండలిని శక్తిని నిద్రలేపాలి. కొందరిలో ఇది సహజంగానే జరుగుతుంది. పూర్వజన్మలో ధ్యానయోగంలో ఉండి మరణించిన వారికి ఈ జన్మలో కర్మశేషం అనుభవించాక కుండలిని మేల్కొని మనసు ధ్యానం వైపు, దైవం వైపు మళ్లుతుంది.
కొందరిలో అన్ని జన్మల్లో ఆర్జించిన సంచిత, ఆగామి కర్మలన్నీ ఈ జీవితంలో ఏదో ఒక దశలో అనుభవంతో క్షయం అయిన మరుక్షణం కుండలిని శక్తి చైతన్యవంతమవుతుంది. ఫలితంగా అంతదాకా ఆధ్యాత్మిక మార్గంలో లేనివారు సైతం తక్షణం తీవ్ర వైరాగ్యంతో భక్తిలో పడతారు. ఈ జన్మలో చేసుకున్న కర్మల క్షయానికి ధ్యానయోగం చేపడతారు. వీరినే అవధూతలుగా వ్యవహరిస్తారు. లలితాదేవి కుండలిని మాత. సుబ్రహ్మణ్యేశ్వరుడిని ధ్యానం చేసిన వారికి కుండలిని త్వరగా చైతన్యవంతం అవుతుందని అంటారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565