MohanPublications Print Books Online store clik Here Devullu.com

ర్యాలి_Ryali


ryali temple for transfers  ryali photography  rajahmundry to ryali buses  temples in east godavari  east godavari temples in telugu  temples in ravulapalem  mandapalli temple  vadapalli temple
జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం,
 ర్యాలి

    ర్యాలి, తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామములో ప్రసిద్ధి చెందిన జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం ఉంది.ర్యాలి రాజమండ్రికి 40 కి.మి., కాకినాడకు 74 కి.మి., అమలాపురంకి 34 కి.మి. దూరంలో వసిష్ఠ, గౌతమి అనేగోదావరి ఉప పాయ ల మధ్య ఉంది. ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారు ర్యాలి ప్రధాన రహదారికి ఒకరికొకరు ఎదురెదురుగా ఉండడం.
స్థల పురాణం

జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం, ర్యాలి

శ్రమహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మధన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడుకొనుచుండగా శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు. జగన్మోహిని అవతార సమయం లోమహేశ్వరుడు జగన్మోహినిని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. మోహినీ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం క్రింద పడుతుంది. ఈ పుష్పం క్రిందపడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలి (ర్యాలి అంటే పడడం అని అర్థం) అని చెబుతారు.

ఆలయ నిర్మాణం
11 వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి అప్పటి చోళ రాజా విక్రమ దేవుడు వేట కై వచ్చి అలసి ఒక పెద్ద ఫోన్న చెట్టు క్రింద సేద తీరి నిద్రపోతాడు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రథం యొక్క మేకు క్రింద పడిన ప్రదేశం లోని భూగర్భంలో తన క్షేత్రం ఉందని పల్కుతాడు. ఆ మహారాజు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు ఆ ప్రదేశాన్ని త్రవ్వించగా జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయట పడుతుంది. అక్కడ ఆ మహారాజు ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. 1936 సంవత్సరంలో ఈ గుడికి ప్రాకారాలు నిర్మించబడ్డాయి.

.ర్యాలి గ్రామం
ర్యాలి ఆలయం
అమృతం పంచిన తర్వాత మోహిని (విష్ణుమూర్తి) ని శివుడు మోపిస్తాడు. అతన్నుంచి తప్పించుకొనేందుకు మోహిని రథం మీద వేగంగా వెళ్ళిందట. ఆ వేగం వల్ల రథం శీల రాలి పడటంతో జగన్మోహనునిగా అక్కడే వెళిశాడట.

మూలవిరాట్
5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి సాలిగ్రామ విగ్రహం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం. * స్వామివారి ఈ విగ్రహము అతి సుందరమైనది. ప్రత్యేకముగా చెప్పుకోదగినది. ఈ విగ్రహము ఏక సాలిగ్రామ శిలతో తయారైంది. విగ్రహము ముందువైపు విష్ణువు కేశవస్వామి, వెనుకవైపున జగన్మోహినీ రూపంలో ఉన్నాడు

ఎదుటవైపుగా స్యామి పాదపద్మాల మధ్య ఉన్న చిన్న గంగ దేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. (విష్ణు పాద్బోవీం గంగా).
ముందువైపు విష్ణువు నాలుగు చేతులు కలిగి, శంఖము, చక్రము, గద మరియు అభయహస్తము హస్తరేఖలతో ఉన్నాడు.

విగ్రహము పై బాగమున ఆదిశేషుడు నీడపట్టినట్లుగా ఉన్నాడు.
వెనుక వైపున ఇవేమీ కనుపించకుండా, రెండు చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి, కుడికాలు పై పాదము నకు కొద్దిగా పైభాగము (పిక్క) పై నల్లని మచ్చతో ఉంటుంది. ఈ మచ్చ పద్మినీ జాతి స్త్రీకి ఉండే లక్షణాలలో ఒకటిగా చెపుతారు. అసలే నల్లని సాలిగ్రామ శిలతో తయారైనా కూడా అంతకన్నా నల్లగా ఈ మచ్చ అతి స్పష్టంగా కనుపిస్తూ ఉంటుంది.
మొత్తముగా ఈ విగ్రహము అత్యంత ప్రత్యేకమైనది మరియు అద్భుతమైనది. బహుశ ఇటువంటి విగ్రహము ఇది ఒక్కటే అని చెప్పవచ్చును. అందుకే స్వామివారికి జరిగే నిత్యపూజలు, హారతి, నైవేద్యాదులు ముందువైపు మరియు వెనుక వైపు కూడా యధావిధిగా జరుగుతాయి.
ఇతర విగ్రహాలు

శ్రీ మహావిష్ణువు తూర్పు వైపు ఉండగా ఆయనకు ఎదురుగా శ్రీ మహేశ్వరుడు పశ్చిమ ముఖమై ఉన్నాడు. శివలింగాన్ని బ్రహ్మ కమండలం చే పావనం చేయబడినందున ఇక్కడి శివలింగాన్ని ఉమా కమండలేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణలో శ్రీదేవి, భూదేవి, నారదుడు, తుంబుర, రంభ, ఊర్వశి, కిన్నెర, కింపురుష, గోవర్ధనగిరిశుడై న శ్రీ కృష్ణుని, ఆదిశేషుని, గరుడుని, గంగా విగ్రహాలు చూస్తే శిల్పకళాచాతుర్యం ప్రకటితమైతుంది.




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list