MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆగస్ట్ 21 సోమావతి అమావాస్య.. ఆరోజు ఇలా చేస్తే అదృష్టం.._Somavati amavasya




ఆగస్ట్ 21 సోమావతి అమావాస్య..

ఆరోజు ఇలా చేస్తే అదృష్టం..


ఈ నెల 21న చాల మహిమాన్వితమై రోజు ఎందుకంటే ఈరోజునే సోమవారం అమావాస్య పైగా సూర్యగ్రహణం ఆరోజును సోమావతి అమావాస్య ఆరోజు మహా శివరాత్రి కన్నా చాల అత్యుత్తమమైన రోజు అని శస్త్ర గ్రందాలు చెబుతున్నాయి. ముక్కోటి దేవతలు గ్రహ దిక్పాలకులు ఐన నవ గ్రహలు సప్త ఋషులు అందరు ఎదురు చూస్తున్న రోజు అని తలపత్ర గ్రందాలు సైతం తెలియచేస్తున్నాయి శ్రవణ మాసం తో కూడిన సోమావతి అమావాస్య సూర్యగ్రహణం ఎంతో పవిత్రమైన రోజు దిని కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారుఈ రోజు గనుక శివుడికి అబిషేకం లింగార్చన చేస్తారు.ఎందుకంటే ఈరోజు సకల శక్తులుఅష్ట దిక్పాలక బూత శక్తులు ఆ లింగ రూపుడైన శివుడిలో కొలువై ఉంటాయి మనం తెలిసి చేసిన తెలియకునండ చేసిన పాపాలు ఏమైనా వుంటేఈరోజు హరించుకు పోతాయి మహా లింగార్చన చేస్తే ఈ రోజు లబించే పుణ్యం ఫిక్సడ్ డిపాజిట్ చేసినట్టేఈ రోజు పూర్తి ఐన తరువాత అక్షింతలు తీసుకొని కాసిన్ని నిల్లు పోసుకొని ఇలా అనాలి అనేనా మహా కృతేన పూజ ఫలంశ్రీ గణపతి దేవతర్పణ మస్తు అంటూ స్వామి వారిపదాల వద్ద వదిలి వేయాలిఇలా చేస్తే మీ పుణ్యం అనేది ఫిక్సడ్ డిపాజిట్ చేసినట్టే సోమావతి అమావాస్యకు ఒక పురాణ కదా కూడా వుంది.


అదేంటో చూద్దాం ఒకానోక ఊరిలో ఒక సాదువు ఓ వర్తక వ్యాపారి కుటుంబానికి వస్తు వుండే వాడు అయిన ఒకనాడు వచ్చినప్పుడు ఆమె ముకం చూసి దివించకుండా నే వెళ్ళిపోయాడు ఆ సాదువు దివించకుండా వేల్లానికి కారణం తెలియక అ కుటుంబం చాల బాధపడింది చివరికి పురోహితున్ని పిలిచి కారణం అడుగగా ఈ మేకు జాతకం చూసి ఈమె కు వివాహం జరిగితే బర్త అనాదికాలం లోనే మరణిస్తాడు. అని అన్నాడు ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు అది విని దిగ్బ్రాంతి చెందినా కుటుంబ సబ్యులు పరిష్కారం చెప్పమని పురోహితున్ని అడిగారు అయిన శిన్కలి ప్రాంతం లోని ఒక చాకలి స్త్రీ ని కుంకుమ అడిగి నుదుట ధరిస్తే దోషం పోతుందని అయన చెప్పారు.

వర్తకుడు ఆ అనివయతమైన కన్యను తన చిన్న కొడుకుని అక్కడికి పంపుతారు మార్గ మద్యం లో ఒక నదిని దాటాబోతుండగా వారికీ ఒక దృశ్యం కనిపించింది పప్పుడే పుట్టిన గ్రద్ద పిల్లలు ఒక పెద్ద పాము చంపు కు తినడానికి చూస్తుంది నిత్యం అక్కడ అదేజరుగుతుంది గడ్డ పిల్లలు పుట్టగానే వచ్చి తిని వెళ్లి పోయేది ఆరోజు అదే జరుగుతుంది కానీ ఆరోజు ఆ యువతీ దైర్యంగా అ పాముని చంపి అ గ్రద్ద పిల్లలని కాపాడింది తన పిల్లలను కాపాడినందుకు ఆ గ్రద్ద ఆ చాకలి స్త్రీ ఇంటికి దరి చూపిస్తుంది. కొన్ని నెలల పటు అ చకలమెకు సేవలు చేయగా ఒకానొక సోమావతి అమావాస్య నాడు ఆమె ఈ యువతికి కుంకుమని ఇచ్చింది ఆమె వెంటనే మంచి నీరు కూడా తాగకుండా రావి చెట్టుకు 108 ప్రదక్షణలు చేసింది ఆమె జాతక దోషం అంతటి తో తొలిగి పోయింది అలాగే సోమావతి అమావాస్య నాడు మౌనంగా శివున్ని ప్రర్దిస్తే రవి చెట్టుకు ప్రదక్షణలు చేసి ఈ కదను ఒక సరి గుర్తుకు చేసుకుంతు ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలిగి పోతాయి అని పండితులు వినిపిస్తున్నారు.

18-12-2017 
సోమవతి అమావాస్య అంటే
 ఆ రోజు ఏం చేయాలి


శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలు విందాం…


దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.

సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు.

నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ... ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు.

శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి... తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.

సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే... సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏదీ కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు.

(ఈ ఏడాది ఆగస్టు 21న తిరిగి డిసెంబరు 18న ఈ సోమవతి అమావాస్య వచ్చింది.)






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list