కాశీలో వదిలేసేది...
కొందరు వంకాయ తినమంటే.. ‘అబ్బే కాశీలో వదిలేశానండి!’ అంటుంటారు. కాశీలో నచ్చినవి వదిలేసే సంప్రదాయం ఉంది. ఇది పురాణాలు చెప్పిన విషయం కాదు. లౌకిక సంప్రదాయం. కాశీలో నచ్చిన వస్తువులు వదిలివేయడం వెనుక.. ఒక చక్కని బోధ ఉంది. కాశీ అంటేనే మోక్ష భూమి. ఐహిక బంధాలపై వ్యామోహాన్ని వదులుకున్నప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. వస్తువులపై ప్రేమ, వంటకాలపై అభిరుచి, బంధాలపై అనురాగం- ఇవన్నీ మోక్షానికి అడ్డుగా నిలుస్తాయి. కోరికలను జయించగలమనే నమ్మకాన్నీ, విషయసుఖాలను త్యజించగల స్థైర్యాన్నీ కలిగించడానికి పూర్వం రుషులు ‘కాశీలో ఇష్టమైన వస్తువును వదిలిపెట్టాలి’ అనే సంప్రదాయం తీసుకువచ్చారు. ఇష్టమైన ఫలం, శాకం, వస్తువు వదిలిపెట్టమని చెబుతారు. ఇష్టమైన దానిని కష్టంగా వదిలిపెట్టినా.. నియమానికి కట్టుబడి ఆ వస్తువు గురించి ఆలోచించడం మానేస్తాడు. ఇలా ఒక కోరికను జయించినవాళ్లు.. ఇతర కోరికలనూ జయించగల్గుతారు. ఒక్కో కోరికనూ వదిలేస్తూ.. మోక్షసాధనలో ముందడుగు వేస్తారు. అంతిమంగా దేహ భ్రాంతినీ, విషయ వాసనలనూ త్యజించి మోక్షాన్ని పొందుతారని చెప్పడమే ఈ ఆచారం వెనుక కథ. అయుతే ఇష్టమైన వస్తువును కాశీలో వదిలేసి.. ‘అయ్యో! అనవసరంగా వదిలేశానే..’ అని ఆలోచించొద్దు. అలాగే కాశీకి వెళ్లిన ప్రతిసారీ ఇష్టమైనవాటిని వదిలేయాల్సిన అవసరమూ లేదు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565