MohanPublications Print Books Online store clik Here Devullu.com

సూపర్‌ జీమెయిల్‌!-Supergmail

సూపర్‌ జీమెయిల్‌!
జీమెయిల్‌లో రోజుకో కొత్త ఆప్షన్‌ వస్తుంటుంది... అయితే అవి అందించని కొన్ని అదనపు సౌకర్యాల్ని క్రోమ్‌ బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్లతో పొందొచ్చు. వీటిని ఇన్‌స్టాల్‌ చేసుకొని మెయిల్స్‌ ట్రాకింగ్‌, అక్షరదోషాల నివారణ, మెయిళ్ల వర్గీకరణ, ... లాంటి కొత్త కొత్త ఆప్షన్లతో మీ జీమెయిల్‌ని సూపర్‌ జీమెయిల్‌గా మార్చేయొచ్చు. వాటికి ఉపయోగపడే క్రోమ్‌ బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్‌లివీ!
మెయిల్‌ ట్రాక్‌ ఎక్స్‌టెన్షన్‌తో మీరు పంపిన మెయిల్‌ అవతలి వ్యక్తి చూశారో లేదో తెలుసుకోవచ్చు.
డ్రాఫ్ట్‌ మ్యాప్‌ ఎక్స్‌టెన్షన్‌ ఉంటే మీరు రాసిన మెయిల్‌లో అక్షర, వ్యాకరణ దోషాలు తెలిసిపోతాయి.
చెకర్‌ప్లస్‌ ఎక్స్‌టెన్షన్‌ను మీరు ఇన్‌స్టాల్‌ చేసుకుంటే... మొబైల్‌ తరహాలో మెయిల్‌ వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్‌ వస్తుంది.
రీనేమ్‌ ఈమెయిల్‌తో మీకు వచ్చిన ఈమెయిళ్ల సబ్జెక్ట్‌ను మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.
పేరు మార్చుకోవచ్చు 
రెండు నెలల క్రితం ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేశారు. ఆ టికెట్‌ పీడీఎఫ్‌ మెయిల్‌కి వచ్చింది కూడా. ఇప్పుడు దాని కోసం వెతుకుతుంటే దొరకడం లేదా? ఆ మెయిల్‌ సబ్జెక్ట్‌ను మీకు గుర్తుండేలా మార్చుకొని ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు కదా. Rename Email ఎక్స్‌టెన్షన్‌ ద్వారా ఈ పని చేయొచ్చు. దీన్ని మీ క్రోమ్‌ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మీకు వచ్చే మెయిళ్ల సబ్జెక్ట్‌ను మార్చుకోవచ్చు. ఫ్లైట్‌ టికెట్‌నే తీసుకుంటే... ప్రయాణం తేదీ, రైలు పేరు లాంటివి సబ్జెక్ట్‌గా ఇస్తే వెతకడం సులభంగా ఉంటుంది.
సరి చేస్తుంది 
ఒకే మెయిల్‌లోని టెక్స్ట్‌లో రెండు, మూడు రకాల ఫాంట్‌లు ఉంటే బాగుండదు కదా. వెబ్‌సైట్‌లో టెక్స్ట్‌ కాపీ చేసుకున్న టెక్స్ట్‌ను మెయిల్‌లో పేస్ట్‌ చేస్తే... అలానే కనిపిస్తుంది. Email Text Formatter ఎక్స్‌టెన్షన్‌తో ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. వెబ్‌సైట్‌ నుంచి తీసుకున్న మేటర్‌ను మెయిల్‌ బాక్స్‌లో పేస్ట్‌ చేసిన తర్వాత... పైన ‘ఫిక్స్‌ ఫాంట్‌’ అని ట్యాబ్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే మీరు పేస్ట్‌ చేసిన ఫాంట్‌ సాధారణ అక్షరాల్లా మారిపోతుంది.
ప్రశ్నలు ఉన్నాయా?
మీ పై అధికారి నుంచి మీకో మెయిల్‌ వచ్చింది... అందులో విషయంపై మీకు చిన్న సందేహం ఉంది. అప్పుడు అడుగుదామంటే ఆయన అందుబాటులో లేరు. తర్వాత అడుగుదామంటే గుర్తుండదు. ఆ మెయిల్‌కి ఓ నోట్‌ యాడ్‌ చేసుకుంటే ఈ సమస్య ఉండదు కదా. Simple Gmail Notes ఎక్స్‌టెన్షన్‌ ఈ పని చేసిపెడుతుంది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత మీకు వచ్చే మెయిల్‌కుపైన ఒక బాక్స్‌ కనిపిస్తుంది. అందులో మీ సందేహాన్ని రాసుకోవచు.
తప్పొప్పులు తెలుస్తాయి
ఆంగ్లంలో మెయిల్‌ అయితే కంపోజ్‌ చేసేస్తారు కానీ... గ్రామర్‌లో తప్పులుంటాయేమో అని మీకు సందేహమా? అయితే DraftMap ఎక్స్‌టెన్షన్‌ మీ ఇబ్బంది తీరుస్తుంది. దీన్ని క్రోమ్‌ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత జీమెయిల్‌లో టైప్‌ చేస్తే... ఆ వాక్యాల్లోని పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌, ఎక్కువగా వాడిన పదాలు, శైలి సరిగ్గా లేని పదాలు తదితర వివరాలు తెలుసుకోవచ్చు. వాటిలో ఒక్కొక్కటి ఒక్కో రంగు కనిపిస్తాయి. అనవసరం లేదా తప్పు అనుకున్న పదాల్ని అక్కడే మార్చేయొచ్చు.
మీ పేరు కొత్తగా
జీమెయిల్‌ సెట్టింగ్స్‌లో సిగ్నేచర్‌ అనే ఓ ఆప్షన్‌ ఉంటుంది. అందులో పేరు, వివరాలు ముందుగానే రాసిపెట్టేస్తే... ప్రతి సెంట్‌ మెయిల్‌ మేటర్‌ ఆఖరున అవి ఆటోమేటిక్‌గా వచ్చి చేరుతాయి. దానికి ఫొటో, మీ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఐడీలు లాంటి కొత్త సొబగులు అద్దాలంటే WiseStamp - Email Signatures for Gmail ఎక్స్‌టెన్షన్‌ ఉండాల్సిందే. దీన్ని క్రోమ్‌ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే... ఓ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో మీ పేరు, మొబైల్‌ నెంబరు, ఫొటో, చిరునామా, సోషల్‌ నెట్‌వర్క్‌ ఐడీ తదితర సమాచారం ఇవ్వాలి. ఆ తర్వాత ఎప్పుడు మెయిల్‌ చేసినా ఆ వివరాలు అడుగున వస్తాయి.
చూశారా లేదా?
వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ పంపిస్తే... దాన్ని చూశారా లేదా అనే విషయాన్ని టిక్‌ మార్క్‌ ద్వారా తెలుసుకోవచ్చు. జీమెయిల్‌లోనూ అలాంటి సౌకర్యం ఉంది. అయితే దాని కోసం Mailtrack ఎక్స్‌టెన్షన్‌ను బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిల్‌ చేసినప్పుడు దిగువన ఉన్న బటన్‌ ద్వారా ‘మెయిల్‌ ట్రాక్‌’ ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేసుకొని సెండ్‌ చేయాలి. అలా పంపించిన మెయిల్‌ అవతలి వ్యక్తికి చేరితే ఒక గ్రీన్‌ టిక్‌, దాన్ని ఓపెన్‌ చేస్తే రెండు గ్రీన్‌ టిక్‌లు వస్తాయి. ఎంత సేపటి క్రితం మెయిల్‌ ఓపెన్‌ చేశారనేది మీరూ తెలుసుకోవచ్చు.
వస్తే చెబుతుంది
మీకు మెయిల్‌ వచ్చినప్పుడల్లా మొబైల్‌లో నోటిఫికేషన్‌ వస్తుంది. అదే సిస్టమ్‌లో అయితే ప్రతిసారి మెయిల్‌ ఐడీ ఓపెన్‌ చేసి చూసుకోవాలి. అదే మీరు Checker Plus for Gmail ఎక్స్‌టెన్షన్‌ వాడుతుంటే... మీకు కంప్యూటర్‌లోనూ నోటిఫికేషన్‌ వస్తుంది. దీన్ని సిస్టమ్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక మీకు ప్రతిసారి మెయిల్‌ వచ్చినప్పుడు స్టార్ట్‌ బార్‌లో నోటిఫికేషన్‌ వస్తుంది. అక్కడే క్లిక్‌ చేసి మెయిల్‌ను చూడొచ్చు. వాటిని డిలీట్‌, మూవ్‌, ఫార్వర్డ్‌ లాంటివి కూడా చేయొచ్చు.
వర్గీకరణ సులభంగా...
వ్యక్తిగత మెయిల్స్‌, వృత్తిగత మెయిల్స్‌, బ్యాంకు వివరాలు... వీటి మధ్యలో టాస్క్‌లు. అలా గజిబిజిగా కాకుండా టాస్క్‌లను వేరుగా పెట్టుకుంటే పని సులభమవుతుంది. Sortd ఎక్స్‌టెన్షన్‌ ద్వారా ఈ పని చేయొచ్చు. దీనికి మీ మెయిల్‌ ఐడీని జోడించాక... సరికొత్త విండో ఓపెన్‌ అవుతుంది. అందులో టుడూ, ఫాలో అప్‌, లిస్ట్‌ అని విభాగాలు కనిపిస్తాయి. వాటి పక్కనే మీకు వచ్చిన మెయిల్స్‌, మీరు నమోదు చేసుకున్న టాస్క్‌లుంటాయి. వాటిని పక్కనున్న ట్యాబ్స్‌లోకి డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ చేసి సులభంగా వర్గీకరించొచ్చు.
సమాధానం రాకపోతే...
మీ స్నేహితుని మెయిల్‌ చేశారు... సమాధానం కోసం రెండు రోజులు వేచి చూశారు. కానీ ఫలితం లేదు. దీంతో మళ్లీ మెయిల్‌ చేశారు. ఇలా సమాధానం రాని వారికి మీరే మళ్లీ మెయిల్‌ చేయాల్సిన అవసరం లేకుండా... ఆటోమేటిక్‌గా మెయిల్‌ వెళ్లే ఆప్షన్‌ ఒకటి ఉంది. Notifus ఎక్స్‌టెన్షన్‌తో ఈ పని చేయొచ్చు. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక కంపోజ్‌ మెయిల్‌ ఐకాన్‌ క్లిక్‌ చేస్తే... దిగువ సెండ్‌, సెండ్‌+1డే, సెండ్‌+2డే అంటూ కొన్ని ఆప్షన్లు ఉంటాయి. సెండ్‌+1డేను ఎంచుకుంటే మీరు మెయిల్‌ పంపిన ఒక రోజులోగా దానికి సమాధానం రాకపోతే ఆ మెయిల్‌ రీసెండ్‌ అవుతుంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list