MohanPublications Print Books Online store clik Here Devullu.com

మలినమై పోతున్నడమ్మా మనిషన్నవాడు


                      

        మలినమై పోతున్నడమ్మా మనిషన్నవాడు

అవును. మనిషి మలినమైపో తున్నాడు. గాలి, నీరు, తిండి.. ఒక్కటేమిటి? సమస్తం కలుషితం. మలిన మయం. అవన్నీ శరీరంలోకి లోహాలు, రసాయన రూపాల్లో వెళ్లి.. వ్యర్థాలుగా పేరుకు పోయి.. ఆరోగ్యాన్ని గుల్లగుల్ల చేసేస్తున్నాయి. దేహంలో గుట్టలు గుట్టలుగా పడున్న ఆ చెత్తను శుభ్రం చేసుకో కుండా.. పైకి ఎన్ని చికిత్సలు చేసుకున్నా ప్రయోజనం ఉండదు అంటున్నారు టాక్సికాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ సక్సేనా. బాడీలో కరుడుగట్టిన కలుషితాల (టాగ్జిన్స్‌)ను శుభ్రం చేసే వైద్యవిధానం డీటాక్సిఫికేషన్‌ గురించి వివరించారాయన..

ఏ శరీరమూ ఇప్పుడు సహజసిద్ధంగా లేదు. గాలి, నీరు, ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి రసాయనాలు, లోహాలు అత్యంత సూక్ష్మరూపంలో నిరంతరం వచ్చి చేరుతున్నాయి. ఇవి మానవ దేహాల్ని తీవ్రంగా ధ్వంసం చేస్తున్నాయి. శరీరంలోకి నీటిద్వారా నిత్యమూ చొరబడే వాటిలో ఆర్సెనిక్‌, బేరియం, కాడ్మియం, క్రోమియం, లెడ్‌, కాపర్‌, మెర్క్యురీ, నికెల్‌, యాంటీమనీ, బెరీలియం వంటివి వచ్చి చేరుతున్నాయి. ఇవన్నీ అధిక రక్తపోటు, మధుమేహం, ఫ్యాటీలివర్‌లతో పాటు కేన్సర్‌ రావడానికి కూడా ప్రధాన కారణం అవుతున్నాయి. వీటన్నిటికీ మందులూ, సర్జరీలే ఏకైక పరిష్కారం అనుకుంటున్నాం. వాస్తవానికి అసలు వైద్య చికిత్స- శరీరంలో పేరుకుపోయిన లోహాల్ని, రసాయనాల్ని, ఇతర వ్యర్థ, విషపదార్థాలను తొలగించడం. అది డీ-టాక్సిఫికేషన్‌ థెరపీతోనే సాధ్యమవుతుంది. ఈ లోహాలు, రసాయనాలు ఏవో క ర్మాగారాల్లోంచే వస్తున్నాయని కాదు. మన రోజువారీ వినియోగాల్లోంచి కూడా శరీరాన్ని కలుషితం చేస్తున్నాయి.
విషపదార్థాలే ఆరోగ్యానికి శాపం
శరీరానికి ఆవల ఉండే హానికారక అంశాన్ని విషపదార్థం (టాక్సిన్‌) అంటారు. ఇలాంటివి శరీరంలోకి ప్రవేశించినప్పుడు వీటిల్లో చాలా వాటిని తిరిగి బయటికి పంపించడం శరీరానికి సాధ్యం కాదు. ఈ విషకారకాలు ప్రధానంగా గాలి, నీరు, ధ్వని, ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ రోజుల్లో అవి భారీ మొత్తంలో శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఆహార పదార్థాల్లోని మలినాల్నే తీసుకుంటే, వాటిలోంచి వచ్చే కార్బోహైడ్రేట్‌, ప్రొటీన్‌, కాల్షియం, మెగ్నీషియం, సెలేనియం, అమినో యాసిడ్స్‌ ఇలాంటి వాటిని శరీరం జీర్ణించుకుని, వాటిలోని వ్యర్థాల్ని బయటికి పంపించగలుగుతుంది. అందుకు భిన్నంగా లోహాల్లాంటివి మరేవో విషపదార్థాలు శరీర వ్యవస్థలోకి, నాడీ వ్యవస్థలోకి చొరబడినప్పుడు అవి సిరల్లో, ధమనుల్లో, రక్తనాళాల్లో సహజమైన ప్రవాహాలకు అడ్డుపడుతుంటాయి. శరీర వ్యవస్థనూ, జీవక్రియలనూ కుంటుపరుస్తాయి. హార్మోన్‌ వ్యవస్థలో ఒక అసమతుల్యతను కలుగజేస్తాయి.
వైద్య చికిత్స ఎలా?
శరీరంలోని కలుషితాలను, మలినాలను తొలగించడానికి పలురకాల డీ-టాక్సిఫికేషన్‌ విధానాలు ఉన్నాయి. అందులో భాగంగా హైపర్‌బేరిక్‌ ఆక్జిన్‌ థెరపీ, ఖిలేషన్‌ థెరపీ, క్రియో లైపో లేజర్‌ థెరపీలు ఉన్నాయి. వీటన్నింటి లక్ష్యం శరీరంలోని కలుషితాలను, సూక్ష్మస్థాయిలో ఉండే లోహాలను బయటికి పంపించి శరీరాన్ని తిరిగి సహజస్థితికి తీసుకురావడం. ఒకసారి శరీరం తన సహజ స్థితిని సంతరించుకుందీ అంటే అప్పటిదాకా ఉన్న జబ్బులన్నీ తొలగిపోతాయి. రొమ్ము కేన్సర్‌ను చాలా ముందుగా గమనించడానికి థర్మోస్కాన్‌ కూడా ఉంది. దీనివల్ల అది ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్లే అవకాశ మే ఉండదు.
  • శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడానికి ప్రకృతి వైద్య చికిత్సా విధానాలను అనుసరిస్తాం. ఇందులో భాగంగా, మలవిసర్జన పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలి. ఏ విధమైన ఆహారపదార్థాలను ఇప్పటిదాకా తీసుకుంటూ వచ్చారు. వాటిలోని హానికారక పదార్థాలకు భిన్నంగా వాళ్లకు ఎలాంటి ఆహార పదార్థాలు ఇస్తే బావుంటుంది? అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఆహారాన్ని సూచించాలి.
  • ఏదైనా తీవ్రమైన జబ్బుతో బాధపడే వారికి మాత్రం ఈ సాధారణ చికిత్సల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఇలాంటి స్థితిలో ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్‌లు ఇస్తారు. ఈ విధానంలో ఎమెస్టైల్‌ సిస్టీన్‌, విటమిన్‌- సి, కొన్ని రకాల కిలేటిన్‌ డ్రగ్స్‌ ఇస్తారు. రక్తనాళాల ద్వారా ఇచ్చే ఈ డ్రగ్స్‌ శరీరంలోని లోహాలను పట్టేసి అవి విసర్జన ద్వారా బయటికి వెళ్లేలా చేస్తాయి. ఈ డ్రగ్స్‌ సింథటిక్‌ అమినో యాసిడ్స్‌. అయితే వీటి తాలూకు అంశాలేవీ శరీరంలో నిలవవు. పైగా వీటిని యథాతథంగా కాకుండా, వేరే కొన్నింటితో కలిపి శరీరంలోకి పంపిస్తారు. దీనివల్ల ఏ విధమైన హానీ జరగదు. శరీరంలో మలినాలు భారీగా పేరుకుపోయినప్పుడు ఈ తరహా చికిత్సలు అవసరమవుతాయి.
ఆక్సిజన్‌ థెరపీ
  • ఈ చికిత్సలో భాగంగా ఆక్సిజన్‌ థెరపీ చేస్తారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటే మో హై- ప్రెజర్‌తో ఆక్సిజన్‌ ఇవ్వడం. దీన్నే హైపర్‌బేరిక్‌ ఆక్సిజన్‌ థెరపీ అంటారు.
  • మేము గమనించిన చాలా మందిలో రక్తప్రసరణ లేకపోవడమే ప్రధాన సమస్యగా ఉంటోంది. ఎర్రరక్తకణాల ద్వారా వెళ్లవలసిన ఆక్సిజన్‌ చేరవలసిన చోటికి చేరదు. ఈ స్థితిలో హైపర్‌ బేరిక్‌ ప్రెజర్‌ ద్వారా ఆక్సిజన్‌ చేరవలసిన చోటికి చేరుతుంది. మెదడులోని ఏదైనా ఒక భాగానికి ఆక్సిజన్‌ అందడం లేదే అనుకోండి. ఆ స్థితిలో ఆ భాగంలో కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఆ భాగానికి హైపర్‌బేరిక్‌ ప్రెషర్‌ ద్వారా ఆక్సిజన్‌ను అక్కడికి పంపినప్పుడు సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి.
ఓజోన్‌ థెరపీ
ఓజోన్‌ మాల్‌క్యూల్స్‌ను శరీరంలోకి అంటే రక్తంలోకి ఎక్కించడం ఈ థెరపీ విధానం. థైరాయిడ్‌ సమస్యలు, కిడ్నీ పనిచేయలేని స్థితికి చేరుకున్నప్పుడు ఓజోన్‌ థెరపీ ఇస్తారు. దీనివల్ల దెబ్బతిన్న ఆయా భాగాల కణాలు తిరిగి ఉత్తేజితమవుతాయి. కణజాలంలోని 20 శాతం చివరికి 10 శాతం కణాలను ఉత్తేజితం చేసినా రోగికి కలిగే లాభం చాలా ఎక్కువ. అందుకే ఓజోన్‌ థెరపీ కేన్సర్‌ వ్యాధికి ఒక గొప్ప సమాధానంగా కూడా నిలుస్తోంది. దీనివ ల్ల కేన్సర్‌ బాధితులకు కలిగే లాభం కూడా భారీ స్థాయిలోనే ఉంటోంది. వీటితోపాటు ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌లు, సొరియాసిస్‌, రూమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, యాంకిలోజింగ్‌ స్పాండిలోసిస్‌ లాంటి వ్యాధులకు కేవలం డీటాక్సిఫికేషన్‌, ఓజోన్‌ థెరపీ ద్వారా మంచి ఫలితాలు వస్తాయి.
కేన్సర్‌ రోగులు చాలా వరకు వ్యాధి చేయిదాటిపోయిన నాలుగో స్టేజ్‌కు చేరుకున్నాకే ఈ క్రమంలో స్టేజ్‌ - 4 కేన్సర్‌ రోగులు కూడా వస్తున్నారు. ఆ స్థితిలో వారిని పూర్తిగా నయం అవుతుందని చెప్పను గానీ, వాళ్ల జీవన ప్రమాణాలను కొంత మెరుగుపరచడం మాత్రం సాధ్యమవుతోంది. గుండెపోటు వచ్చిన వాళ్లకు స్టెంట్‌ వేస్తే, అప్పటికి ఆ సమస్య నుంచి బయటపడినట్లే అనిపించినా కొద్ది మాసాల తర్వాత కొందరిలో ఏదో ఇబ్బంది అనిపిస్తుంది. దీనికి కారణం వారి మైక్రో సర్క్యులేషన్‌లో ఇబ్బంది ఏర్పడటమే. గుండెకు వెళ్లే రక్తనాళాలు పైపుల్లాంటివి కావు. అవి ఒక వృక్షంలా ఉంటాయి. స్టెంట్‌ వేయడం ద్వారా ప్రధాన ర క్తనాళంలోని అడ్డంకిని తొలగించగలుగుతున్నారు గానీ, సూక్ష్మరక్తనాళాల గురించి ఆలోచించడం లేదు. వాటిని కూడా శుభ్రపరచాలంటే ఖిలేషన్‌ థెరపీ, హైపర్‌బేరిక్‌ ఆక్సిజన్‌ థెరపీ చేయాల్సి ఉంటుంది. అప్పుడే సూక్ష్మరక్తనాళాలు కూడా శుభ్రమవుతాయి. రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది.
లివర్‌ శుభ్రమైతే షుగర్‌ నియంత్రణ సులభం
వ్యర్థపదార్థాలతో నిండిపోయిన లివర్‌ను శుభ్రపరిచిన తర్వాత - మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. మందుల అవసం తగ్గుతుంది. ఇందుకు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. చాలా మంది అనుకుంటున్నట్లు, టైప్‌-2 మధుమేహంలో క్లోమగ్రంథి పాత్ర అంత కీలకం కాదు. అది అవసరమైనంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. కాకపోతే ఆ ఇన్సులిన్‌ నిరుపయోగమవుతోంది. దీన్నే మనం ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ అంటాం. ఈ అవాంతరాన్ని తొలగిస్తే, మధుమేహం సమస్యే ఉండదు. మధుమేహం వచ్చిన తర్వాత చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? ఆలా్ట్రసౌండ్‌, రక్తపరీక్షల ద్వారా ఇంకో ఐదేళ్ల తర్వాత మీకు మధుమేహం వచ్చే అవకాశం ఉందని ముందే చెప్పగలగొచ్చు. పక్షవాతం, ఆర్థరైటిస్‌, నరాలు క్షీణించిపోయే మల్టిపుల్‌ క్లెరోసి్‌సకు చికిత్స ఉంది. పార్కిన్‌సోనిజం వ్యాధికి హైపర్‌ బేసిక్‌ ఆక్సిజన్‌ థెరపీతో మంచి ఫలితం ఉంటుంది. ఇన్సులిన్‌ డిపెండెంట్‌ డయాబెటిస్‌ ఉన్న పిల్లలకు డిటాక్సిఫికేష్‌ థెరపీ ఇస్తే ఇన్సులిన్‌తో పనిలేకుండా కేవలం మాత్రలు తీసుకుంటే సరిపోతుంది. క్రానిక్‌ లివర్‌ డిసీజ్‌, ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌, ఆటిజం వంటి సమస్యలు డీ- టాక్సిఫికేషన్‌ థెరపీల ద్వారా నయమవుతాయి.
లెడ్‌ ఎక్కువైతే బీపీ అధికం
అధికరక్తపోటు సమస్య ఒకసారి ప్రారంభమయ్యిందీ అంటే డాక్టర్లు జీవితమంతా మందులు వాడాలని చెబుతారు. కానీ, వారి శరీరంలో పెరిగిపోయిన ‘లెడ్‌’ను తీసివేయగలిగితే.. సమస్య మూలాలు తొలగుతాయి. రక్తనాళాల్లో సాగే గుణం పోయి బిగుసుకుపోతాయి. దీని ఫలితంగానే.. రక్తపోటు సమస్య మొదలవుతుంది. ఆ స్థితిని 10 శాతం తగ్గించినా మందుల అవసరం ఉండదు. అధిక రక్తపోటు సమస్యకు మానసిక ఒత్తిళ్లే కారణమనుకుంటున్నారు. ఈ ఒత్తిళ్ల వల్ల ఉన్న అధిక రక్తపోటు సమస్య అధికమవుతుందే తప్ప అధిక రక్తపోటుకు అదే మూలం కాదు. అందుకు గల అసలు కారణం కాలుష్యాలే.
మలినాలు తొలగితే మంచిది
డీ-టాక్సిఫికేషన్‌ థెరపీ కోసం ఏదో ఒక వ్యాధి మొదలయ్యాకే రావాలని కాదు. ఆరోగ్యవంతులు కూడా ఈ చికిత్స తీసుకోవచ్చు. అలా తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం కూడా. ఈ ముందస్తు జాగ్రత్తల వల్ల ఏ తీవ్ర వ్యాధి బారినో పడి జీవితం చిద్రమైపోకుండా కాపాడుకోవచ్చు. మరొక విషయం - విటమిన్‌-డి తగ్గినట్లు తేలుతున్న వాళ్లలో అసలు సమస్య వారిలో లెడ్‌ పేరుకుపోవడం. పాతకాలంలో వేసిన నల్లా పైపుల్ని లెడ్‌తోనే తయారు చేశారు. వాటిలోంచి వచ్చే నీళ్లల్లో లెడ్‌ కలుస్తుంది. అందువల్ల తొలి రెండు మూడు కడవల నీళ్లను తాగడానికి, వంటకాలకు కాకుండా ఇతర వినియోగానికి కేటాయించడం ఎంతో మేలు. ఇంట్లో కూడా నీళ్ల కోసం మట్టి కడవలను ఉపయోగించడం శ్రేయస్కరం. నిజానికి చాలా మందిలో వచ్చే అధికరక్తపోటు, మధుమేహం, ఫ్యాటీ లివర్‌ ఇవి కూడా శరీరంలో లోహాలు పేరుకుపోయిన తాలూకు లక్షణాలే. కేన్సర్‌ కూడా అందులో భాగమే. అందుకే శరీరాన్ని ప్రాణాంతక వ్యాధుల పాలు చేసే లోహాలను సమూలంగా తొలగించే ఈ చికిత్సలతో దేహాలు ఆరోగ్యంగా.. మనసులు ఆనందంగా ఉంటాయి.
  • మనం రోజూ వాడే సబ్బుల్లో యాంటీ బ్యాక్టీరియల్‌గా ట్రైక్లోసిన్‌ అనే ఒక రసాయనాన్ని కలుపుతారు. ఇది చర్మ రంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించి థైరాయిడ్‌ గ్రంథిని దెబ్బ తీస్తుంది.
  • ఇంట్లో దోమల్ని చంపడానికి చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. అనేక రకాల క్రిమిసంహారక మందులు వాడతాం. అప్రయత్నంగానే, మనం వాటిని లోనికి పీల్చేస్తుంటాం. అయితే, మన శరీరంలో అంతమొత్తం విషపదార్థాలను బయటికి పంపించే విసర్జక శక్తి ఉండదు. ఒక రోజునే ఇదంతా అయిపోతుందని కాదు, ప్రతిరోజూ వాడే దోమల మందులతో రోజుకింత చొప్పున కలుషితాలు మన శరీరంలోకి వెళ్లి, శ్వాసకోశాలనో, గుండె రక్తనాళాల వ్యవస్థనో, కిడ్నీలనో, మెదడునో, లివర్‌నో దెబ్బ తీస్తూ.. ఏదో ఒకరోజున అది మనకు ప్రాణాంతక పరిస్థితిని కలిగిస్తుంది.
  • ఇటీవలి కాలంలో మొబైల్‌ ఫోన్‌లతో వచ్చే సమస్యలు కూడా తక్కువేమీ కాదు. దీనికి సంబంధించిన రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్‌ చెవి ద్వారా లోనికి ప్రవేశించి కణానికీ, కణానికీ మధ్య చిచ్చుపెడతాయి.
  • ఈ రోజుల్లో తాగడానికి గ్లాసు పాలు ఇవ్వడం అంటే అతనికి గ్లాసెడు విషం ఇచ్చినట్లే. ఎందుకంటే ఇప్పడు లభిస్తున్న పాలల్లో అత్యధిక శాతం ఆ గేదెలకు లేదా ఆవులకు అధికోత్పత్తి కోసం ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తున్న కృత్రిమ పాలే. మీకు మీరు ఇంట్లో ప్రకృతి సహజమైన ఆహారాన్ని ఇస్తూ తీసిన పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. సమస్య అంతా ఈ కృత్రిమ పాలతోనే. పాలను పాలథిన్‌ కవర్లలో సరఫరా చేసే ఈ విధానం కూడా విషకారకమైనదే.
  • చాలాసార్లు వాతావరణ కాలుష్యాల వల్ల కేవలం శ్వాసకోశాలే దెబ్బతింటాయని మనం భావిస్తాం. కానీ, శ్వాసకోశాలతో పాటు, అన్నవాహిక, కాలేయం, గుండె రక్తనాళ వ్యవస్థ, మెదడు (సెరెబ్రెల్‌ వ్యాస్కులైటిస్‌) ఇవన్నీ దెబ్బ తింటాయి. మెదడు మీద ఈ ప్రభావం ఉండటం వల్లే పొగతాగడం, అధిక రక్తపోటు వంటివేమీ లేకపోయినా ఎంతో మంది పక్షవాతానికి గురవుతున్నారు. దీనికంతా కాలుష్యమూ కారణమే. ప్రత్యేకించి డీజిల్‌ వాహనాల్లోంచి వచ్చే కాలుష్యం ఈ పరిస్థితిని మరింత విషమంగా మారుస్తోంది. లెడ్‌, ఆర్సెనిక్‌, కాడ్మియమ్‌, ఎగ్జర్వెంట్‌ ఫోమియం వంటివి వాతావరణంలో చేరడం వల్ల మన ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం పడుతోంది.
  • ఏదైనా ఒక పాత్రలో సగం దాకా నీళ్లు పోసి పండ్లనుగానీ, కూరగాయలను గానీ దానిలో ఉంచి హైడ్రోజన్‌ ఫెరాక్సైడ్‌ ఒక చెంచా ద్రావణాన్ని వేసి ఒక 20 నిమిషాల పాటు అలా ఉంచండి. దీనివల్ల వాటిలో ఉండే 90 శాతం విషతుల్యాలు బయటికి వెళతాయి.
  • అన్నం వండడానికి ముందు బియ్యాన్ని శుభ్రపరచడంలో చాలా మంది సరియైున పధ్ధతి పాటించడం లేదు. పొయ్యి మీద పెట్టడానికి ముందు రెండు మూడు గంటల పాటు నీళ్లల్లో బియ్యాన్ని నానపెట్టాలి. అలా చెయ్యడం వల్ల బియ్యంలోని కల్తీ, కాలుష్యాలు తొలగుతాయి.
డాక్టర్‌ ప్రవీణ్‌ సక్సేనా

టాక్సికాలజిస్ట్‌
‘డాక్టర్‌ సక్సేనా సెంటర్‌ ఫర్‌ ప్రోగ్రెసివ్‌ మెడిసిన్‌’ 
బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list