MohanPublications Print Books Online store clik Here Devullu.com

దంతసిరికి సంరక్షణే సరి, Dental

దంతసిరికి సంరక్షణే సరి
Dental 

+++++++ దంతసిరికి సంరక్షణే సరి ++++++
మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అది దంతాల చలవే! దంతాలతో నమిలితేనే పదార్థం సులభంగా లోపలికి వెళుతుంది. కానీ దంతాల మీద మనకెప్పుడూ చిన్నచూపే! భరించలేనంత నొప్పి పుట్టినప్పుడో, దంతాలు పుచ్చిపోయినపుడో డెంటిస్ట్‌ని కలుస్తాం. సమస్య తీరగానే మర్చిపోతుంటాం. కానీ పాల దంతాలు వచ్చింది మొదలు అవి ఊడే వయసు వరకూ దంత సంరక్షణపై శ్రద్ధ అవసరమని అంటున్నారు దంత వైద్యనిపుణులు.....
దంతాల సమస్యలు వయసుల వారిగా మారుతూ ఉంటాయి. వయసుతోపాటు వచ్చే ఆరోగ్య సమస్యల్లాగే దంతాల విషయంలో కూడా రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అవేంటంటే...
పసి పిల్లల నుంచి టీనేజర్ల వరకూ
డెంటల్‌ చెకప్‌ అనేది పాల దంతాల వయసు నుంచే మొదలవ్వాలి. పాల దంతాలు ఊడిపోయేవే కాబట్టి చెకప్‌ ఎందుకు? అని అనుకుంటారు. కానీ ఈ దంతాలకు ఎలాంటి సమస్య వచ్చినా వాటి అడుగు నుంచి మొలకెత్తే శాశ్వత దంతాలు దెబ్బతింటాయి. కాబట్టి పాచి పేరుకుపోయినా, నల్లని మచ్చలు ఏర్పడినా వెంటనే పిల్లల్ని డెంటిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లాలి. అంతకంటేముందు దంతాల సమస్యలు తలెత్తకుండా పిల్లల చేత రోజుకి రెండుసార్లు బ్రష్‌ చేయిస్తూ ఉండాలి. దంతాలను బ్ర్‌షతో ఎలా తోమాలో నేర్పించాలి. ఒకవేళ స్కూల్‌కి వెళ్లే వయసులో కూడా పిల్లలు నోట్లో వేలు వేసుకునే అలవాటు మానుకోలేకపోతుంటే డెంటిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లాలి. అవసరమైనప్పుడు వాడేవి, ఫిక్స్‌డ్‌గా నోట్లోనే ఉండిపోయే రెండు రకాల పరికరాలు ఉంటాయి. థంబ్‌ సకింగ్‌ వల్ల పిల్లల ముందు పళ్లు క్రమం కోల్పోతాయి. దాంతో పళ్ల మధ్య గ్యాప్స్‌ ఏర్పడతాయి. ఫలితంగా భవిష్యత్తులో ఇర్రెగ్యులారిటీ, ఓపెన్‌ బైట్‌లాంటి సమస్యలు తలెత్తుతాయి. దంతాల నిర్మాణం ఎగుడుదిగుడుగా ఉంటుంది.
కొందరు పిల్లల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. దాంతో తిన్న పదార్థాలు దంతాల్లో ఇరుక్కుపోతుంటాయి. ఈ సమస్య ఉన్న పిల్లలకు పిట్‌ అండ్‌ ఫిషర్‌ సీలెంట్‌ వేస్తే సమస్య తొలిగిపోతుంది. అలాగే ఎలాంటి దంత చికిత్స చేసినా ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా డెంటల్‌ చెకప్‌ చేయించుకుంటూ ఉండాలి. కాబట్టి సమస్య ఉన్నా లేకపోయినా కనీసం ఏడాదికి ఒకసారైనా దంత వైద్యుల చేత చెకప్‌ చేయించుకుంటూ ఉండాలి. అలాగే భవిష్యత్తులో పళ్లు ఎత్తుగా వస్తాయనే అనుమానం ఉన్నా, దంతాల షేప్‌ యు కాకుండా వి షేప్‌లో ఉన్నా, రివర్స్‌ బైట్‌ సమస్య ఉన్నా పిల్లలకు పదేళ్ల వయసులోనే దంత వైద్యుల దగ్గరకు తీసుకెళితే సమస్యను సరిదిద్దే అవకాశం ఉంటుంది.
20 - 40 ఏళ్లు
ఙ్ఞాన దంతాలు, పిప్పి పళ్లు టీనేజర్స్‌ ఎదుర్కొనే ప్రధాన దంత సమస్యలు. క్యావిటీస్‌ ఫిల్‌ చేసి పిప్పిపళ్లను సరిదిద్దొచ్చు. ఒకవేళ పెయిన్‌ కూడా ఉండి తినటానికి ఇబ్బంది ఉంటే రూట్‌ కెనాల్‌తో పరిస్థితిని చక్కదిద్దవచ్చు. ఒకవేళ పన్నును కాపాడే పరిస్థితి లేకపోతే కృత్రిమ పన్ను బిగించవచ్చు. అయితే ఈ చికిత్స అంతా ఆ దంతాల మూలంగా మిగతా దంతాలు దెబ్బతినకముందే మొదలుపెట్టాలి. అలాగే నవ్వినప్పుడు చిగుళ్లు ఎక్కువగా కనిపిస్తున్నా టీనేజ్‌ వయసులోనే సరిచేయొచ్చు. ఇక దంతాల ఎలైన్‌మెంట్‌ కూడా ముఖ్యమే. ఎలైన్‌మెంట్‌ సరిగ్గా లేకపోతే బ్రషింగ్‌ సరిగ్గా చేయలేరు. దాంతో దంత సమస్యలు మొదలవుతాయి. కాబట్టి అవసరమనుకుంటే బ్రేసెస్‌ వేయించుకోవటానికి వెనకాడకూడదు. కొందరికి ముందరి పళ్లు కొన్ని చిన్నవిగా, కొన్ని పెద్దవిగా ఉంటాయి. ఇంకొందరిలో గ్యాప్స్‌ ఉంటాయి. ఇలాంటివాళ్లకు కూడా లామినేట్స్‌ వేసి సమస్యను సరిదిద్దవచ్చు. పై ఆరు దంతాలు, కింద ఆరు దంతాల ఆకారాన్ని సరిచేయటం కోసం స్మైలీ ఎన్‌హాన్సర్స్‌ అనే చికిత్స ఉపకరిస్తుంది.
40 - 60 ఏళ్లు
చిగుళ్ల వ్యాధులు ఈ వయసు వారిలోనే ఎక్కువ. చిగుళ్ల సమస్య ప్రారంభంలో ఉంటే సర్జరీ లేకుండానే సరిదిద్దొచ్చు. లేదంటే లేజర్‌తో చికిత్స చేయొచ్చు. ఒకవేళ బోన్‌ కోల్పోతే కృత్రిమ బోన్‌ బిగించి పలువరుసను సరిచేయవచ్చు. కిందపళ్లు పైన తగులుతుంటే ట్రామా కరెక్షన్‌ చేయొచ్చు. దంతాల మధ్య ఖాళీ ఏర్పడుతుంటే ఆ గ్యాప్‌ను సర్జరీతో ఆపొచ్చు. ఇంప్లాంట్స్‌ అమర్చొచ్చు.
60 ఏళ్లు పైబడితే?
దంతాలు ఊడిపోవటం, బోన్‌ అరిగిపోవటం ఈ వయస్కుల్లో కనిపించే ప్రధాన సమస్యలు. ఇలాంటివాళ్లకు డెంచర్స్‌, ఇంప్లాంట్స్‌ మంచి ఆప్షన్‌. ఇంతకుముందు దంతాలన్నీ ఊడిపోయినవాళ్లకి పెట్టుడు దంతాల సెట్‌ ఉండేది. దీన్ని అవసరమైనప్పుడు పెట్టుకుని లేనప్పుడు తీసేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఫిక్స్‌డ్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఇంప్లాంట్స్‌ బిగించి వాటి మీద శాశ్వతమైన దంతాలను ఫిక్స్‌ చేసుకోవచ్చు. ఒకవేళ దవడ ఎముక బలహీనంగా ఉంటే రెండు నుంచి నాలుగు విడి ఇంప్లాంట్స్‌ వేసి దంతాలు ఫిక్స్‌ చేయొచ్చు. బోన్‌ పూర్తిగా లాస్‌ అయితే జైగోమాటిక్‌ ఇంప్లాంట్స్‌ బిగించాల్సి ఉంటుంది.
కొన్ని టిప్స్‌
పాలదంతాలు ఊడి శాశ్వత దంతాలు వచ్చేవరకూ చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దలు వాడే పేస్ట్‌ వాడకూడదు. పిల్లల కోసం వెజిటెబుల్‌ ఆయిల్‌ ఉన్న టూతపే్‌స్ట మాత్రమే వాడాలి.
ఈ మధ్యకాలంలో సెన్సొడైన్‌ లాంటి మెడికేటెడ్‌ పేస్ట్‌ వాడకం ఎక్కువగా కనిపిస్తోంది. కానీ అది అవసరం లేదు. వైద్యులు సూచించినప్పుడు తప్ప మిగతా సమయంలో మామూలు పేస్ట్‌ ఏది వాడినా సరిపోతుంది.
రోజుకి రెండుసార్లు బ్రషింగ్‌ తప్పనిసరి.
ఆహారం తిన్న ప్రతిసారీ నీళ్లతో నోరు పుక్కిలించాలి.
దంతాలు శుభ్రం చేసుకునే వీలులేని సందర్భాల్లో మాత్రమే మౌతవాష్‌ వాడాలి.
పీచు పదార్థం ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
దంతాలు పూర్తిగా శుభ్రమవడానికి రెండు నిమిషాలు బ్రషింగ్‌ సరిపోతుంది.
హార్డ్‌ బ్రష్‌ వాడకం వల్ల ఎనామిల్‌ తొలగిపోతుంది. కాబట్టి సాఫ్ట్‌ బ్రష్‌ ఎంచుకోవాలి.
ప్రతి మూడు నెలలకు టూత బ్రష్‌ మారుస్తూ ఉండాలి.
దంతాలన్నీ రీప్లేస్‌ చేయించుకుని సెరామిక్‌ దంతాలు ఫిక్స్‌ చేయించుకున్నవాళ్లు హార్డ్‌ బ్రష్‌ మాత్రమే వాడాలి.
40 ఏళ్ల వయసుకి ఎనామిల్‌ తొలగిపోయి దంతాలు పసుపు రంగుకు మారతాయి. ఇలాంటప్పుడు తెల్లగా రావాలని మరీ గట్టిగా తోమకూడదు. అలా చేస్తే మిగిలి ఉన్న ఎనామిల్‌ కూడా లేచిపోతుంది. కాబట్టి తెల్లగా కావాలనుకంటే డెంటిస్ట్‌ చేత చికిత్స చేయించుకోవాలి.
గ్యాప్స్‌ ఎక్కువగా ఉన్నవాళ్లకి వేరే టూత బ్రష్‌లు ఉంటాయి. డెంటిస్ట్‌లు మాత్రమే వాటిని సూచిస్తారు.
ప్రతిరోజూ నాలుక గీసుకోవాల్సిందే! టేస్ట్‌ బడ్స్‌ తొలిగిపోతాయని భయపడాల్సిన పనిలేదు. అవి పోయినా కొత్తవి వస్తూనే ఉంటాయి కాబట్టి సున్నితంగా నాలుకను శుభ్రం చేసుకోవాలి.
ఎదుటివాళ్లు కనిపెట్టలేని ‘లేటెస్ట్‌ బ్రేసెస్‌’
దంతాలకు బ్రేసెస్‌ వేసుకుంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుందని చాలా మంది వాటిని వేయించుకోవటానికి వెనకాడుతూ ఉంటారు. కానీ పాతకాలపు లావుపాటి బ్రేసె్‌సకు బదులుగా పలుచగా, పారదర్శకంగా ఉండే లేటెస్ట్‌ బ్రేసెస్‌ ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. వీటిని బయటివైపునుంచే కాకుండా పళ్ల లోపలివైపు నుంచి కూడా వేసుకునే వీలుంటుంది. ఎదుటివాళ్లు కనిపెట్టే వీలులేనంత పారదర్శకంగా ఉండే బ్రేసెస్‌ ఉన్నాయి. బయటివైపు నుంచి వేసుకునే బ్రేసె్‌సను.. క్లియర్‌ ఎలైనర్స్‌ అంటారు. ఈ రకం బ్రేసెస్‌ వేసుకున్న తర్వాత ఆరు నెలల నుంచి సంవత్సరంపాటు డెంటి్‌స్టని కలవకపోయినా ఫర్వాలేదు. ఇక బ్రేసెస్‌ వేసుకున్నట్టు ఏమాత్రం తెలియకూడదనుకుంటే లింగువల్‌ ఆర్థోడాంటిక్స్‌ను ఎంచుకోవచ్చు. ఇవి దంతాల లోపలివైపు ఫిక్స్‌ చేస్తారు. అయితే ప్రతి నెల డెంటల్‌ చెకప్‌ తప్పనిసరి. ఇవేకాకుండా కన్వెన్షనల్‌ బ్రేసెస్‌ కూడా ఉంటాయి. వీటిలో స్టీల్‌తో తయారయ్యే ఇన్విజిబుల్‌ బ్రేసెస్‌, టూత్ కలర్డ్‌ బ్రేసెస్‌ ఉంటాయి.
- డాక్టర్‌ శ్రీనివాసరావు ఆకుల
డెంటల్‌ సర్జన్‌, పెరియోడాంటిస్ట్‌
కేర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---









No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list