MohanPublications Print Books Online store clik Here Devullu.com

ప్రొటీన్లను పొందండి proteins


   ప్రొటీన్లను పొందండి



శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చేవి ప్రొటీన్లు. కండరాలకు బలాన్ని అందించడంతో పాటు గుండె, మెదడు పనితీరును మెరుగుపర్చడంలో ప్రొటీన్లు కీలకపాత్ర పోషిస్తాయి. మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

మాంసం

మాంసాహారం మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు ఇట్టే దొరుకుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ప్రొటీన్లతో పాటు మాంసాహారంలో ఉండే ఐరన్‌, జింక్‌ లోహాలు రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి. 100 గ్రాముల మాంసంలో సుమారు 26 నుంచి 36 గ్రాముల ప్రొటీన్లు లభిస్తాయి.

చేపలు
విటమిన్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే మరో ఆహార పదార్థం చేపలు. వీటిలో ఆరోగ్యకరమైన ప్యాట్‌ కూడా ఉంటుంది. చేపల్లో సమృద్ధిగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌.. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయు. గుండెకు బలాన్ని చేకూరుస్తాయి. వందగ్రాముల చేపలు తీసుకుంటే సుమారు 25 నుంచి 35 గ్రాముల ప్రొటీన్లు అందుతాయి.

నట్స్‌
వేరుశెనగ కాయలు, బాదాం, కాజు, వాల్‌నట్స్‌లో ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. తగిన మోతాదులో వీటిని తీసుకుంటే శరీరంలోని అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. కండరాల దృఢత్వం పెరుగుతుంది. ప్రతి 28 గ్రాముల నట్స్‌లో ఉండే ప్రొటీన్లు..
  • వేరుశెనగ 7.3 గ్రా
  • బాదాం 5.9 గ్రా
  • కాజు 5.1 గ్రా
  • వాల్‌నట్స్‌ 4.3 గ్రా

పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు, వెన్న, నెయ్యి.. రుచికరమైన ఈ పదార్థాలు మన డైట్‌లో తప్పనిసరిగా ఉంటాయి. వీటిలో ప్రొటీన్‌ లెవల్స్‌ కూడా ఎక్కువే. రకరకాలైన విటమిన్లు, మినరల్స్‌ కూడా శరీరానికి అందుతాయి. పాల ఉత్పత్తుల ద్వారా లభ్యమయ్యే ప్రొటీన్లు ఒంటికి శక్తినివ్వడంతో పాటు ఇతర అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రొటీన్లు సమృద్ధిగా లభించే పాల ఉత్పత్తులు..
  • 70 గ్రాముల వెన్నలో 23.4 గ్రా
  • చిన్న కప్పు పెరుగులో 12.9 గ్రా
  • గ్లాసెడు పాలల్లో పాలు 7.9 గ్రా

ఇవే కాదు గుడ్లు, కూరగాయలు, పళ్లలో కూడా కావాల్సినంత ప్రొటీన్లు ఉంటాయి. ఈ బలవర్ధకమైన ఆహార పదార్థాలకు రెగ్యులర్‌ డైట్‌లో చోటిచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list