MohanPublications Print Books Online store clik Here Devullu.com

శిఖ యొక్క ప్రాముఖ్యత, Shikha Yokka Pramukyata

శిఖ యొక్క ప్రాముఖ్యత
Shikha Yokka Pramukyata

++++ శిఖ యొక్క ప్రాముఖ్యత ++++
సనాతన ధర్మంలో చరించు వారందరూ శిఖను విధిగా ఉంచుకోవాలి. శిఖా
పరిత్యాజముచే తానున్న వర్ణమునుండి ఛండాలుడను ఐదవ జాతికి జారిపడతాడు.
సంధ్యావందనం చేసేటప్పుడు కాని ఇతర మంత్రానుష్టానం చేసేటప్పుడు కానీ
అంగన్యాసంలో శిఖాయైవశట్ అన్నచోట శిఖను ముట్టుకోవాలి. అది లేకపోతే ఇక
అంగన్యాసం పరిపూర్ణమెలా అవుతుంది. ఒక వేళ ప్రమాదవశాత్తు
క్షురకర్మ చేయించుకునేటప్పుడు శిఖ తొలిగింపబడడం కానీ, లేదా జుట్టు
ఊడిపోయిన వారుకాని అనుష్టానం చేసేటప్పుడు ఒక దర్భను తలచుట్టూ చుట్టుకుని
శిఖలా భావించి అనుష్టానం సాగించాలి. సంధ్యావందనం చేసేవారు తప్పక శిఖ
ఉంచుకోవాలి. గాయత్రార్హత పొంది శిఖ, యజ్ఙోపవీతంలేనివాడు ఛండాలుడే.
శిఖలేనిదే వైదిక కర్మ ఆచరించినా వ్యర్థమని శాస్త్రవాక్కు. కాబట్టి శిఖ
ముఖ్యాతిముఖ్యము.
"గాయత్రాతు శిఖాం.............బద్ధ్వాతతః కర్మసమార భేత్''
అను ధర్మం ప్రకారం వైదిక కర్మ ప్రారంభమునకు ముందు శిఖను బంధించవలెను.
వేంకటాచల మహాత్మ్యం లోని ఉదంతం కూడా అదే చూపుతుంది. ఛండాల స్త్రీని
కోరుకున్నవాడు ఛండాలుడుగా మారడానికిగాను ఆ స్త్రీ చెప్పినట్టు శిఖా
పరిత్యాగం, యజ్ఙోపవీత పరిత్యాగం చేసి ఛండాలుడుగా మారుతాడు. అందుకే
శిఖలేకుండా సంపూర్ణ ముండనం చేయించుకోరాదు.
కనీసంలో కనీసం పన్నెండు కన్నా ఎక్కువ వెంట్రుకలను కూర్చి శిఖగా
పెట్టుకోవాలి. పెద్దగాలేకున్నా మామూలు జుట్టులో కలిసిపోతుంది. అందరూ శిఖ
ఉంచుకోవడం విధి, ఇప్పటి వరకూ ఎవరైనా అది ఉంచుకోక, ఇప్పటినుండి
ఉంచుకోవాలనుక్కున్నా చక్కగా ఉంచుకోవచ్చు. తెలియని తనాన్ని భగవంతుడు
క్షమిస్తాడు.
శిఖ యొక్క ప్రధాన్యత,వైద్యపరంగా వివరించబడింది.శరీరంలో మంత్ర-అనుష్టానలచేత గాని, అతి వాతము వలన కాని ప్రోగుపడిన అతిఎక్కువ విద్యుదావేశాన్ని బయటకు పంపే వొక యాన్తెన్నా/ఏరియల్ గా శిఖ పని చేస్తుంది .అంటే పరోక్షంగా శరీరంలో వీర్యకణాల ఉత్పత్తికికి అనువైన శారీరక ఉష్ణోగ్రతను శిఖ ఏర్పాటు చేస్తుంది. సాధారణంగా వేదం చదివే వారి వారి దేహ ఉష్ణోగ్రత కొంచం ఎక్కువగా ఉంటుంది. దీనిని సమతుల్యం చేయడానికే శిఖిని పెట్టుకోమన్నారు పెద్దలు.
చాగంటి వారు తమ ప్రవచానాల్లో శిఖ గురించి తెలియజేస్తూ బ్రాహ్మణులకి శిఖా సంస్కారం (పిలక) మరియు చేవిపోగులు ఖచ్చితంగా వుండాలి. ఎవరైనా బ్రాహ్మణులు శిఖ లేకుండా బ్రాహ్మణ వృత్తి చేస్తూ వుంటే, అతనికి తన వృత్తి పట్ల, దేవతల పట్ల నమ్మకం లేదు అని తెలుసుకోవాలి. అంతే కాకుండా, అతను సమాజాన్నీ, భక్తులనీ మోసం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. అతనిని గౌరవించవలసిన అవసరం లేదు. సంస్కారాలకి విలువ ఇవ్వనివాడు ఎంత చదువుకున్నా ప్రయోజనం లేదు.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list