MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆహారం, Food Tips



ఆహారం
Food Tips



పోషకాలు పోనివ్వని ‘మైక్రో’ వంటకం!
న ఆహార అలవాట్లే కాదు.. వండే పద్ధతులూ మారాయి. కట్టెలు, బొగ్గుల పొయ్యిల స్థానంలో గ్యాస్‌ స్టవ్‌లు వచ్చి చేరాయి. ఇప్పుడు చాలా ఇళ్లల్లో మైక్రోవేవ్‌ ఓవెన్‌లూ కనబడుతున్నాయి. వీటిల్లో ఎంత ఉష్ణోగ్రతలో, ఎంతసేపు వండాలో ముందుగానే సెట్‌ చేసుకుంటే వాటంతటవే వంటకాలు సిద్ధమవుతాయి. ఇది తేలికైన, సులభమైన, సురక్షితమైన పద్ధతి కావటంతో చాలామంది వీటిని బాగానే ఇష్టపడుతున్నారు. అయినప్పటికీ.. వీటి వాడకంపై కొన్ని అపోహలున్నాయి. మైక్రోవేవ్‌ ఓవెన్‌లో వండితే పోషకాలు తగ్గిపోతాయని, ఆరోగ్యానికి అంత మంచిది కాదని భావిస్తుంటారు. నిజంగా ఇవి హాని చేస్తాయా?
మైక్రోవేవ్‌ ఓవెన్‌ పనిచేసే తీరును తెలుసుకుంటే పోషకాలు తగ్గుతాయా.. లేదా? అనేది ఇట్టే అర్థమవుతుంది. మైక్రోవేవ్‌ ఓవెన్లు రేడియో తరంగాల వంటి శక్తి తరంగాల సాయంతో పదార్థాలు ఉడికేలా చేస్తాయి. ఈ తరంగాలు కొన్నింటి మీదనే.. ప్రధానంగా నీరు, ఒక చివర ధనావేశం మరో చివర రుణావేశం గల ఇతర అణువులను ఎంచుకొని పనిచేస్తాయి. అణువులను కంపించేలా చేసి, చాలా త్వరగా వేడిని పుట్టిస్తాయి. సాధారణంగా పదార్థాలు వేడికి గురైనప్పుడు వాటిల్లోని విటమిన్‌ సి, విటమిన్‌ బి 12 వంటి కొన్ని పోషకాలు తగ్గిపోతాయి. మైక్రోవేవ్‌ ఓవెన్‌తో ఇలాంటి అనర్థం తక్కువ. ఎందుకంటే ఇందులో పదార్థాలు త్వరగా వేడెక్కి, ఉడుకుతాయి. నీరు కూడా తక్కువ పడుతుంది. పదార్థాలు లోలోపలే ఆవిరి ద్వారా ఉడుకుతాయి. కాబట్టి పోషకాలు, ఖనిజాలు పెద్దగా తగ్గవు. కానీ మైక్రోవేవ్‌ ఓవెన్‌లో పదార్థం మొత్తం ఒకే స్థాయిలో వేడెక్కదు. దీంతో అతిగా వేడెక్కిన చోట పోషకాలు మరింత ఎక్కువగా విడివడతాయి. కాబట్టి పాత్రలపై మూత పెట్టి, విద్యుత్తును తక్కువ స్థాయిలో సెట్‌ చేసుకుంటే పదార్థాలు అతిగా వెడెక్కవు. అదే సమయంలో వేగంగా ఉడుకుతాయి కూడా. మైక్రోవేవ్‌ ఓవెన్‌లో ప్లాసిక్‌ పాత్రలను వాడటం మంచిది కాదని, పాస్టిక్‌లోని క్యాన్సర్‌ కారక డయాక్సిన్లు పదార్థాలకు చేరుకుంటాయని కొందరు భావిస్తుంటారు. నిజానికి చెత్త, ప్లాస్టిక్‌, లోహాలు, చెక్క వంటి వాటిని మండించినపుడు డయాక్సిన్లు విడుదలవుతుంటాయి. మైక్రోవేవ్‌ ఓవెన్‌లో పదార్థాలు మండిపోనంతవరకు డయాక్సిన్ల ప్రభావానికి గురయ్యే అవకాశం లేదు. ప్లాస్టిక్‌లోనూ రెండు రకాలున్నాయి. బీపీఏతో తయారుచేసినవి గట్టిగా, థాలేట్స్‌తో చేసినవి మృదువుగా ఉంటాయి. బీపీఏ, థాలేట్లు మన శరీరంలో హార్మోన్లను అస్తవ్యస్తం చేసే అవకాశముంది. కాబట్టి ప్లాస్టిక్‌ వాడకంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే మైక్రోవేవ్‌ ఓవెన్‌లో వాడుకోవటానికి సురక్షితమైన ప్లాస్టిక్‌ పాత్రలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటితో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ప్లాస్టిక్‌ పాత్రలపై అనుమానాలుంటే మైక్రోవేవ్‌ ఓవెన్‌లో వాడుకోవటానికి వీలైన గాజు, సిరమిక్‌ పాత్రలు ఉపయోగించొచ్చు. పాత్రలపై పరిచే ప్లాస్టిక్‌ పొరలు పదార్థాలకు అంటుకోకుండా చూసుకోవాలి. వేడికి మెత్తబడే నీళ్ల బాటిళ్లు, ప్లాస్టిక్‌ బుట్టలు, జగ్గులు, పాస్టిక్‌ బ్యాగుల వంటివి ఓవెన్‌లో పెట్టొదు. అలాగే పాత, గీతలు పడిన, పగిలిన, చాలాసార్లు ఓవెన్‌లో వాడిన పాస్లిక్‌ పాత్రలను ఉపయోగించొద్దు.

కంటికి ‘సీ’ రక్ష!
కంట్లోని కటకం పారదర్శకంగా ఉంటే చూపు స్పష్టంగా కనబడుతుంది. కానీ వృద్ధాప్యంలో ఈ కటకం మీద మందమైన పొర ఏర్పడి.. శుక్లాల సమస్యకు దారితీస్తుంది. దీంతో చూపు మందగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి దారితీస్తున్న కారణాల్లో ఇదే ప్రధానమైంది. సాధారణంగా వయసుతో పాటే శుక్లం ముప్పూ పెరుగుతుంది. అంతమాత్రాన వృద్ధాప్యంలో ఇది అనివార్యమనుకోవటానికి వీల్లేదు. పర్యావరణ అంశాలతోనూ ఈ సమస్య రావొచ్చు. కాబట్టి ఆహార అలవాట్లను మార్చుకోవటం.. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలతో కూడిన విటమిన్‌ సి అధికంగా గల పదార్థాలను తినటం ద్వారా త్వరగా దీన్ని ఆలస్యం చేసుకోవచ్చు.

పొద్దుటి గ్లూకోజు
సాధారణంగా సూర్యోదయ వేళ సమీపిస్తున్నకొద్దీ మన శరీరం నిద్ర నుంచి మేలుకోవటానికి సన్నద్ధమవుతూ వస్తుంది. ఈ క్రమంలో కొన్నిరకాల హార్మోన్లు పెద్దమొత్తంలో విడుదలవుతాయి. ఇవి ఇన్సులిన్‌ పనితీరును అడ్డుకోవటం వల్ల రక్తంలో స్వల్పంగా గ్లూకోజు స్థాయులూ పెరుగుతుంటాయి. దీన్నే ‘సూర్యోదయ గ్లూకోజు సమస్య’ (డాన్‌ ఫెనామినా) అంటారు. నిజానికి చాలామందిలో ఇదేమీ హాని కలిగించదు. అయితే మధుమేహులకు మాత్రం సవాలుగా పరిణమిస్తుంది. ఎందుకంటే వీరిలో రాత్రిపూట సహజంగా ఇన్సులిన్‌ మార్పులను సరిదిద్దే సామర్థ్యం కొరవడుతుంది. దీంతో ఉదయం వేళల్లో గ్లూకోజు స్థాయులు నిరంతరం ఎక్కువగా ఉంటుంటాయి. రాత్రి 2 లేదా 3 గంటల సమయంలో వరుసగా కొన్ని రోజుల పాటు గ్లూకోజు స్థాయులను పరీక్షించుకోవటం ద్వారా దీన్ని గుర్తించొచ్చు. గ్లూకోజు ఎక్కువగా ఉంటుంటే రాత్రి భోజనాన్ని కాస్త ముందుగానే ముగించాలి. పడుకునే సమయంలో చిరుతిళ్లు తినటం మానెయ్యాలి. గ్లూకోజు స్థాయులు ఎక్కువగా ఉంటూ.. చెమట పట్టటం, ఆకలి పెరగటం, తల తేలికగా అనిపించటం, వణుకు లేదా ఆందోళన వంటి లక్షణాలు కూడా కనబడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఛాతీ మంట వద్దు
ఛాతీలో మంట బారినపడొద్దని అనుకుంటున్నారా? అయితే భోజనం చేసిన తర్వాత 2-3 గంటలయ్యాకే నిద్రకు ఉపక్రమించండి. అన్నవాహిక కిందిభాగంలోని కండరవలయాన్ని నికొటిన్‌ వదులయ్యేలా చేసి, జీర్ణరసాలు పైకి ఎగదన్నుకొని వచ్చేలా చేస్తుంది. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టలు మానెయ్యండి.

కెఫిన్‌ ఎక్కువైతే గుండె వేగం పెరగొచ్చు
*  సిరోసిస్‌ బాధితులు కెఫీన్‌ ఎక్కువగా తీసుకుంటే కొందరిలో గుండె వేగం పెరగొచ్చు. గుండె లయ తప్పొచ్చు. కాబట్టి కాఫీ మితంగానే తీసుకోవాలి.

ఆందోళనకు ఆహార కళ్లెం!
ఆందోళన మానసికంగా దెబ్బతీయటమే కాదు. రకరకాల జబ్బులనూ మోసుకొస్తుంది. కాబట్టి దీని లక్షణాలను గుర్తించి త్వరగా చికిత్స తీసుకోవటం మంచిది. ఆహారంతోనూ దీనికి కళ్లెం వేయొచ్చు.
మెగ్నీషియం తక్కువగా గల ఆహారంతో ఆందోళన సంబంధ ప్రవర్తన పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మెగ్నీషియంతో కూడిన పాలకూర, పప్పులు, గింజ పప్పులు, విత్తనాలు, పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తినాలి.
జీడిపప్పు, కాలేయం, గుడ్డు పచ్చసొన వంటి వాటిల్లోని జింక్‌ కూడా ఆందోళన తగ్గటానికి తోడ్పడుతుంది.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గల చేపలు సైతం ఆందోళన తగ్గిస్తాయి.
పెరుగు వంటి ప్రొబయోటిక్‌ పదార్థాలు నలుగురిలోకి వెళ్లినపుడు తలెత్తే ఆందోళన లక్షణాలను తగ్గిస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఆకుకూరలు, పొట్టుతీయని ధాన్యాలు, పచ్చబఠానీలు, వేరుశనగలు, బాదంపప్పు, చికెన్‌ వంటి వాటిల్లోని బి విటమిన్లు మానసికోల్లాసాన్ని కలిగించే సెరటోనిన్‌, డొపమైన్ల ఉత్పత్తిని పెంచుతాయి.

‘క్యాల్షియం’ పండు! 
రింత క్యాల్షియం తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మరో గ్లాసు పాల కన్నా అత్తిపండ్లు (ఫిగ్స్‌) తిని చూడండి. ఒక కప్పు ఎండు అత్తిపండ్లతో పాలతో సమానంగా క్యాల్షియం లభిస్తుంది. పైగా వీటిల్లో పీచు కూడా దండిగా ఉంటుంది. అలాగని మరీ ఎక్కువగా లాగించేయకండి. ఎందుకంటే వీటిల్లో చక్కెర, కేలరీలు కూడా దండిగా ఉంటాయి.
pandumirapa bhaktipustakalu karam




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list