శరీరంపై ఎండ తగలకపోతే అంతే సంగతులు..
బరువు అమాంతంగా పెరుగుతారట!
శరీరంపై ఎండ తగలకపోతే అంతే సంగతులు..
బరువు అమాంతంగా పెరుగుతారట!
బరువు అమాంతంగా పెరుగుతారట!
సూర్యుడు జీవశక్తికి నిధినిక్షేపం. అందుకే సూర్యకాంతికి దూరమైనవారు తేజో హీనులు, రోగగ్రస్తులవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన శరీరం మీద ఎంత ఎండ పడుతుందో అంత ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ సూర్యరశ్మి శరీరంపై పడకపోతే మాత్రం బరువు అమాంతంగా పెరుగుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆధునిక జీవన శైలి కారణంగా ఎండ ముఖమెరుగని వ్యక్తులూ.. సూర్యోదయాన్ని చూసే అదృష్టం లేని జనం ఈ మధ్య ఎక్కువైపోతున్నారు. నైట్ డ్యూటీ చేసి వచ్చి లేటుగా లేస్తే, బయటకు వెళ్లే అవసరం వారానికి ఒక సారి వస్తుందేమో. ఆ వెళ్లేది కూడా కార్లోనో.. ఆటోలోనో లేదా బస్‌లోనో అనుకోండి.. ఇక శరీరానికి ఎండ తగిలే చాన్సే లేదు. దీంతో ఎండ తగలక శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి కాక జబ్బులకు గురవుతున్న వారూ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా మధ్య వయసులోని స్త్రీ పురుషులకు ఈ సమస్య ఎక్కువగా ఉంది. విటమిన్ డి లోపానికి చెక్ పెట్టాలంటే.. సూర్యరశ్మి చర్మంపై పడేలా చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
శరీరంలో సరిపడా విటమిన్ డి ఉన్నట్లైతే అది కొన్ని ప్రమాదకరమైన జబ్బులు అంటే హార్ట్ డిసీజ్, క్యాన్సర్ వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఇంకా నేచురల్ విటమిన్ డి ని సన్‌లైట్ నుండి పొందవచ్చు. విటమిన్ డి లోపం వల్ల పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేటు గ్రంధి క్యాన్సర్, క్లోమం క్యాన్సర్ల ముప్పు పెరుగుతోందని పలు అధ్యయనాలు తేల్చిన నేపథ్యంలో శరీరంలో విటమిన్ డి స్థాయిలు సంపూర్ణంగా ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF ఫైల్ పొందవచ్చును
---LIKE US TO FOLLOW:
---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565