MohanPublications Print Books Online store clik Here Devullu.com
అల్జీమర్సా? మతిమరుపా?
Memory Loss
దో పెద్ద సంకటం. వయసు మీద పడుతున్నకొద్దీ ఎంతో కొంత మతిమరుపు సహజం. తాళం చెవులు ఎక్కడో పెట్టి మర్చిపోవటం, స్నేహితుల పేర్లు కూడా చిటుక్కున గుర్తుకురాకపోవటం వంటివి తరచూ ఎదురయ్యే అనుభవాలే. ఎప్పుడన్నా ఒకసారి ఇలా జరుగుతుంటే ఆందోళన అవసరం లేదుగానీ.. తరచూ మర్చిపోతూ, అది దైనందిన జీవితాన్ని కూడా ఇబ్బందిపెట్టే స్థాయికి చేరితే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఈ లక్షణాలు ‘అల్జీమర్స్‌’ అనే మెదడు సమస్యకు సూచికలు కావొచ్చు. ఇది క్రమేపీ జ్ఞాపకశక్తిని, ఆలోచనా నైపుణ్యాలను హరించివేసే తీవ్రమైన సమస్య. మరి సాధారణ మతిమరుపు, అల్జీమర్స్‌ల మధ్య తేడాలను గుర్తించటమెలా? దీనికి కొన్ని తేలికపాటి సంకేతాలున్నాయి.

మతిమరుపు
అల్జీమర్స్‌ ప్రధాన లక్షణం మతిమరుపు. ముఖ్యంగా ఇటీవల నేర్చుకున్న విషయాలు గుర్తుకురావు. తేదీలు, ఘటనలు మర్చిపోవటం, అడిగిన దాన్నే మళ్లీ మళ్లీ అడుగుతుండటం; ఏదైనా గుర్తు పెట్టుకోవటానికి నోట్స్‌ వంటి వాటిపై ఆధారపడటం; బాగా పరిచయమైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను కూడా సరిగా వాడలేకపోతుండటం వంటివీ కనబడతాయి.
పెద్దవయసులో తరచూ పేర్లు, ఇతరత్రా విషయాలను మర్చిపోవటం సహజమేగానీ అవి ఆ తర్వాత గుర్తుకొస్తుంటాయి.

ప్రణాళిక లోపం
అంకెలతో కూడిన పనుల్లో ఇబ్బంది అల్జీమర్స్‌ మరో లక్షణం. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో పొరబడుతుంటారు. బాగా తెలిసిన వంటకాలను చేయటంలో లేదా నెలవారీ బిల్లులను చెల్లించటంలో ఇబ్బందులు పడతారు. ఏకాగ్రత లోపిస్తుంది. గతంలో తేలికగా చేసిన పనులనే చాలా ఆలస్యంగా చేస్తుంటారు.
చెక్‌బుక్‌ను సరిచూసుకోవటం వంటి పనుల్లో ఎప్పుడన్నా తప్పులు జరగటం ఎవరికైనా సహజం.

చూసేది అర్థం కాదు
కొందరిలో దృష్టి సమస్యలు అల్జీమర్స్‌కు సూచిక కావొచ్చు. చదవటంలో, రాయటంలో, దూరాన్ని నిర్ణయించుకోవటంలో, రంగులను గుర్తించటంలోనూ పొరపడుతుంటారు. దీనివల్ల వాహనాలను నడపటం ఇబ్బందికరంగా కూడా పరిణమిస్తుంది.
సాధారణ ఆరోగ్యవంతుల్లో వయసుతో పాటు కంటిలో శుక్లాల వంటివి తలెత్తి, దృష్టి సమస్యలు రావచ్చుగానీ సరైన చికిత్సతో వీటిని అధిగమించొచ్చు.

స్థానాలు మార్చేస్తుండటం
అల్జీమర్స్‌ బారినపడిన వారు వస్తువుల స్థానాలు మర్చిపోతుంటారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఒకచోట తీసిన వస్తువులు మరో చోట పెట్టేస్తుంటారు. మళ్లీ అవి దొరక్క విపరీతంగా వెతుకులాడుతుంటారు. కొన్నిసార్లు ఆయా వస్తువులు పోయాయని భయపడటం, ఎవరో తీసేశారని ఇతరులను నిందించటం వంటివీ కనబడుతుంటాయి.
సాధారణ ఆరోగ్యవంతులు వస్తువులను వేరేచోట పెట్టినా తిరిగి వాటిని ఎక్కడ పెట్టారో గుర్తుకు తెచ్చుకోగలుగుతారు.

పనులు కావు
అల్జీమర్స్‌ బాధితులకు రోజువారీ పనులను పూర్తి చేయటం కష్టంగా అనిపిస్తుంది. బాగా తెలిసిన ప్రాంతాల్లో వాహనాలు నడపటానికీ ఇబ్బంది పడుతుంటారు. ఇష్టమైన ఆటల్లో నిబంధనల వంటివీ గుర్తుకురావు.
క్లిష్టమైన పనుల్లో అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ల సహాయం తీసుకోవటం మామూలు వ్యక్తుల్లో కనబడుతుంది.

తేదీల్లో తికమక
తేదీలను, గంటలను, ప్రాంతాలను గుర్తించటంలో అల్జీమర్స్‌ బాధితులు తికమక పడుతుంటారు. కొన్నిసార్లు తాము ఎక్కడున్నామో, అక్కడికి ఎలా వచ్చామో అనేదీ మరచిపోతుంటారు.
వయసు మీద పడుతున్నకొద్దీ అప్పుడప్పుడు వారాల విషయంలో తికమకపడొచ్చుగానీ మళ్లీ ఆ తర్వాత సర్దుకుంటారు.

పనిపై ఆసక్తి తగ్గటం
అల్జీమర్స్‌ బాధితులకు పనిపై శ్రద్ధ, ఆసక్తి తగ్గుతాయి. ఒకప్పుడు ఎంతో ఇష్టంగా చేసిన సామాజిక కార్యక్రమాలు, అభిరుచుల వంటివాటిపైనా ఆసక్తి కొరవడుతుంది. దీనివల్ల నలుగురితో కలవటానికీ ఇష్టపడరు.
మామూలు వ్యక్తుల్లో ఇలాంటివి చాలా అరుదు.

సంభాషణ సాగదు
సంభాషణ కొనసాగించటంలో అల్జీమర్స్‌ బాధితులు ఇబ్బంది పడుతుంటారు. పదాలు తట్టక, హఠాత్తుగా మధ్యలోనే ఆగిపోతుంటారు. ఒకదాని బదులు మరో పేరు చెబుతుంటారు.
వృద్ధాప్యంలో ఎప్పుడైనా పదాలు మరచిపోవటం కనబడేదేగానీ ఇది ఇబ్బందిపెట్టేంతగా ఉండదు.

భావోద్వేగ మార్పులు
మానసిక స్థితి, గుణగణాల్లోనూ మార్పులు తలెత్తటం అల్జీమర్స్‌ లక్షణం. తరచుగా అనుమానపడటం, కుంగిపోవటం, ఆందోళన లేదా భయం, తికమకపడటం వంటివీ తలెత్తుతాయి. చీటికీ మాటికీ నిరుత్సాహానికి లోనవుతుంటారు.
తరచుగా చేసే పనులే అయినా సరిగా సాగకపోవటం వంటి సందర్భాల్లో చికాకు పడటం సాధారణ ఆరోగ్యవంతుల్లోనూ చూస్తాంగానీ ఇది నిత్యకృత్యంగా ఉండదు. 
మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list