MohanPublications Print Books Online store clik Here Devullu.com

అక్షింతలే ఎందుకంటే...Aksintalu, Baby, అక్షింతలు, శిశువు


అక్షింతలే ఎందుకంటే...

    సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్భంలోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఏమిటి సంబంధం? అక్షింతలే ఎందుకు చల్లాలి, పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు. మంత్రం అంటే క్షయం లేనటువంటిది.

   అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.#అక్షింతలే_ఎందుకంటే..

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list