MohanPublications Print Books Online store clik Here Devullu.com

గడపకు పసుపు రాసి బొట్టు పెడితే..?Custom, threshold, ఆచారం, గడప


గడపకు పసుపు రాసి బొట్టు పెడితే..?

వారానికి ఒకసారి ప్రధాన ద్వారపు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం చాలా మంచిది. లేదంటే కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం లక్ష్మీప్రదం. దుష్టశక్తులు ఇంటిలోనికి రావు. శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపకు పైన నల్లటి తాడుతో పటిక కడితే దృష్టి దోషం తొలగిపోతుంది. పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టడం ఇంటికి సౌభాగ్యాన్నిస్తుంది. అలాగే ఇంట్లో వారానికి ఒకసారి శుక్రవారం పూట లేదంటే, శని, గురువారాల్లో తప్పకుండా దీపారాధన చేయాలి. ప్రతిరోజూ చేస్తే మంచిది. పూజ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా, పవిత్రంగా వుంచుకోవాలి.
స్నానం చేయకుండా, అపరిశుభ్రమైన దుస్తులతో కాళ్లు కడుక్కోకుండా పూజగదిని తెరవ రాదు. దేవుళ్ల ప్రతిమలను తాకరాదు. దీపారాధన చేసిన తర్వాత దేవుళ్ల ప్రతిమలకు లేదా పటాలకు పూలు అలంకరించాలి. పూజ గది ఎంత కళకళలాడితే అంతగా మన జీవితాలు కళకళలాడుతాయని పండితులు చెప్తున్నారు. వీలైనంతవరకు రెండు లేదా మూడు పటాలను మాత్రమే పూజ గదిలో ఉంచాలి. అంతేకానీ, సన్నిహితులు, బంధువులు ఇచ్చిన చిన్న దేవుళ్ళ ఫోటోలతో పూజామందిరాన్ని నింపడం మంచిది కాదని పెద్దల మాట.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list