MohanPublications Print Books Online store clik Here Devullu.com

సూపర్‌ స్ట్రీట్‌ కార్న్‌-Super Sweet Corn

సూపర్‌ స్ట్రీట్‌ కార్న్‌
స్వీట్‌ కార్న్‌ను ఉడకబెట్టి తింటాం, లేదంటే కాల్చుకుని తింటాం. ఈ రెండు
పద్ధతులతో బోరు కొట్టేసి ఇక వాటి జోలికి వెళ్లటమే మానుకున్నారా? విలువైన పోషకాలుండే మొక్కజొన్నను మరీ అంతలా నిర్లక్ష్యం చేయకండి. ఇవిగో ఈ వెరైటీ రెసిపీలు ట్రై చేసి స్వీట్‌ కార్న్‌ వెరైటీ రుచుల్ని ఆస్వాదించండి.
కార్న్‌ చాట్‌
(తయారీ సమయం - 20 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
కార్న్‌ - ఒకటిన్నర కప్పు
ఉల్లి ముక్కలు - అర కప్పు
టమాటా ముక్కలు - రెండు టేబుల్‌ స్పూన్లు
కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు
నిమ్మరసం - 1 టీ స్పూను
చాట్‌ మసాలా - కొద్దిగా
బ్లాక్‌ సాల్ట్‌ - సరిపడా
కారం - పావు టీ స్పూను
అలంకరణకు: కొత్తిమీర తరుగు బూందీ
తయారీ విధానం:
కార్న్‌ ఉడికించి పక్కనుంచాలి.
కార్న్‌కు పైన చెప్పిన పదార్థాలన్నీ జోడించి బాగా కలపాలి.
రుచి చూసి అవసరమైతే ఉప్పు, చాట్‌ మసాలా మరికొంత కలపాలి.
సర్వ్‌ చేసేముందు కొత్తిమీర, బూందీ పైన చల్లాలి.
కార్న్‌ చీజ్‌ బాల్స్‌
(తయారీ సమయం - 30 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
బంగాళాదుంపలు - 150 గ్రాములు
కార్న్‌ - 1 కప్పు
చీజ్‌ - 50 గ్రాములు
మిరియాల పొడి - అర టీస్పూను
ఆరిగానో - అర టీస్పూను
వెల్లుల్లి పేస్ట్‌ - అర టీస్పూను
మైదా - 4 టేబుల్‌ స్పూన్లు
తులసి ఆకులు - 4
ఉప్పు - తగినంత
తయారీ విధానం:
కార్న్‌ను ఉడకబెట్టి ఉంచుకోవాలి.
బంగాళాదుంపలు ఉడకబెట్టి, చల్లారిన తర్వాత మెత్తగా పిసుక్కోవాలి.
దీనికి కార్న్‌ చేర్చి కలపాలి.
చీజ్‌, వెల్లుల్లి పేస్ట్‌, మిరియాల పొడి, ఉప్పు, ఆరిగానో కూడా చేర్చి బాగా కలపాలి.
చివర్లో తులసి ఆకులను తరిగి వేసి కలపాలి.
మైదా కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమంతో చిన్న ఉండలు చేసుకోవాలి.
బాండీలో నూనె వేడి చేసి కార్న్‌ ఉండల్ని వేసి ఎర్రగా వేయించుకోవాలి.
మీడియం మంట మీద అన్ని వైపులా సమంగా కాలేలా వేయించుకోవాలి.
తర్వాత వీటిని కిచెన్‌ పేపర్‌ మీద వేసి నూనె వదలిన తర్వాత గిన్నెలో వేసుకోవాలి.
టమాటో కెచప్‌, కొత్తిమీర చట్నీతో వేడిగా సర్వ్‌ చేయాలి.
కార్న్‌ పకోడీ
(తయారీ సమయం - 30 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
స్వీట్‌ కార్న్‌ - ఒకటిన్నర కప్పు
సెనగపిండి - ఒకటిన్నర కప్పు
ఉల్లి కాడల తరుగు - పావు కప్పు
పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను
అల్లం తరుగు - 1 టీ స్పూను
కారం - పావు టీ స్పూను
పసుపు - పావు టీ స్పూను
గరం మసాలా - పావు టీ స్పూను
ఇంగువ - చిటికెడు
మిరియాల పొడి - పావు టీ స్పూను
ఉప్పు, నీరు - తగినంత
చాట్‌ మసాలా - కొద్దిగా
నూనె - వేపుడుకు సరిపడా
తయారీ విధానం:
కార్న్‌ను ఉడికించి చల్లారనివ్వాలి.
ఒక గిన్నెలో నూనె, చాట్‌ మసాలా మినహా పైన చెప్పిన పదార్థాలన్నీ వేసుకోవాలి.
నీళ్లు చేర్చి జారుడుగా కలుపుకోవాలి.
బాండీలో నూనె వేడిచేసి పిండి వేసుకుని వేయించుకోవాలి.
బంగారు రంగులో, కరకరమనేలా తయారయ్యాక పకోడీని తీసి టిష్యూ పేపర్‌ మీద వేసుకోవాలి.
వేడిగా గ్రీన్‌ చట్నీ, టమాటో సాస్‌తో సర్వ్‌ చేయాలి.
సర్వ్‌ చేసేముందు పైన చాట్‌ మసాలా చల్లాలి.
స్వీట్‌ కార్న్‌ సలాడ్‌
(తయారీ సమయం -30 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
కార్న్‌ - 400 గ్రా
ఉల్లి ముక్కలు - అర కప్పు
కీరా ముక్కలు - అర కప్పు
కారం - పావు టీస్పూను
కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను
నిమ్మరసం - అర టీస్పూను
ఉప్పు - తగినంత
తయారీ విధానం:
కార్న్‌కు ఒకటిన్నర కప్పు నీరు చేర్చి ఆవిరి మీద మెత్తబడేవరకూ ఉడికించాలి. ప్రెషర్‌ కుక్కర్‌ లేదా ఎలక్ట్రిక్‌ కుక్కర్‌లో ఉడికించుకోవచ్చు.
ఉడికిన కార్న్‌ను చల్లారనివ్వాలి.
వీటిని ఓ గిన్నెలో వేసి ఉల్లి ముక్కలు, కీరా ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి.
తర్వాత నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిసేలా తిప్పాలి.
వెంటనే సర్వ్‌ చేయాలి.
స్వీట్‌ కార్న్‌ పాయసం
(తయారీ సమయం - 40 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
కార్న్‌ - 1 కప్పు
పాలు - 2 టేబుల్‌ స్పూన్లు (కార్న్‌ను నూరటానికి)
పాలు - 2 కప్పులు
యాలకుల పొడి - అర టీ స్పూను
నెయ్యి - 1 టేబుల్‌ స్పూను
చక్కెర - 4 టేబుల్‌ స్పూన్లు
పిస్తా పప్పు - 1 టేబుల్‌ స్పూను
కుంకుమ పువ్వు - చిటికెడు
తయారీ విధానం:
కార్న్‌కు పాలు చేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
బాండీలో నెయ్యి వేడి చేసి ఈ కార్న్‌ పేస్ట్‌ను 5 నిమిషాలపాటు వేయించుకోవాలి.
తర్వాత రెండు కప్పుల పాలు చేర్చి మళ్లీ మరికొద్ది సేపు వేయించాలి.
చిన్న మంట మీద 10 నిమిషాలపాటు ఉడికించాలి.
తర్వాత చక్కెర వేసి కరిగేదాకా కలపాలి.
కుంకుమ పువ్వును 2 టీస్పూన్ల పాలలో వేసి కలిపి ఉంచుకోవాలి.
పాయసం అడుగంటకుండా చిక్కబడేవరకూ కలుపుతూ ఉడికించాలి.
నెయ్యి పైకి తేలుతున్నప్పుడు మంట తీసి తరిగిన పిస్తా చల్లి వేడిగా సర్వ్‌ చేయాలి.


1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list