మరణ దేవుడు యముడు
మనమందరం అమరులం కాదని తెలుసు. అలాగే మనం ఏదో ఒక రోజు మరణిస్తామని కూడా తెలుసు. మరణం యొక్క గడియారం అనేది ఒక గొప్ప రాజు లేదా ఒక బిచ్చగాడు ఇద్దరికి సమానంగా ఉంటుంది. మరణం అనే విషయానికి వచ్చినప్పుడు అందరూ దాని గురించి మరింత తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ చర్చ చాలా ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. మరణం యొక్క దేవుడు యముడు యముడు లేదా యమధర్మరాజు నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. యముడు దక్షిణ దిశకు అధిపతి. యముని పాశమును కాలపాశము అని పిలుస్తారు. యముని వాహనము దున్నపోతు. యముని నగరమును యమపురి, నరకము అంటారు. యముని వద్ద కొలువు కూటములో పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు. యముడు ధర్మానుసారం సమయమాసన్నమైనపుడు జీవుల ప్రణాలను హరిస్తాడని చెబుతారు. యముని చెంత ఏ విధమైన పక్షపాతానికి, అధర్మానికి స్థానం ఉండదు. యముని నియమాలు కఠోరమైనవి. కనుకనే దండించేవారిలో తాను యముడనని శ్రీకృష్ణుడు భగవద్గీత, విభూతి యోగంలో చెప్పాడు. పుణ్యాత్ములైన జీవులకు యముడు సహజంగా సౌమ్యంగానే కనపడతాడని చెబుతారు. పాఫులకు మాత్రం భయంకరమైన రూపంతో, రక్త నేత్రాలతో, మెఱుపులు చిమ్మే నాలుకతో, నిక్కబొడుచుకొన్న వెండ్రుకలతో చేతిలో కాలదండం ధరించి కనబడతాడు (స్కంద పురాణము, కాశీ ఖండము - 8/55,56). యముడు గొప్ప జ్ఞాని. భగవద్భక్తుడు. నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము). భూలోకంలో మొట్టమొదట మరణము పొంది, పరలోకమునకు వెళ్లిన వాడే యముడు. పురాతన గ్రంధముల ప్రకారం, మరణం మరియు ఆత్మ గురించి రహస్యాలను యముడు బిడ్డ నచికేతుడికి మరియు యముడికి మధ్య చర్చలు చేయబడ్డాయి. ఇక్కడ నచికేతుడికి మరణం గురించి యముడు మరణం యొక్క కొన్ని రహస్యాలను బహిర్గతం చేసారు.
మొదటివరం: మీ దగ్గర నుండి మళ్ళీ నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళగానే నా తండ్రి ఎటువంటి అనుమానం కలగకుండా ఇంట్లోకి ఆహ్వానించాలి. అలాగే మా తండ్రి చేసిన పాపాలు తొలగిపోవాలి. సరే అని వరమిచ్చాడు యముడు.
రెండవవరం: స్వర్గప్రాప్తి పొందడానికి ఎలాంటి యాగం చేయాలి. ఎలా చేయాలో చూపించమని కోరాడు.
మూడవవరం: మరణం తర్వాత మనిషి జీవితం ఎలా ఉంటుంది, ఏమవుతుంది, బ్రహ్మజ్ఞానం గురించి చెప్పమన్నాడు.
అది కూడా చెప్పాడు. ఈ యాగానికి నాచికేత యాగం పేరు వస్తుందని యముడు బదులిచ్చాడు.
అది రహస్య విషయం కావడంతో యముడు చెప్పడానికి నిరాకరించాడు. చెప్పడం ఇష్టంలేని యముడు కానుకలు ఇస్తానని చెప్పాడు. అయితే నచికేతుడు ఆ నిజం తెలుసుకోవాలని కోరడంతో యముడు బ్రహ్మజ్ఞానం గురించి ఉపదేశించాడు. అలా యముడు నుండి బాల్యంలోనే మూడు గొప్ప వరాలు పొంది, తన తండ్రి పాపాలను తొలగించాడు. యముడు వద్ద నుండి ఇంటికి వచ్చిన సాదరంగా ఆహ్వానించాడు నచికేతుడు తండ్రి వాజశ్రవుడు.
స్వామి పరిపూర్ణానంద సరస్వతి
స్వామి పరిపూర్ణానంద సరస్వతి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565