ఆశీర్వచనాలు ఫలిస్తాయా?
భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్థులను విద్యాప్రాప్తిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ అనీ... ఇలా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో పండితులు సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు. అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా? అవి ఫలిస్తాయా? అంటే ఫలిస్తాయి. సత్పథంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి.
ఈ ఆశీర్వచనాల వల్ల జాతక దోషాలు, మృత్యుగండాలు తొలుగుతాయి. గురువులు, సిద్ధులు, యోగులు, వేద పండితులు మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు – వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి. మార్కండేయుడు అల్పాయుష్కుడని తెలిసిన తలిదండ్రులు అతడికి పెద్దలు ఎవరు ఎదురైనా వారికి పాదనమస్కారం చేయమని చెప్పారు. మార్కండేయుడు అలాగే చేసి, దీర్ఘాయుష్మాన్ భవ అనే ఆశీర్వాద బలంతోనే చిరంజీవి అయ్యాడు.#ఆశీర్వచనాలు_ఫలిస్తాయా?
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565