అనుభవించక తప్పదు
‘ఓ రాజశ్రేష్ఠుడా! నీవు ప్రసిద్ధమైన ఇక్షాకు వంశంలో జన్మించావ్ఞ. నీమాటలు నీవంశ ప్రతిష్ఠకు తగినట్లే ఉన్నాయి. నీవ్ఞ ఎల్లప్ఞ్పడూ వశిష్ఠుని ఉపదేశాలను పొందుతూ ఉండటం వలన నీవ్ఞ పలికిన వినయ పూర్వకమైన మాటలన్నీ సబబుగానే ఉన్నాయి.రాజా! నేనొక సిద్ధికోసం ఒక యాగం తలపెట్టాను.ఆ యాగ నియమం ప్రకారం నేను కోపాన్ని పూర్తిగా విడవ వలసి ఉన్నది ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ ఎవరికీ శాపమీయరాదు.నేను శాపమీయలేనన్న ధైర్యంతో కామరూప్ఞలైన మారీచ సుభాహవ్ఞలనే రాక్షసులు నా యాగాన్ని విఘ్నాలు కల్పిస్తున్నారు. అని విశ్వామిత్రుడు ధశరథునికి చెప్పాడు.(ప్ఞట-29-బాలకాండము, 19వ సర్గ-శ్రీమద్రామాయణము) యాగ రక్షణ కొరకు శ్రీరాముడిని పంపమని కోరాడు. అపుడు దశరథుడు విశ్వామిత్రునితో ‘ఓ మునిశ్రేష్ఠా! పద్మముల వంటి కన్నులు కలిగిన నా రామునికి పదునారు సంవత్సరాలైనా నిండలేదు, పసి బాలుడు.. అరవైవేల సంవత్సరాల పుత్రసంతానము లేని వాడనై పుత్రకామేష్టి యాగం చేసి ఈరామున్ని పొందాను.
నా స్థితిగతులను మనుసులో ఉంచుకొని రాముని మీతో పంపమని కోరవద్దు అని చెప్పాడు. ఆ తర్వాత వశిష్ఠుతడు నచ్చచెప్పడంతో రామ లక్ష్మణులను యాగ రక్షణకుగాను విశ్వామిత్రుని వెంట పంపాడు. ఆ తర్వాత యాగం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకెళ్ళాడు. శ్రీరాముడు శివ ధనస్సును విరచటం జరిగింది. శ్రీరామలక్ష్మణ భరత శత్రఘ్నుల వివాహలు జరిగాయి.(బాలకాండము 22 నుంచి 77 సర్గ). కొంత కాలమైనా సంతోషంగా గడిచిందో లేదో అప్ఞ్పడే దశరథునికి తన ముసలితనము గుర్తుకొచ్చింది. నా శరీరమంతా పండి ఒడలిపోయింది ఇట్లాగే ఎక్కువ కాలం పరిపాలించలేను.నా శరీరం విశ్రాంతి ని కోరుకుంటుంది.(ప్ఞట 97) అని ప్రముఖులకు చెప్పాడు.
అందరి అంగీకారం తో శ్రీరాముని పట్టాభిషేకము చేయదలిచాడు. వేదపండితులు, దైవజ్ఞులు దివ్యమైన ముహుర్తాన్ని నిర్ణయించారు. పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి చివరకు కైకేయికి తాను ఇచ్చిన వరాల కారణంగా శ్రీరాముడిని 12 ఏండ్లు వనవాసం చేసిరావల్సిందిగా చెప్పవలసి వచ్చింది దశరథునికి. తండ్రి మాటను నెరవేర్చటానికి శ్రీరాముడు సీత తోను,లక్ష్మణునితోను కలిసి అడవికి వెళ్ళాడు.ఇక దశరథుని బాధ వర్ణనాతీతం. దుఃఖాన్ని భరించలేని వాడై అర్ధరాత్రి సమయం లో ప్రాణాలు విడిచాడు.ఇదీ మనకు శ్రీమద్రామాయణం చెప్పే కధ. ఇప్ఞ్పడు దశరధుని జీవితాన్ని గూర్చి కాస్త యోచిద్దాం.ఆయన రాజులలో శ్రేష్ఠుడు,మంచి వంశానికి చెందినవాడు,వశిష్ఠు ఉపదేశాలను పాటించేవాడు,ఎంతో వినయ విధేయతలుండేవాడు,మృధువ్ఞగా మాట్లాడేవాడు.మరి అంత మంచి వ్యక్తి యొక్క జీవితం చాలా మటుకు దుఃఖంతో నిండియున్నట్లు తెలుస్తుంది.
అరవైవేల సంవత్సరాలు ఆయనకు ప్ఞత్ర సంతానము లేదు. ఒకవేళ మనం దీన్ని నమ్మలేక పోయినా చాలా కాలం వరకు ఆయనకు పిల్లలు ప్ఞట్టలేదని భావిస్తాము. ప్ఞత్రులు లేకపోతే ప్ఞన్నామనరకం వస్తుందని భావించే ఆ రోజుల్లో అప్ఞత్రస్యగతిర్నాస్తి అని భావించే ఆ యుగంలో దశరథుడు ఎంత బాధపడి ఉంటాడో, ఎంత మనోవ్యధకు గురై ఉంటాడో, నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపి ఉంటాడో మనం ఊహిచలేము.సరే చాలాకాలం తర్వాత ఎన్నో వ్యయ ప్రయాసల తర్వాత సంతానం కల్గితే వారికి పదహరు సంవత్సరాలు వయస్సు కూడా వచ్చీరాకముందే యాగ సంరక్షణ కొరకు ఒకసారి, కైకేయి కోరిక తీర్చటానికి మరోసారి దట్టమైన ,భయంకరమైన అడవ్ఞల్లోకి పంపవలసివస్తే ఎంత బాధ కల్గిఉంటుంది.? చివరకు ఏడుస్తూనే ప్రాణాలు వదిలాడు. అంత మంచి వ్యక్తికి ఎందుకు అలా జరిగి ఉంటుంది.? ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదంటుంది శాస్త్రం.దశరథుడు ఏమి చేశాడు? అందరికి తెలిసిన జవాబు ఒకప్ఞ్పడు దశరథుడు వేటకు వెళ్ళి శబ్దవేధివిద్యతో బాణప్రయోగం చేయటం ,ఒక మునికుమారుణ్ణి చంపటం,మునీశ్వరుడు ”నువ్ఞ్వ కూడా నాకు మల్లేనే ప్ఞత్రశోకంతో మరణిస్తావ్ఞ. (ప్ఞట 205- అయోధ్యకాం డము- 64వ సర్గ) అని శపించటం.సరే,దశరధుడి దుఃఖానికి కారణమది,మరి దశరధుడొక్కడే దుఃకించలేదు. ఆయన భార్యలు, మంత్రులు, అయోధ్యా ప్రజలు-అందరూ దుఃకించారు. మరి దానికి కారణమేమిటి? వారందరూ చేసిన కర్మ ఏమిటి? శ్రీమద్రామాయణాన్నే మనం క్షుణ్ణంగా గాలించాలి. కారణం దొరక్కపోదు చూద్దాం. మొట్టమొదట ప్ఞత్రార్ధియై అశ్వమేధయాగాన్ని చేయ సంకల్పించినట్లు దశరథుడు చెబితే వశిష్ఠుడు మున్నగు బ్రాహ్మణోత్తములందరూ దశరథుని నిర్ణయాన్ని వేనోళ్ళ అభినందించారు. (ప్ఞట-14) అశ్వమేధ యాగాన్ని ఘనంగా జరిపించారు.
దశరథ మహరాజు రాణులైన కౌసల్య, సుమిత్ర, కైకెయి ముగ్గురూ యాగాశ్వానికి భక్తి పూర్వకంగా ప్రదక్షిణ చేశారు. ఋత్వికుల ఆదేశాలను అనుసరించి వారంతా ఆ అశ్వాన్ని మూడు బంగారు సూదులతో గంట్లు పెట్టారు. వెంటనే ఆ అశ్వం పడిపోయింది (ప్ఞట-21). యాగ విధానాల్ని క్షుణ్ణంగా తెలిసిన ఋత్వికులు యాగాశ్వం మెదడును నేర్పుగా బయటకు తీస్తారు. మంత్రోక్తంగా హోమం చేస్తారు. తక్కిన ఋత్వికులంతా యాగాశ్వం యొక్క మిగిలిన శరీర భాగాల్ని హోమం చేస్తారు. (ప్ఞట-22) బ్రాహ్మణులందరూ గోవ్ఞలను, బంగారు నాణాలను స్వీకరిస్తారు, అందరూ సంతుష్టిగా తింటారు. అలాగే అందరూ పాలుపంచుకుంటారు. అలాంటి హింసతో కూడిన యజ్ఞం చేయటం వల్ల కల్గిన పాపంలోనూ అని మనం బాగా గ్రహించాలి ఏమిటీ? రాజర్షి చేసిన యజ్ఞంలో పాలు పంచుకుంటే పాపంతో పాలు పంచుకోవలసి వస్తుందా? అంటారేమో! రాజర్షి చేసినా,బ్రహ్మర్షి చేసినా, బ్రహ్మయే చేసినా ,పాపం పాపమే.ఎందుకంటే అది కామ్యకర్మ కాబట్టి,నిష్కామ కర్మకాదు కాబట్టి. ఆనాడు ముని కుమారుడిని చంపటమే పాప కర్మగా దశరధుడుకి అనిపించవచ్చు.
పైగా అది దశరథునికి తెలిసి చేసిన కర్మకాదు, తెలియక చేసిన కర్మ నుంచే అంత దుఃఖం కల్గితే తెలిసి తెలిసి సజీవంగా, ఆరోగ్యంగానున్న ఒక అశ్వాన్ని సూదులతో,కత్తులతో కుచ్చి కుచ్చి చంప్ఞతే పాపం రాదా? దాని ఫలితంగా వచ్చిన కర్మను అనుభవించక తప్ఞ్పతుందా?అందుకే దాన్ని ఒక సత్కార్యంగా భావించి దాంట్లో భాగస్వాములైన రాణులు,మంత్రులు,బ్రాహ్మణులు దుఃఖంని అనుభవించారని ఈనాటికీ మనం గ్రహించక పోతే ఎట్లా? పిల్లలు కల్గని ఏ విద్యావంతునికైనా నేడు అశ్వాన్ని బలివ్ఞ్వ పిల్లలు కలుగుతారంటే, నాకు పిల్లలు కలగకపోయినా పర్వాలేదు, మూగ జీవిని నా స్వార్ధం కోసం చంపను అని అనడా? అది కదా విద్యావంతుని, బుద్ధిమంతుని లక్షణం. స్వార్ధం కోసం పరజీవ్ఞలను హింసించటం తప్పని, కర్మఫలాన్ని అనుభవించుట ఎవరికో ఎంతటివారికైనా తప్పదని బోధిస్తుంది శ్రీమద్రామాయణం – రాచమడుగు శ్రీనివాసులు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565