సృజనాత్మకశక్తికి కారకుడు శుక్రుడు.దీనినే క్రియేటివిటీ అంటారు.ఎవ్వరికీ కలలో కూడా రాని ఆలోచన వీళ్ళకు వస్తుంది.అది కళ కావచ్చు.పెయింటింగ్ కావచ్చు.మరేదైనా కావచ్చు.శుక్ర గ్రహము జాతకములో అనుకూలముగా ఉంటే కొత్త కొత్త ఆలోచనలు చేసి వాటిని అమలు పరచి ప్రయోజనాలు,కీర్తి ప్రతిష్టలు పొందుతారు.ఓ చీరకు డిజైన్ తయారుచేయడములోనో,సౌకర్య వంత మైన వంటసామాగ్రి తయారు చేయడము.రక రకాల వంటింటి మిషన్స్,రకరకాల పెన్నులు,విద్యా సంబంథమైన వస్తువులు,ఫర్నిచరులో రకాలు,కంప్యూటర్సులో వివిథరకాలడిజైన్లు,వెబ్ సైట్లు,లో తైన పరిజ్ఞానము,ఎవరికీ అంతుచిక్కని విషయాలు పరిశోథించి ప్రవేశ పెట్టడము,ఇక చలన చిత్రా లకు సంబంథించి స్వయం మేథస్సుతో ఎవ్వరికీ తోచని పాత్రలను ప్రవేశపెట్టి అఖండఖ్యాతి సంపా దిస్తారు.వీళ్ళు నిర్మించే సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది.ప్రజలలో గుర్తింపు ఉంటుంది.
శుక్రుడు సంగీత ప్రియుడు.శుక్రుడు అనుకూలముగా ఉన్న సంగీత దర్శకులు,సంగీతములో విన్నూ త్నమైన బాణీలను సృష్టించి ప్రపంచఖ్యాతి పొందుతారు.వీళ్ళ పేరు ప్రఖ్యాతులు ఏ కొద్ది సంవత్స రాలకో పరిమితం కాదు.ఆదర్శప్రాయులై చరిత్రలో నిలిచిపోతారు.
అయితే వీళ్ళకు క్రియేటివిటీ ఉన్నా,ప్రతిభ ఉన్నా అంతకుమించిన బథ్థకము ఉంటుంది. కొత్త కొత్త విషయాలు కనిపెట్టి మానవాళికి మహోపకారం చేస్తారు.30 రోజులు పెయింటింగ్ వేయ డానికి 29రోజులు బథ్థకిస్తారు.ఒత్తిడి తట్టుకోలేక దివారాత్రం శ్రమించి ఒక్కరోజులో పెయింటింగ్ వే స్తారు.అబథ్థాలు చెప్పడం,వాయిదాలు వేయడం మానుకుంటే వీళ్ళు అఖండ కీర్తిని సాథించగలు గుతారు.వచ్చిన థనాన్ని దాచుకోవడము,పొదుపు వీళ్ళకు ఉండదు. దుర్వ్యసనాలకు సంపాదిం చి నదంతా తగల బెడతారు.
కళాకారుడిగా వీళ్ళంటే గౌరవముంటుంది.వ్యక్తిగత జీవితము మాత్రం ఎగతాళి అవుతుంది.ఈఅపశృతులు దొర్లకుండా ప్రవర్తన మార్చుకుంటే ఉత్తమకళాకారుడిగా వ్యక్తి గా ప్రసిథ్థులవుతారు.
శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉన్నాలేక వ్యతిరేకంగా ఉన్నాఅట్టి జాతకుని సామర్థ్యా లు బయటి ప్రపంచానికి తెలియవు.ఎక్కడా అవకాశాలు రావు.తన సామర్థ్యము మీద తనకే న మ్మకము పోతుంది.ఇతరుల దగ్గర ఉద్యోగాలు చేసి లేక వారి దగ్గర సహాకులుగా స్థిరపడి వాళ్ళ పురోగతికి వీళ్ళు సోపానాలు అవుతారు.జీవితములో ఏదోసాథించాలని తాపత్రయపడి అన్నిరకా లుగా శక్తి సామర్థ్యాలు,క్రియేటివిటీ ఉండి అనేక సంవత్సరాలు అవకాశము కోసము ఎదురుచూసి ఏ రక మైన ప్రయోజనము పొందలేక జీవితములో ఓడిపోతారు.
కొందరి జాతకములో శుక్రుడు అఖండంగా యోగిస్తాడు.కానీ ఆ యోగాన్ని నిలబెట్టలేడు.గొప్ప కళాకారుడిగా రాణించి,కీర్తిప్రతిష్ట లు సంపాదించి అత్యున్నత స్థానములో వెలిగిపోతారు.కానీ మద్యపానానికి అలవాటుపడి మద్యమే జీవితమై సర్వం కోల్పోతారు.ప్రాణనష్టంకూ డా సంభవించవచ్చు.లేని పక్షములో జీవిత చరమాంకములో తిండికి,బట్టకి నానా ఇబ్బందులూ ఎదుర్కుంటారు.
పేకాటలో,గుఱ్ఱపు పందాలలో నష్టపోవడము మాత్రము శుక్ర గ్రహ ప్రభావము వ ల్ల మాత్రం కాదు.ఓ స్త్రీకి బానిసై, వృత్తి,ఉద్యోగాలు,కెరియర్ అన్నీ నిర్లక్ష్యముచేసి సంపాదించినదం తా ఖర్చుపెట్టి దివాలా తీస్తారు.ఇది శుక్ర గ్రహ ప్రతికూల ప్రభావం మాత్రమే.జాతక రీత్యా శుక్రుడు బాగా లేకపోతే స్త్రీలవల్ల అష్టకష్టాలు,నిందలు సంభవిస్తాయి.స్త్రీలోలుడిగా అపఖ్యాతి సంభవిస్తుంది.
శుక్రుడు అనుకూలముగా ఉంటే ఎంతటి వ్యభిచారము చేసే వాడయినా అతని లీలలు వెలుగులో నికి రావు. సహోదరీ వర్గం స్థిరాస్థులను సంగ్రహిస్తారు. కోర్టుకు లాగి మరీ ఆస్తులు దక్కించుకుంటా రు.చేసిన మేలును మరుస్తారు.రక్త సంబంథమే లేనట్లు ప్రబల శత్రువర్గముగా మారిపోతారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565