హలీమ్
కావల్సినవి:
మాంసం - రెండుకేజీలు, పలుకుల్లా చేసుకున్న గోధుమలు -మూడుకప్పులు, అల్లంవెల్లుల్లి ముద్ద - నాలుగు టేబుల్ స్పూన్లు, మినప్పప్పు, సెనగపప్పు - అరకప్పు చొప్పున, పెరుగు - ఒకటిన్నర కప్పు, వేయించిన ఉల్లి పాయలు -కప్పు, జీడిపప్పు - అరకప్పు, సాజీరా - చెంచా, యాలకులు - రెండు, గులాబీరేకలు - యాభై గ్రా, లవంగాలు - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క (ఈ రెండింటినీ కలిపి పొడి చేసుకోవాలి), మిరియాలు - చెంచా, దాల్చినచెక్క - రెండు అంగుళాలు, లవంగాలు - రెండుమూడు, యాలకులు - రెండు, నెయ్యి - అరకప్పు, కొత్తిమీర తరుగు - కప్పు, పుదీనా ఆకులు - పావుకప్పు, పచ్చిమిర్చి - ఐదారు, ఉప్పు - సరిపడా, నూనె - అరకప్పు, పోట్లీ మసాలా - కొద్దిగా (వేడినీటిలో వేసుకోవాలి. ఇది బజార్లో లభిస్తుంది).
తయారీ:
గోధుమల్ని నీటిలో అరగంటసేపు నానబెట్టాలి. మాంసాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మాంసం ముక్కలకు సరిపడా అల్లంవెల్లుల్లిముద్ద, చెంచా ఉప్పు చేర్చి బాగా కలిపి ఉడికించి పెట్టుకోవాలి. అలాగే గోధుమలు, పప్పులు, మూడు నాలుగు పచ్చిమిర్చి, అరచెంచా మిరియాలు, ఎనిమిది నుంచి పదికప్పుల నీళ్లు తీసుకుని అరగంటసేపు ఉడికించాలి. మాంసాన్ని మిక్సీలో వేసి మెత్తగా అయ్యేలా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి మిగిలిన మసాలా దినుసులు, జీడిపప్పు, ఉల్లిపాయముక్కలు, గులాబీరేకలు, మాంసం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా వేయించాలి. రెండుమూడు నిమిషాలయ్యాక పెరుగు చేర్చి మరో పదిహేను నిమిషాలు వేయించాలి. ఇందులో మూడుకప్పుల పోట్లీమసాలా, నీళ్లు వేసి బాగా మరిగించాలి. ఉడికించిన గోధుమ మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేయాలి. అవసరమైతే మరికాస్త ఉప్పు కూడా చేర్చి అరగంటపాటు పొయ్యి మీద ఉంచాలి. దింపేముందు మిగిలిన నెయ్యి వేస్తే సరిపోతుంది. వేడివేడి హలీమ్ చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565