MohanPublications Print Books Online store clik Here Devullu.com

అరకులోయ_Araku_loya_boraa_guhalu

ఏకశిలతో నిర్మితమైన అద్భుత రాతిగుహలు

విశాఖపట్నం అందమైన పర్యాటక ప్రదేశం. ఇక్కడ అరకులోయ, అనంతగిరి వంటి మనోహరమైన ప్రదేశాలతోపాటు సింహాచలంవంటి దివ్య ఆలయాలు సందర్శకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ఉన్న వైశాఖ, విశాఖ (సుబ్రహ్మణ్య స్వామి) దేవాలయం వలన ఈ పట్టణానికి విశాఖపట్నం అనే పేరు వచ్చింది. ప్రాచీనకాలంలో ఈ దేవాలయం సముద్రం ప్రక్కన ఉండేది. కాలక్రమేణ సముద్రంలో కలిసిపోయింది. విశాఖలో మరో విశేషం బౌద్ధారామాలు. బౌద్ధమత వ్యాప్తిలో భాగంగా నంద, మౌర్య వంశరాజుల కాలంలో, జైన బౌద్ధ మత వ్యాప్తి ఫలితంగా విశాఖలో జైన బౌద్ధక్షేత్రాలు వెలిశాయి. శంక రం, రామతీర్థం క్షేత్రాలు ఆ కాలం నాటివే.
అనకాపల్లికి సమీపాన శంకరం అనే గ్రామంలోగల బొజ్జన్నకొండను తొలిచి ఒక బౌద్ధ గుహాల యం, ఆరామాన్ని నిర్మించారు. విశాఖలో ఇంకా తొట్లకొండ, బావి కొండ, పావ్ఞరాల కొండ తదితర ప్రదేశాలలో బౌద్ధారామాలుగా ప్రాచు ర్యాన్ని సంతరించుకున్నాయి. వాటి విశేషాలలోకి వెళితే… బొజ్జన్నకొండ విశాఖకు 45కి.మీ. దూరంలో 5వ నంబరు జాతీయ రహదారి నుండి ఒక గంట ప్రయాణం చేస్తే శంకరం గ్రామంవద్ద బొజ్జన్నకొండపై చారి త్రక ప్రసిద్ధి చెందిన ఏకశిలా స్థూపాలు, రాతిగుహలు, ప్రార్థనా స్థలాలు, ధ్యానమందిరాలు అతి ఎత్తైన కట్టడాలు, విశ్రాంతి మంది రాలు ఉన్నాయి. శారదానది ప్రక్కన ఈ ప్రదేశం ఉంది. కొన్ని శతా బ్దాల క్రిందట బౌద్ధసంస్కృతి, ధర్మసంప్రదాయాలకు, బౌద్ధ అధ్య యనం ధ్యానానికి బొజ్జన్నకొండ కేంద్రంగా ఉండేది. పురావస్తు త్రవ్వ కాలలో ఇక్కడ ఎన్నో ప్రాచీన నాణాలు, ఆనాటి మట్టిపాత్రలు బుద్ధుని విగ్రహాలు వెలువడ్డాయి.
కళింగరాజుల కాలంలో బౌద్ధమతాన్ని శ్రీలంక, బర్మా, ఇంకా ఎన్నో ప్రాంతాలకు విస్తరిస్తున్న తరుణంలో ఈ బౌద్ధారామాలు నిర్మితమైనాయి. బౌద్ధమత ధర్మసూత్రాల అధ్యయనం కోసం చైనా, బర్మా, ఇతర దేశాలనుండి విద్యార్థులు సముద్ర మార్గం ద్వారా ఈ ప్రాంతానికి వచ్చి నెలలు, సంవత్సరాల తరబడి విద్యాధ్య యనం ముగిసేదాకా ఇక్కడే ఉండేవారు. సన్యాసులు నివసించే సంఘారామం అనే పదంనుండి శంకరం పదం ఏర్పడి ఈ ప్రాంతానికి శంకరం గ్రామంగా పేరు వచ్చింది. గుహలపై ఎన్నో బుద్ధుని విగ్రహా లు అందంగా చెక్కారు ఈ చారిత్రక ప్రదేశానికి అనకాపల్లి రైల్వేస్టేషన్‌ 4 కి.మీ. దూరంలో ఉంది. అనకాపల్లి నుండి 15 నిమిషాలు రోడ్డుపై ప్రయాణించి ఇక్కడ కు చేరవచ్చు.
ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. యాత్రికులకు అర్థమయ్యే ఈ ప్రాంత విశేషాలను వివరించే గైడ్స్‌ సిద్ధంగా ఉంటారు. కొండపైనుండి చూస్తే పచ్చని పచ్చిక మైదానాలు కనిపి స్తాయి. బౌద్ధారామాలు ఒకవైపు, విశాఖ సముద్రం మరో వైపు అందంగా కొలువ్ఞదీరాయి. ఇక్కడ ఏకశిలా నిర్మిత ఎత్తైన స్థూపాలు, అందమైన శిల్పాలతో నిండిన రాతిగుహలు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో నాలుగు పవిత్ర స్థూపాలు మిగిలిన స్థూపాలు బుద్ధుని ధ్యానముద్ర విగ్రహాలతో ఉంటాయి. గుహలోనికి వెళ్ళే టపుడు ద్వార పాలకుల నిలువెత్తు విగ్రహాలు శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా కని పిస్తాయి. 16పెద్ద స్థంభాలతో, నాలుగు వైపు లా రాతిగోడలతో 20చిన్న గదులుగా దీర్ఘ చతురస్త్రాకారంలో ఈ ప్రదేశం ఉంటుంది. చతురస్త్రాకార వేదిక, మధ్యలో స్థూపం ఉం టుంది.
భూమిస్పర్శ ధ్యానముద్రలో ప్రశాం త వదనంతో బుద్ధుని మహోన్నత విగ్రహం ఇక్కడ ఉంది. విహారాలు, చైత్యాలు, సన్యాసుల ధ్యాన మంది రాలు బొజ్జన్నకొండలో ఎన్నో ఎన్నెన్నో. వివిధ కాలాల్లో నిర్మించిన సన్యాసుల ఆరామాలు బౌద్ధానికి నిదర్శనంగా భాసిస్తున్నాయి. 1907లో త్రవ్వకాల్లో ఎన్నో పురాతన నాణాలు, కూర్చుని ఉన్న భంగిమలో బుద్దుని విగ్రహాలు బయల్ప డ్డాయి. ఎన్నో శతాబ్దాల నుండి బౌద్ధ సన్యాసులను, పర్యాటకులను బొజ్జన్నకొండ ఎంతగానో ఆకర్షిస్తోంది. బొజ్జన్నకొండపై బౌద్ధమత అనుయాయుల కోసం వృత్తాకారాలలో, గురువ్ఞల కోసం అర్థచంద్రాకారంలో ఎత్తైన పీఠాలు ఆనాటి బౌద్ధంలోని హీనయాన, మహాయాన, కోణాలను ప్రతి బింబిస్తున్నాయి.
దీపాలు పెట్టుకొనేందుకు అరలు, శిష్యుల వసతికై గదులు ఇప్పటకీ కనిపిస్తాయి. బుద్ధుని విగ్రహాలుగల నాలుగు స్థంభాలు ఏకశిలతో నిర్మిత మైనవి ఒక గుహలో, మరొక గుహలో తొమ్మిది స్థంభాలు, నీటిని నిలువచేసుకునే రాతిబావ్ఞలు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా మనకు కనిపిస్తాయి. చారిత్రక నేపథ్యం గల బీమ్లీలో విశాఖసాగర తీరాన విశాఖకు 16 కి.మీ. దూరంలో తొట్లకొండ బౌద్ధారామం ఉంది. మంగమర్రిపేట గ్రామానికి దగ్గరలో కొండపై సముద్ర మట్టానికి 128మీ. ఎత్తున తొట్లకొండ ఉంది. భార తీయ నౌకాయాన శాఖవారి ఏరియాలో సర్వేలో ఈ తొట్లకొండను కనుగొన్నారు. 1988-92 మధ్యకాలంలో త్రవ్వకాలను జరిపారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖవారు విశాఖ నగ రాభివృద్ధి సంస్థ సంయుక్త సహకారంతో దీన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారు. స్థానికుల సహకారంతో కొండపైకి విశాలమైన తారు రోడ్డును నిర్మించారు.
విశాఖ బీచ్‌రోడ్డు ప్రక్కగా ప్రవేశ రుసుముతో ప్రవేశద్వారం స్వాగతం పలుకుతుంది. ఇక్కడి సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలు, వంటశాలలు అలనాటి వారి సాధారణ జీవనానికి అద్దం పడతాయి. సూర్యోదయ సూర్యాస్తమయ దిశలు రాతిపై చెక్కి కనిపి స్తాయి. 12 నీటి కొలనులు 4 లోపల, చిన్న పెద్ద మిగిలినవి బయట ఉన్నాయి. వాటిలో ఒక దానిలో అన్నికాలాల్లో నీరు పుష్కలం గా ఉండటం విశేషం. ఇక్కడ ఎక్కువగా నీటితొట్లు ఉండటం వలన ఈ ప్రాంతానికి తొట్లకొండ అనే పేరు ఏర్పడింది. గ్రద్ద ఆకారంలో ఉన్న ఈ కొండపైనుండి చూస్తే ఉవ్వెత్తున ఎగిసిపడే అలలతో అందమైన సముద్ర శోభ. తీరరేఖ స్పష్టంగా కనిపిస్తాయి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list