MohanPublications Print Books Online store clik Here Devullu.com

విమాన వెంకటేశ్వర స్వామి-Lord Venkateswara Swamy



విమాన వెంకటేశ్వర స్వామి
కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న స్థానంలో బంగారు గోపురం పైన వెండి ద్వారం లో కొలువై శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. (వెండి ద్వారం గోపురం పైనున్న స్వామి ప్రదేశాన్ని చూపేందుకు ) దర్శనం అయ్యాక చాలా మంది గోపురం పైన ఉన్న స్వామి ని చూసి దర్శించి నమస్కరిస్తుంటారు.
వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. మహా విష్ణువు ఆనతి తో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వేంకటేశ్వరుని తీసుకొచ్చాడు.
ఆ దర్శనం పశు పక్షాదుల కోసము, దేవతల కోసము. ఆకాశాన్నించి ముక్కోటి దేవతలు దిగి వచ్చి స్వామిని సేవించుకోవటం కోసమే.
మన పగలూ, రాత్రితో వారికి సంబందం లేదు. గనుక వారి పూజా సమయం వేరు గనుక, భూమి క్రిందున్న, భుమిపైనున్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది.
తిరుమల వెళ్ళిన వారు తప్పక విమాన వెంకటేశ్వర స్వామి పాదాలనూ దర్శించి తరించండి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list