దత్తాత్రేయం
సృష్టిలో అవరోధాలు రాకుండా చేయడానికి భగవంతుడు పరిపూర్ణులైన సద్గురువ్ఞలుగా అవతరించి-తమ లీలల ద్వారా జనులకు మోక్ష భావనను ధర్మనిష్ఠను కలిగేలా చేస్తూ ఉంటాడు. భూమిపైన మహాత్ములుగా అవతరించే భగవత్తత్వాన్నే దత్తాత్రేయుడు అన్నారు. సద్గురువ్ఞగా ఆత్మ సమర్పణ చేసుకుంటూ, దత్తం చేసుకుంటున్నాడు. అందులకే ”దత్తుడు అను నామం అనుగ్రహమూర్తియైన భగవంతునికే సరిపోతుంది. ఆత్మసమర్పణంలో ఆయన వాత్సల్యం ఉంటుంది. అందులకు అనుగుణంగా భగవంతునికి తగినంతగా కృతజ్ఞతలు తెల్పుకుంటూ జీవించడమే మన కర్తవ్యంగా, మన ధర్మంగా భావించి ఆచరణలో నిరూపించగలగాలి. పూర్వము అత్రి మహర్షి తన తపోబలంచే మహిమచే అధిభౌతికము, అధిదైవికము, ఆధ్యాత్మికము అను మూడు విధములైన తాపాలను తొలగించుకొని ‘అత్రిఅయినాడు.
ఆయన అరిషడ్వర్గాలను జయించి వీటిని మూలమైన అసూయను జయించి ”అనసూయకు పతి అయినాడు. అందుకు ఆనందించి భగవంతుడు అతనికి పుత్రుడై ”దత్తాత్రేయునిగా జననమొందినాడు. ఆయనను అనన్య భక్తితో కొలిచినవారికి ఆయన దత్తమై వారిని తన ప్రతిరూపాలుగా చేసికొని కృతార్థులను చేశాడు. ఆసేతు హిమాచలము వరకూ నాటి నుండి నేటివరకు భక్తులందరూ గురుధ్యాన శ్లోకాలు వల్లిస్తూ త్రిమూర్త్యాత్మకుడైన ఆ దత్తాత్రేయుని స్మరిస్తున్నారు. శ్లోII దత్తాత్రేయం -మహాత్మానం వరదం భక్త-వత్సలం ప్రసన్నార్తిహరం-వందే స్మర్తృగామీ-సనోవతు అంటూ ధ్యానిస్తారు. దత్తాత్రేయుడు చతుర్యుగావతారమని యోగీశ్వరుడైన చక్రధరుడు సూత్రపాఠ విచారము అను గ్రంధంలో కీర్తించాడు. సర్వజీవ్ఞలనూ ఉద్ధరించడమే తన అవతార కార్యంగా గలవాడు. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాల కంటే ముందే, వైశాఖ బహుళ దశమీ గురువారం, రేవతీ నక్షత్రయుక్త మీనలగ్నంలో మీనాంశమందు శ్రీదత్తుడు అవతరించారని పురాణ ప్రోక్తము. ఈయన కార్యవీర్యునికీ, ప్రహ్లాదునికీ యోగముపదేశించారనీ పురాణాలు వర్ణించాయి. దత్తుడు మౌనప్రియుడు. పరిశుద్ధ హృదయుడూ అని భాగవతం చెబుతుంది.
బుషి సంప్రదాయానికి చెందిన వాడు. యోగసంప్రదాయకులు. వీరు కావేరీ లోయలలో సంచరిస్తూ, సహ్యాద్రి పర్వత గుహలలో ఆశ్రమ నిర్మాణం చేసుకొని యోగనిష్టలో నిమగ్నులయ్యారని మార్కండేయ పురాణంలో తెలుపబడినది. గోరక్షణాధునితో సంవాదంలో గెలిచి ఆయనకు అవధూత గీత, శ్రీగురుగీత బోధించినట్లు శివాజీ చక్రవర్తి గురువైన సమర్థ రామదాస స్వామి తన ‘దాసబోధ గ్రంథంలో శ్రీ దత్తాత్రేయుడు పరమగురువ్ఞగా నాధ సంప్రదాయంలో కీర్తింపబడినారని వర్ణించారు. శ్రీదత్తాత్రేయుని ‘అవధూత అనే బిరుదు ఉంది. అవధూతోపనిషత్తులో ఒక శ్లోకంలో ఇలా ఉంది. శ్లోII అక్షర ద్వాధ్వరేణ్యత్వాత్ అవధూత సంసార బంధనాత్ తత్వమస్యాది-లక్షత్త్వాత్ అవధూత ఇతీర్యతేII అనగా నాశరాహిత్యము-శ్రేష్టత్వము-వదలివేయబడిన సంసారబంధము, తత్వమసి అనే మహావాక్యానికి లక్ష్యమవడం వలన, అటువంటి వారిని ”అవధూతఅని అంటారు. సర్వప్రకృతిలోని వికారాలను వదలివేసి, దేహేంద్రియ విషయాల యందు చిక్కిన మనస్సును ఉపసంహరించి ఆత్మలో లీనం చేసినవారు, నిష్ప్రపం చులు-ఆది మధ్యాంత భేదరహితులు అవధూతలని కీర్తింపబడతారు. శ్రీదత్త ప్రభువ్ఞలకు సర్వత్రా, సర్వదా సన్మానమే కలదు. వీరు ఎందరినో అనుగ్రహించి కీర్తింపబడినారు. నిస్సంగులు ఏ అపేక్షాలేని దత్తాత్రేయుడు గోదావరీ తీరంలో జ్ఞానాన్ని అపారంగా సేకరిస్తూ, పాంచాలేశ్వర్‌లో నిత్యం స్నానం చేసే శ్రీదత్తయోగి అని మహితాత్ముడైన శ్రీ తుకారాము కీర్తించాడు.
సుఖాలను జనులకు విడిచి, భక్తుల బాధలను తానే అనుభవిస్తాడు. ఆయన దర్శనమే అమోఘ ఫలితం ఇస్తుంది. ఆయన భిక్షాన్నమే గ్రహిస్తారు.ఆయన చుట్టూ సుందరమైన తేజః పుంజము ఉంటుంది.
ద్ధసనాతనులు-త్రిమూర్తుల అవతారము. త్రిపురారి. నిత్యం భాగీరధీతీరంలో కొల్హాపూర్‌లో భిక్ష చేసే వారు. ఆయనది నిగూఢమైన యోగలీల. దయామయులు. ముఖ్యశిష్యుడు కల్యాణస్వామి. ఆనంద సంప్రదాయానికి మూలపురుషుడు దత్త సంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి 16అవతారాలున్నాయని నానుడి. శ్రీవాసుదేవానంద సరస్వతీ స్వామివారు రచించిన దత్తపురాణంలో మునులకు దత్తుడు ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన అవతారాలని కీర్తించారు. అత్రిమహర్షి వాతాశనుడై యోగిరాజును ధ్యానించాడు.
దేవాసురులు త్రిమూర్తులను శరణు వేడగా త్రిమూర్తులు అత్రి ఆశ్రమానికి చేరి ఆయనను మేల్కొలిపారు. అత్రి ముని వారితో నేను ఒక్కరినే ధ్యానిస్తే ముగ్గురు వచ్చారేమి అనగానే నీవ్ఞ ధ్యానించిన అద్వితీయుని రూపాలమే మేము ముగ్గురమూ ఒకటే. సృష్టి కార్యాలను నెరవేర్చడానికి త్రిగుణాలనాశ్రయించి ముమ్మూర్తులుగా వెలిశాము. నీవ్ఞ ముందుగా చూచిన రూపాన్నే ధ్యానించు అన్నారు. ఆశ్రమంలో అత్రి తపస్సుకు మెచ్చి భగవంతుడు వరం కోరుకోమన్నాడు. నీవంటి కొడుకు కావాలి అన్నాడు బుషి. మాట ఇచ్చాను గదాయని తనంత వాడు లేనందువలన తనను తానే దత్తం చేసుకున్నాడు భగవానుడు. అత్రి, అనసూయా దంపతులు ప్రణమిల్లినారు.
తమ గర్భజనితుడైన బిడ్డకావాలని, సాక్షాత్కరించిన రూపం భూమిపై నిలిచి పోవాలనీ కోరారు. ఆశ్రమంలో యోగాగ్ని దహింపబోగా దత్తుడు బుషి శిరస్సుపై చేరాడు. చల్లదనం కల్గినది. బుషి కన్నుల నుండి కాంతి వెడలి బుతుస్నాతయైన అనసూయ దేహంలో ప్రవేశించింది. అదిమార్గశిరమాసం. పూర్వార్థంలోని సప్తమి. గర్భస్థుడైన భగవానుడు 9 దినాలను 9మాసాలని తలంచి ”మార్గశిర పూర్ణిమా బుధవారం నాడు మృగశిర నక్షత్రంలో సాయంత్రం వేళ జన్మించాడు. సృష్టి పులకించినది
. ప్రభువ్ఞ చంద్ర-దత్త-దూర్వాసుల రూపంలో దర్శనమిచ్చాడు. త్రిమూర్తాత్యత్మకుడైన బిడ్డను చూసి పొంగిపోయారు. భగవంతుడు వారిని సంతోషపరిచాడు. భగవద్గీతలో గీతాచార్యుడు ”మాసానాం మార్గశీ ర్షోహంఅని మార్గశిర మాస విశిష్టతను తెలిపారు. యోగి జనవల్లభుడైన దత్తుడు అనసూయ గర్భాన జన్మించాడని తెలిసి సిద్ధ గంధర్వాదులు-యోగులు దర్శింపరాగా ఆయన బాల్యరూపాన్ని విడిచి తేజోమూర్తిగా దర్శనమిచ్చి దానిని ధ్యానించమన్నాడు. తరించండి అన్నాడు. నాకు జన్మ-కర్మ-గుణ-రూప-మాయ-నాశాలు లేవన్నాడు. సర్వవ్యాపిని. కావ్ఞన మార్గశిరపూర్ణిమ గురువారం మధ్యాహ్నం అర్ఘ్యం-ముత్యాలు-పంచభక్ష్యాలు అర్పించి ఓం యోగి జనవల్లభాయ నమః అని జపం చేయాలి. ఈయన దేహంలోని కుడిపార్శ్వము గురువ్ఞ. ఎడమ పార్శ్వము భగవంతుడు.
కుడిచేతిలో మంత్రాకాధారమైన 52పూసల జపమాల. ఢమరులో శాస్త్రాలున్నాయి. చక్రము బంధవిచ్ఛేదము చేసి జ్ఞానతేజాన్ని ప్రసాదిస్తుంది. ఇవి కుడివైపున ఉంటాయి. ఎడమచేతిలో కర్మఫలాన్నిచ్చే కర్మసూత్రమనే జలాన్ని కల్గిన కలిశమున్నది. జీవ్ఞలకన్నపానా దులనందిస్తుంది. త్రిశూలము శంఖం సృష్టి పాలన చేస్తాయి. ఇదే భగవతత్వం. దత్తుని మూడు అర్ఘ్యాలతో పూజించి అరటిపండ్లు నైవేద్యం ఇచ్చి స్తోత్రం-లీలాశ్రవణం చేయాలి. జ్ఞానప్రదీపకుడు. శ్లోII అద్వయానంద రూపాయ-యోగమాయా ధరాయచ యోగిరాజాయదేవాయ-శ్రీదత్తాయ నమో నమఃII దిగంబరా-దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా విశ్వగురుడు దత్తాత్రేయుడు. – పి.వి. సీతారామమూర్తి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565