MohanPublications Print Books Online store clik Here Devullu.com

స్వాములకు రాజకీయాలు అవసరమా?ParipoornanandaSwamy


స్వాములకు 

రాజకీయాలు అవసరమా?: 
                         -యాంకర్ సుమ

        ఎప్పుడూ ఆడియో ఫంక్షన్లు, సినిమా వాళ్ల ఇంటర్వ్యూలు, కామెడీ ప్రోగ్రామ్‌లు చేసే సుమ.. ఫస్ట్ టైమ్ ఒక స్వామీజీని ఇంటర్వ్యూ చేశారు. అది కూడా ఒక ప్రఖ్యాత స్వామీజీని. ఆయనే శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి. పరిపూర్ణానంద స్వామి ఇటీవల ఓ చానల్‌ను ప్రారంభించారు. భారతీయత గురించి ఆ చానల్‌లో వివరిస్తూ.. హిందూ ధర్మాన్ని బోధిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో సెలబ్రిటీని ఆహ్వానించి, వాళ్ల ప్రశ్నలకు స్వామీజీ సమాధాలిస్తారు. ఇలా ఒక ఎపిసోడ్‌కు యాంకర్ సుమ హాజరయ్యారు. స్వాములకు రాజకీయాలు అవసరమా? అని ఈ సందర్భంగా సుమ ప్రశ్నించారు. దీనికి పరిపూర్ణానంద స్వామి సమాధానమిస్తూ..
      ‘‘అసలు బేసిక్‌గా స్వామీజీలకు రాజకీయాలెందుకు? అనేవాళ్లు ఎవరంటే.. రాజకీయనాయకులే. స్వామీజీలు రాజకీయాల్లోకి వస్తే తమ పని అయిపోతుందని భయపడుతున్నారేమో! బేసిక్‌గా రాజకీయనాయకులకు భార్య, పిల్లలు, వాళ్ల మనవళ్లు, వాళ్ల తల్లిదండ్రులు, వాళ్లకున్న వ్యాపారమో, ఉద్యోగమో.. ఇంకొకటో.. ఇవన్నీ చక్కబెట్టుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలంటే చాలా కష్టం. ఈ రోజు ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. మోదీ గారు ఉన్నారు.. ఆయనెవరు? సన్యాసి. ఈ రోజు మోదీగారు రాజకీయాల నుంచి బయటకు వచ్చారనుకోండి.. ఆయనకు ఒక ఇల్లు లేదు. ఆయనకు భార్య, పిల్లలు లేరు. ఆయనకు ఏవీ లేవు. ఆయన ఏం చేస్తారో తెల్సా? నేను చెప్తున్నాను మీకు.. ఆయన రాజకీయాల్లోంచి బయటకు వచ్చారనుకోండి హాయిగా.. మళ్లీ భుజాన ఒక బ్యాగ్ వేసుకుంటారు.. కుదిరితే ఫుల్‌టైమర్‌గా మళ్లీ ఆర్ఎస్ఎస్‌లోకి వెళ్లి సంఘ ప్రచారం చేసుకుంటారు. లేదా ఆయను కాషాయం ఇష్టమనుకోండి శుభ్రంగా వెళ్లి రుషికేష్‌లో తపస్సు చేసుకుంటారు.
      అలా ఏ రాజకీయనాయకుడైనా చేయగలడా?.. చేయలేరు. ఎందుకంటే వాళ్లకు వెనకాల చాలా బాధ్యతలున్నాయి. నా అభిప్రాయం ప్రకారం రాజకీయాల్లోకి ఎవరైనా రావాలంటే.. ఏ బాదరబందీ లేనివాడు వస్తే కచ్చితంగా ఎంతో కొంత చేస్తాడు. ఏదో ఒక ప్రక్షాళన చేయాలనే ఫీలింగ్ కలుగుతుంది.’’ అని చెప్పారు.





1 comment:

  1. First let this guy answer these questions:
    1. who is his father, mother, their names, and the place they come from originally

    2. what are his qualifications

    3. who gave his sanyasa deeksha ??? who gave him this PARIPOORNANANDA SWAMY or what ever it is ??/

    4. Did he maintain accounts of the donations and other received by him if yes where are the audited accounts

    5. did he file IT returns any time.

    4. What are the source of income for this SO CALLED SRIPEETHAM OF KAKINADA.

    ReplyDelete

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list