రాముడూ, పరశురాముడూ, లక్ష్మణుడూ ప్రతిష్ఠించిన మూడు శివలింగాలు ఒకే ఆలయంలో కొలువయ్యాయి. అందులోనూ పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఏడాదిలో ఒక్క వైశాఖమాసంలోనే భక్తులకు దర్శనమిస్తుంది. మిగిలిన రోజులన్నీ శివయ్య నివాసం గంగమ్మ ఒడిలోనే. ఆ విశేష దేవాలయాన్ని చూడాలంటే పశ్చిమగోదావరి జిల్లా నత్తారామేశ్వరానికి వెళ్లాల్సిందే!
శివుడు నిరాడంబరుడు. దోసెడు నీళ్లు తెచ్చి నెత్తిన పోస్తే చాలు మహదానందపడిపోతాడు. అందుకే శివయ్యకు నిరంతరం నీళ్లు పడుతూ ఉండేలా ఏర్పాటు చేస్తారు ఆలయాల్లో. అలాంటిది ఏడాదిలో 11 నెలలూ పరమేశ్వరుడు జలంలోనే కొలువవడం విశిష్టమైన విషయమే. కృతయుగంలో పరశురాముడు నదిలోనే ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. రామయ్యా ఈ శివయ్యను దర్శించుకుని ఆనందపడ్డాడట. గోస్తనీ నది ఒడిలో ఉన్న ఈ దేవాలయానికి పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం వేదికగా ఉంది.
కృతయుగంలో...
వాయుపురాణంలో ఈ క్షేత్ర ప్రశస్తి ఉంది. దాని ప్రకారం... కృతయుగంలో పరశురాముడు మాతృ హత్యా పాప పరిహారార్థం గోస్తనీనది తీరంలో తొమ్మిది వేల సంవత్సరాల పాటు ఏకాగ్రతతో తపస్సు చేశాడు. దానికి మెచ్చిన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై వైష్ణవ ధనుస్సును బహూకరించాడట. దాని సాయంతో పరశురాముడు 21 సార్లు భూమండలమంతా పర్యటించి కార్తవీర్యార్జునుడిని జయించి అనేకమంది రాక్షసులనూ, దుర్మార్గులయిన క్షత్రియులనూ సంహరించాడు. ఈ దోష పరిహారం కోసం కైలాసానికి వెళ్లి క్రౌంచ పర్వతాన్ని ఛేదించి శివుడి ఆజ్ఞతో ఒక శివలింగాన్ని గోస్తనీనదిలో ప్రతిష్ఠించాడు. మునులూ దేవతలూ కలిసి ఏడు కోట్ల మంది ఆ సమయంలో ఇక్కడికి వచ్చారట. అందుకే ఈ లింగానికి సప్తకోటీశ్వర రామలింగంగా నామకరణం చేశాడు. ఈ క్షేత్రానికి సర్వపాపహరమైనదిగా, సర్వతీర్థ ఫల ప్రదాయకమైనదిగా వరమిచ్చాడు పరశురాముడు.

తర్వాత... త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై గోస్తనీ నదిలో పరశురాముడు ప్రతిష్ఠించిన సప్తకోటి రామలింగేశ్వరుడిని దర్శించుకున్నాడు. శ్రీరాముడు రావణ సంహారానంతరం మునుల ఉపదేశాల ప్రకారం, పాప పరిహారం కోసం, కోటిశివలింగాలు ప్రతిష్ఠిస్తూ భూమండలమంతా తిరుగుతూ ఓరోజు గోస్తనీ తీరానికి వచ్చి స్నానమాచరించాడు. ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని భావించి హనుమంతుడిని వారణాశికి పంపించాడు. ఆంజనేయుడు రావడం ఆలస్యమై ముహూర్త కాలం మించిపోతుండటంతో సీతమ్మవారితో కలిసి గోస్తనీ నదిలో నీళ్ల మధ్యలో నత్తలతో కూడిన సైకత శివలింగాన్ని తయారు చేసి, ప్రతిష్ఠించాడు రాముడు. ఆ సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై ‘నీవు ప్రతిష్ఠించినలింగం రామేశ్వరుడిగా లోకప్రసిద్ధి పొందుతుంది. శివరాత్రి రోజున నాకు ఇక్కడ ఎవరు అభిషేకం చేసి దీపాలు వెలిగిస్తారో వారు మోక్షం పొందుతారు’ అని వరమిచ్చినట్లు స్థలపురాణం. నత్తలతో కూడిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి నత్తా రామేశ్వరంగా ఈ చోటు ప్రసిద్ధి గాంచింది. తర్వాత ఇక్కడే లక్ష్మణుడూ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. పరశురాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని రామలింగేశ్వరుడిగానూ, రాముడు కొలువుదీర్చిన లింగాన్ని రామేశ్వరుడిగానూ, లక్ష్మణుడి లింగాన్ని లక్ష్మణేశ్వరస్వామిగానూ పిలుస్తారు.
ఒక్క వైశాఖంలోనే...
రామలింగేశ్వరాలయం దాదాపు పూర్తిగా గోస్తనీ నదీ గర్భంలోకే ఉంటుంది. అందువల్ల ఆలయం మొత్తం నీళ్లలోనే ఉంటుంది. శివుడికి ఇష్టమైన ఒక్క వైశాఖ మాసంలోనే అక్కడి నీళ్లను ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా తోడేసి పూజలు నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకూ నెలంతా ఇవి కొనసాగుతాయి. ఇక్కడి శివలింగానికి మామిడిపండ్ల రసంతో అభిషేకం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మిక. ప్రతి సోమవారంతో పాటు ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో విశేష అర్చన, అభిషేకాదులు జరుగుతాయి. వేడుకగా...

రామలింగేశ్వరాలయం మినహా రామేశ్వరాలయం, లక్ష్మణేశ్వరాలయాలూ ఇదే ప్రాంగణంలో ఉన్న భద్రకాళీ సమేత వీరభద్రస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలను మాత్రం సాధారణ ఆలయాల్లాగే ఏడాది పొడవునా దర్శించుకోవచ్చు.
ఆలయంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం దక్షిణాభిముఖంగా ఉంటుంది. పరశురాముడు, లక్ష్మణుడు ప్రతిష్ఠించిన లింగాలు పశ్చిమాభిముఖంగా ఉంటాయి. ఒకే ఆలయ ప్రాంగణంలో ఇలా రెండు విభిన్న దిశల్లో శివలింగాలు ఉండడం దేశంలోనే అరుదు. స్వామివారి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వందల ఏళ్లనాటి రావిచెట్టుకి ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. చోళుల కాలంలో వెలుగొందిన ఈ దేవాలయాన్ని క్రీ.శ.1583లో కులీ పాదుషా ఆజ్ఞ ప్రకారం పునఃప్రతిష్ఠ చేసినట్లు జుత్తిగ శాసనం తెలియజేస్తోంది.
నత్తారామేశ్వరం తణుకు పట్టణానికి 14 కిలోమీటర్లూ, తాడేపల్లిగూడేనికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- బీవీఎస్.సాయిబాబు, భీమవరం
మంచి విషయం తెలియపరిచారు. కాని ఆ దేవాలయాలకు వేల్లాలంటే ఎలా వెళ్ళాలి. ఏ రైల్వేస్టేషన్ లో దిగితే దగ్గర ఇటువంటి విషయాలు తెలియపరచావలసింది
ReplyDelete