MohanPublications Print Books Online store clik Here Devullu.com

రంజాన్‌ మాసం_Ramzan Masam


శుభాల సరోవరం
రంజాన్‌ మాసం

పరమ పవిత్రమైన రంజాన్‌ మాసం వచ్చేసింది. ముస్లింల ఐదు విధులు– విశ్వాసం, నమాజ్, జకాత్, రోజా, హజ్‌లలో రోజాను రంజాన్‌ మాసంలో త్రికరణ శుద్ధితో ఆచరిస్తారు. ఉపవాసాన్ని అరబీ భాషలో ‘సౌమ్‌’ అని, వ్యవహారిక ఉర్దూ భాషలో ‘రోజా’ అనీ పిలుస్తారు. ఇస్లామియా క్యాలెండర్‌లో 9వ నెల అయిన రంజాన్‌lమాసంలో ఈ ఆరాధన వ్రతాన్ని పాటిస్తారు. ఇస్లాంలో ‘రోజా’ అంటే ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజించకుండా సేవించకుండా మనోవాంఛలకు దూరంగా ఉండడం.

ఉపవాసాల గురించి దివ్యఖురాన్‌లో ఆదేశాలు ఇలా తెలపబడ్డాయి. ‘ముస్లిం సోదరులారా! ఉపవాసాలు మీకు విధిగా నిర్ణయించబడ్డాయి. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం కలుగుతుంది’.

దివ్యఖురాన్‌లో... ఉపవాస ప్రాముఖ్యత
ఉపవాసం ఇతర ఆరాధనల కంటే భిన్నమైంది. నమాజ్‌లో మనిషి కూర్చొనడం... నిల్చొనడం... రుకులు.. సజ్‌దాలు చేయడం లాంటివి చేస్తాడు. దీనిని ప్రతి వ్యక్తి చూడగలడు. ‘జకాత్‌’ (దానం)lవిషయం కనీసం దానిని తీసుకునే వ్యక్తికైనా తెలిసిపోతుంది. ‘హజ్‌’ విధిని లక్షల మంది ఎదుట నిర్వహిస్తాడు. కాని ఉపవాసమనేది దేవుడికి, దాసుడికి మధ్యనే ఉంటుంది. మూడోవ్యక్తికి తెలియదు. ‘ఉపవాసం కేవలం నా కోసం మాత్రమే పాటించబడుతుంది. నేను దానికి పూర్తి ప్రతిఫలం ప్రసాదిస్తాన’ని దేవుడు అంటాడు. ఉపవాసం కవచం వంటిది. ఎవరైతే ఉపవాసం పాటిస్తున్నారో, వారు అశ్లీలానికి, అలజడికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా వారితో దుర్భాషలకు గాని తగాదాలకు గాని దిగితే నేను ఉపవాసం పాటిస్తున్నానని చెప్పాలి.

ఫలమాసం
రంజాన్‌ మాసంలో సత్కార్యాల పుణ్యం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. ఒక విధిని నెరవేరిస్తే 70 విధులు నిర్వర్తించిన దానికి సమానంగా పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా రంజాన్‌ మాసంలో శుభాలను పొందే మహాభాగ్యాన్ని అల్లాహ్‌ కలగజేశాడు. ఈ రంజాన్‌ చూశాం... మరో రంజాన్‌ చూస్తామో లేదో తెలియదు... ఇలాంటి అవకాశం మళ్లీ లభిస్తుందా...? లేదా.. తెలియదు. కనుక ఈ మాసంలో మనం చేతులు చాచి శుభాలను నింపుకోవాలి. జీవితంలో సంస్కరణలు ఎక్కడ అవసరమో గ్రహించి అక్కడ సంస్కరించుకోవాలి. దైవం మనందరికి రంజాన్‌lశుభాలను సమృద్ధిగా పొందేlభాగ్యాన్ని ప్రసాదించాలి. – మహమ్మద్‌ మంజూర్‌
మినహాయింపులు...
మనిషి కష్టసుఖాలను బాగా ఎరిగిన దైవం ఉపవాసాన్ని విధిగా నిర్ణయించినప్పటికీSకొందరికి కొన్ని మినహాయిƇపులు ఇచ్చాడు. పిల్లలకు, బాటసారులకు, రోగులకు, వృద్ధులకు, మతి స్థిమితం లేనివారికి, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు మినహాయింపు ఉంది.

అలాంటి వారి ఉపవాసం వ్యర్థం!
⇔ ఒకపక్క ఉపవాసం పాటిస్తూ మరోపక్క అబద్ధం చెబుతూ మోసాలు చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఉపవాసాన్ని దేవుడు ఆమోదించడు.
⇔ ఉపవాసకుడు చాడీలు చెప్పకూడదు. ఎవరి మీదనైనా చాడీలు చెప్పినప్పుడు వారికి ఆ ఉపవాస ఫలితం దక్కదు.

పరమార్థమిదే....
⇔ దైవభీతి, నైతికత, మానవత్వ విలువలున్న ఉత్తమ సమాజ నిర్మాణమే ఉపవాస లక్ష్యం. ఇంతటి ప్రాధాన్యమున్న రోజా లక్ష్యాలు, ఉద్దేశాలను గురించి దివ్యఖురాన్‌ ముస్లింలను ఉద్దేశించి పలు బోధనలు చేస్తుంది.
⇔ దేశ రక్షణకు పోరాడే సైనికులకు శిక్షణ ఎంత అవసరమో ప్రపంచంలో మంచిని పెంపొందించేందుకు పాటుపడే వారికి కూడా శిక్షణ అంతే అవసరం. అలాంటి తర్ఫీదు నెల రోజుల పాటు రోజాల రూపంలో ఉంటుంది. దానికి కొనసాగింపుగా ఐదు పూటలా నమాజు, దానధర్మాలు, ఖురాన్‌ పారాయణం వంటి దైనందిన కార్యక్రమాలు ఆ స్ఫూర్తిని ఏడాది వరకు కొనసాగిస్తాయి.
⇔ తనను ఎవరూ చూడకపోయినా దైవం చూస్తున్నాడని విశ్వసిస్తూ ఆకలిదప్పులు దహిస్తున్నా గుక్కెడు నీళ్లయినా నోట్లో పోసుకోడు ఉపవాసి. ఈ విధంగా నాయకుడు, పర్యవేక్షకుడు ఉన్నా లేకపోయినా, తనకు తానుగా కట్టుబడి పనిని నిబద్ధతతో చేసే లక్షణం అలవడుతుంది. బాధ్యత, జవాబుదారీతనంతో తన వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకుంటాడు. పరుల సొమ్ముకు ఆశపడడు.


Ramzan Masam, Roza, Muslim, రంజాన్‌ మాసం, రోజా, ముస్లిం

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list