MohanPublications Print Books Online store clik Here Devullu.com

మరణానికి ముందు యమధర్మరాజు సూచనలు, Before Die వైతరిణి ఎలా ఉంటుంది?






వైతరిణి ఎలా ఉంటుంది?
     జీవులు ఆయువు తీరిన తర్వాత తాను చేసిన పాపపుణ్యాలను బట్టి స్వర్గనరకాలకు వెళతారని విశ్వాసం. అలా నరకానికి వెళ్లే క్రమంలో వైతరణి అనే నదిని దాటవలసి వుంటుందని కూడా కొన్ని పురాణాలలో ఉంటుంది. ఇంతకీ ఆ వైతరణీ నది ఎలా ఉంటుందో చూద్దామా...

వైతరణీనది వంద యోజనాల వెడల్పుతో ఉంటుంది. అందులో చిక్కని రక్తం. దానితో పాటు చీము కూడా.

  మహా జలచరాలు. భరించలేనంత దుర్వాసన. ఎన్ని దీనాలాపనలు చేసినా, పాపి చేసిన పాపాలకు ఫలితం అక్కడ అనుభవించాల్సిందే. అందు కనే మరణించిన వారి సంతానం భువిపై వారి పేరు మీద గోదానం చేస్తారు. గోదానం చేస్తే వైతరిణి నదిని సులభంగా దాటగలరని శ్రీమహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి తెలియచెప్పినట్లు గరుడ పురాణంలో తెలుస్తుంది

============================================================
మరణానికి ముందు  యమధర్మరాజు సూచనలు
 Before Die 

      జన్మించిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. అంటే సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్క ప్రాణి ఏదో ఒక సమయంలో చనిపోక తప్పదు. కాకపోతే కొందరు ముందు చనిపోతారు, ఇంకొందరు వెనుక చనిపోతారు అంతే. హిందూ పురాణాల ప్రకారం యమధర్మరాజు ఆయువు ముగిసాక జీవులు యొక్క ప్రాణాలను తీసుకుని పోతాడని చెబుతారు. అయితే జీవులు ప్రాణాలను తీసుకెళ్లడానికి, వారు చనిపోవటానికి ముందే యముడు కొన్ని మరణ సూచనలను పంపుతాడట. వాటిని ఎలా తెలుసుకోవచ్చో వివరించే ఓ కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ కథలోకి వెళ్తే..
     పురాణ కాలంలో యమునా నది వడ్డున అమృతుడనే వ్యక్తి నివసించే వాడు. అయితే ఒకానొక సందర్భంలో అతనికి మరణ భయం పట్టుకుంటుంది. మృత్యువు ఎప్పుడు వస్తుందో, ఎలా తాను చనిపోతాడో తలచుకుని రోజూ భయపడేవాడు. దీంతో అతను యముడు ప్రత్యక్షమవ్వడం కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. ఈ క్రమంలో యముడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడగ్గా అందుకు అమృతుడు తాను ఎప్పుడు చనిపోతాడో, అందుకు ముందు ఎలాంటి సూచనలు వస్తాయో తనకు తెలుపాలని కోరుతాడు. అలా సూచనలు ఇస్తే తాను జాగ్రత్త పడి తన బాధ్యతలను అన్నింటినీ అందరికీ అప్పజెప్పవచ్చని నా ఆలోచన అని యముడికి చెప్తాడు.
++++++++++++++++++++++
garudapuranam
గరుడ పురాణం 796 pages
Print book ₹600/-
Mohan publications
Kotagummam
Opp.AJANTHA hotel
Rajamahendravaram
9032462565
+++++++++++++++++++++++
 గరుడ పురాణం Free PDF download:---#Garuda_puranamu

అమృతుడి కోరికను విన్న యముడు మరణం ఎప్పుడు వస్తుందో తాను చెప్పలేనని, కానీ అది వచ్చేందుకు ముందుగా కొన్ని సూచనలను పంపుతానని వాటిని తెలుసుకోవడం ద్వారా మరణం ఎప్పుడు వస్తుందో అతనే అంచనా వేసి తెలుసుకోవచ్చని యముడు అమృతుడికి వరం ఇచ్చి మాయమవుతాడు. కొన్ని రోజులు తరువాత అమృతుడు పైన చెప్పిన సంఘటన గురించి పూర్తిగా మరిచిపోతాడు. అలా చాలా ఏళ్లు గడిచిపోతాయి. అదే క్రమంలో అమృతుడు పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం, వారు పెద్దవారవ్వడం, మళ్లీ వారికి పెళ్లిళ్లు అవడం అన్నీ జరిగిపోతాయి.
అయితే అమృతుడికి ఒక రోజు యముడితో జరిగిన ఆ సంఘటన గుర్తుకు వస్తుంది. కానీ తనకు ఇంకా అలాంటి సూచనలు ఏవీ రాకపోవడంతో తనకు ఇంకా ఆయువు ఉందనే అమృతుడు అనుకుంటాడు. అయితే ఒక రోజు అతని వెంట్రుకలు తెల్లబడిపోయి, చర్మమంతా తీవ్రంగా ముడతలు పడుతుంది. అయినా అమృతుడు తనకు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు. మరో రోజు పళ్లన్నీ ఊడిపోతాయి. అప్పుడు కూడా తనకు ఆయువు తీరలేదనే భావిస్తాడు. మరి కొంత కాలానికి అతనికి కళ్లు కనిపించకుండా పోతాయి. చివరిగా పక్షవాతం వచ్చి మంచాన పడతాడు. ఆ రెండు సందర్భాల్లోనూ తనకు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు.
ఇక చివరికి ఒక రోజు యముడు వచ్చి అమృతుడికి ఆయువు తీరిందని, అతని ప్రాణాలను తీసుకుపోతానని అమృతుడికి చెబుతాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన అమృతుడు తనకు చావు సూచనలు ఎలాంటివి రాలేదని, అయినా నువ్వు వచ్చి ప్రాణాలను తీసుకుపోతానంటున్నావు, అప్పుడు నీ వరం ఉట్టి మాటే కదా అని యముడ్ని ప్రశ్నిస్తాడు. దీంతో యముడు 4 మరణ సూచనలను నీకు ఇది వరకే తెలియజేశాను. అయినా నువ్వు గ్రహించలేదు. ఇప్పుడు నీ ప్రాణాలను తీసుకుపోవాల్సిందేనంటాడు.
అప్పుడు అమృతుడు ఏంటా 4 సూచనలు అని అడగ్గా, యముడు అందుకు పైన కలిగిన 4 అనారోగ్యాల గురించి(వెంట్రుకలు తెల్లబడడం, పళ్లు ఊడిపోవడం, చూపు పోవడం, పక్షవాతం రావడం) అమృతుడికి వివరిస్తాడు. అప్పుడు అమృతుడు నిజమేనని ఒప్పుకోగా యముడు అతని ప్రాణాలను తీసుకెళ్తాడు. ఈ కథను బట్టి మనకు తెలిసిందేమిటంటే, మనకు కలిగే అనారోగ్యాలే మన మరణాన్ని నిర్దేశిస్తాయి. వాటి గురించి తెలుసుకుని జాగ్రత్త పడితేనే మన ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వస్తుందని తెలుస్తుంది.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list