MohanPublications Print Books Online store clik Here Devullu.com

సీమంతము(పాపట తీయుట)_Simantam


దుష్టగ్రహ నివారణ కోసం
 గర్భిణీ స్త్రీలకు
 సీమంతోన్నయనం చేయాలి.

    సీమంతస్య - కేశరచనా విశేషస్య, ఉన్నయనం - ఉత్తొలనం ఆత్రేతి - సీమన్తోన్నయనం ఇతి గర్బ సంస్కార భేదః కేశరచనా విశేషముచే సీమంతము (పాపట తీయుట) సమానముగ నెత్తియెత్తుచు చేయు నొక గర్భ సంస్కారమునకు సీమంతోన్న యనిగాని లేక సీమంతమనిగాని వ్యవహారము.
""షష్ఠే చతుర్ధేష్టమే ఏతేషా మన్యత మేమాసి సీమంతోన్న యనాఖ్య కర్మకుర్యాత్‌'' అనువిధి ననుసరించి, గర్బము థరించిన దాది, నాలుగవమాసమునగాని, ఆరవమాసమునగాని, అష్టమమాసమునగాని, సీమంతోన్న యనాఖ్య గర్బసంస్కారక కర్మ చేయదగినది.
ప్రధమే గర్బే చతుర్ధేమాసి షష్ఠే೭ ష్టమేవా శుభే೭హని
దంపతీమంగళస్నాతే భూత్వా. ""జనిష్యమాణ సర్వగర్బాణాంబీజ గర్బసముద్బవైనోని బర్హణ ద్వారా ప్రతిగర్బ సంస్కారాతిశయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, సీమంతోన్నయనం కర్మ కరిష్యేయని సంకల్పింతురు.
తోలిగర్బముల, నాలుగు. ఆరు, ఎనిమిది మాసములలో నీ సీమంత మాచరింతురు. ఈసీమంతముచే, గర్బ బీజ దోషశాంతులు గల్గును. అనంతర గర్బములకు నీ సంస్కారబలముచే శుద్ధిగల్గును. పురుష జననమునకు కారణమగును. కాన సూత్రకారులీ సీమంత సంస్కారమునకు ప్రాముఖ్య మొసంగిరి. ఉ సంస్కారము సహితము తిది వార నక్షత్ర లగ్నములనెరింగి, శుభ తిది వారాదులలోనే చేయదగినది.
తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది సీమంతం.
కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం). సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం.
సీమంత సమయంలో గర్భిణీ తలదువ్వి పాపట తీయటం ఆచారం.పాపట వంకరతీస్తే బతుకు వంకర అవుతుందన్న విశ్వాశం ఉంది. ఇందులో మేడిపండ్లు, వనస్పతి మొదలగు శుభకరమైన పదార్థములను ఉపయోగించి భర్త భార్యను మేడిచెట్టువలె బలముగా నుండుమని, వనస్పతివలె సంతాన సంపదను పొందుమని అర్థం వచ్చే మంత్రములను వినిపించును. అలాగే, ప్రజాపతి అదితికి సీమంతోన్నయనము చేసినట్లు నీకు కూడా సీమంతోన్నయనము చేసి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, వృద్ధాప్యము వరకు దీర్ఘజీవిని చేసెదను అని ఇంకొక మంత్రము పలుకును. అటు తర్వాత భర్త దేవతలను ప్రార్థించి గర్భదోషములు తొలగింజేయు, భవిష్యత్త్ సంతాన కళ్యాణమునకై గర్భపోషణ చేసెడి నేతితో చరుపాక ప్రదర్శనము మొదలగు క్రియలను చేయును.
కాబట్టి సీమంతమనగా మనము చేసుకునే వేడుక గాదు. తల్లి, అత్తగారు, భర్త, శ్రేయోభిలాషులతో సంతోషముగా, ముత్తైదువుల ఆశీర్వాదము పొందుట ఏ మహిళకైనా మంచిదే. కానీ, దాని పేరిట పైన చెప్పిన సీమంత ప్రక్రియను చేయకుండుట శాస్త్ర సమ్మతము కాదు.
సీమంతం అనే వేడుక జరపడం వలన ఆ స్త్రీకి మానసికపరమైన ఉల్లాసం లభిస్తుంది. సంతానం గల ముత్తయిదువులంతా వచ్చి ఆశీర్వదించడం వలన వారి నుంచి ఆమెకి అవసరమైన శక్తి అందుతుంది. ప్రసవ సంబంధమైన ఆందోళన ఆమెకి లేకుండా చేస్తుంది.
ఏ శుభకార్యాల్లో లేని విధంగా సీమంతం లో గాజులు తొడిగి పండంటి బిడ్డను ఇమ్మని ఆశీర్వదిస్తారు. అలా గాజులు ఎందుకు తొడుగుతారంటే గర్భం ధరించిన స్త్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి. చేతుల్లో నరాలకీ, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది. అలా ఎక్కువ గాజులు తొడగడం వలన గర్భకోశం పై సరైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list